ప్రపంచంలోనే సంపన్న శునకం.. ఆస్తులు రూ.3,300 కోట్లు!

Worlds Richest Dog: కుక్క ఎంతో విశ్వాసం గల జంతువు.. యజమానుల కోసం ప్రాణాలైనా ఇస్తుంది. యజమాని ఏది చెప్పినా చేస్తుంది.. త్వరగా అర్థం చేసుకుంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కుక్కలు ఉన్నాయి.

Worlds Richest Dog: కుక్క ఎంతో విశ్వాసం గల జంతువు.. యజమానుల కోసం ప్రాణాలైనా ఇస్తుంది. యజమాని ఏది చెప్పినా చేస్తుంది.. త్వరగా అర్థం చేసుకుంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కుక్కలు ఉన్నాయి.

ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ఇంటికి వచ్చిన తర్వాత కాస్త రిలాక్స్ గా ఉండేందుకు పెంపుడు జంతువులకు పెద్దపీట వేస్తున్నారు. ముఖ్యంగా కుక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మనిషికి కుక్కలతో అనుబంధం ఏన్నో ఏళ్ల నుంచి ఉందని అంటున్నారు. ఇండ్లల్లో ఎన్నో రకాల కుక్క జాతులను పెంచుకుంటున్నారు. కుక్క విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. యజమాని కనిపిస్తే చాలు తోక ఊపుకుంటూ వచ్చేస్తుంది..రాత్రి పూట బౌ..భౌ అంటూ దొంగలకు చుక్కలు చూపిస్తుంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కుక్క గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

ప్రపంచంలో అత్యంత సంపన్నమైన కుక్కలు ఉన్న విషయం మీకు తెలుసా? అందులో ఓ కుక్క ఆస్తి రూ.3,300 కోట్ల ఆస్తులు ఉన్నాయంటే నమ్ముతారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమేనండీ. జర్మన్ షెఫర్డ్ కుక్క పేరు గుంథేర్ – 6. ఇది ప్రపంచంలో అతి సంపన్న కుక్కగా గిన్నిస్ రికార్డులకెక్కింది. దీనికి ప్రత్యేకంగా విమానం, యాట్ సాహ బీఎండబ్ల్యూ కారు ఉన్నాయి. ప్రతి రోజు దీనికి అత్యంత ఖరీదైన ఫుడ్ అందిస్తుంటారు. దీని సేవలో 27 మంది సిబ్బంది ఉన్నారు. చుట్టూ రక్షణ ఏర్పాటు చేయబడి ఉంటుంది.

ఈ జర్మన్ షెపర్డ్ జాతి కుక్క జర్మన్‌కి కర్లోటా లీబెన్ స్టీన్ కుమారుడు 1992లో చనిపోయే ముందు తన ఆస్తినంతటిని గుంథేర్ – 3 పేరు మీద రాసిఇచ్చాడు. ఇటలీకి చెందిన వ్యాపారవేత్త మౌరిజియో మియాన్ కి దాని బాధ్యతలను అప్పజెప్పారు.  దాదాపు 30 ఏళ్లు గా మియాన్ గుంథర్ వారసులను సంరక్షిస్తూ వస్తున్నాడు. అంతేకాదు గుంథేర్ – 3 ఆస్తులను పెంచుకుంటూ వచ్చాడు. ప్రస్తుతం గుంథర్ – 6 తన ముత్తాత ఆస్తిని అనుభవిస్తుంది. ఇటీవల ప్రముఖ పాప్ సింగర్ మడోన్నా నివాసం సొంతం చేసుకుంది. ఈ జర్మన్ షెపర్డ్ జాతి కుక్క మీద ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ‘గుంథర్స్ మిలియన్’ తో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యింది.

Show comments