iDreamPost
android-app
ios-app

ఎలాన్ మస్క్ ఇండియా టూర్ క్యాన్సిల్! రూ.25 వేల కోట్ల ప్లాన్ వాయిదా!

  • Published Apr 21, 2024 | 5:16 PM Updated Updated Apr 21, 2024 | 5:16 PM

భారత్ లో అతి పెద్ద.. ఎలెక్ట్రిక్ కార్స్ యజమాని.. ఎలాన్ మస్క్ భారత్ కు విచ్చేయనున్నారనే వార్తలు వినిపించాయి. అయితే తాజాగా తానూ భారత్ టూర్ ను వాయిదా వేసినట్లు వెల్లడించారు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

భారత్ లో అతి పెద్ద.. ఎలెక్ట్రిక్ కార్స్ యజమాని.. ఎలాన్ మస్క్ భారత్ కు విచ్చేయనున్నారనే వార్తలు వినిపించాయి. అయితే తాజాగా తానూ భారత్ టూర్ ను వాయిదా వేసినట్లు వెల్లడించారు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Apr 21, 2024 | 5:16 PMUpdated Apr 21, 2024 | 5:16 PM
ఎలాన్ మస్క్ ఇండియా టూర్ క్యాన్సిల్! రూ.25 వేల కోట్ల ప్లాన్ వాయిదా!

ఇండియాలో ఎలెక్ట్రిక్ వెహికిల్స్ తయారీ సంస్థలలో ఒకటి టెస్లా. ఈ సంస్థ యజమాని.. ఎలాన్ మస్క్. అయితే, ఈ నెల 21, 22 తేదీలలో ఎలాన్ మస్క్ ఇండియా కు రావాల్సి ఉంది. ఇప్పటివరకు ఎలాన్ మస్క్ ఇండియాకు రాలేదు.. ఆయన భారత్ కు రావడం ఇదే మొదటి సారి. దీనితో టెక్ దిగ్గజ సంస్థలు ఎలాన్ మస్క్ రాక కోసం ఎదురుచూస్తున్న క్రమంలో.. ఆయన తన టూర్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్నీ మస్క్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. తానూ ఇండియాకు రాకపోవడం వెనుక ఉన్న కారణాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఎలాన్ మస్క్ ఇండియా ట్రిప్ వాయిదా వేసుకోడానికి గల కారణం.. టెస్లా మేనేజ్మెంట్ లో చూసుకోవాల్సిన కొన్ని రెస్పాన్సిబిలిటీస్ .. ప్రస్తుతానికి భారత్ టూర్ ను వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అంతే కాకూండా ఈ సంవత్సరం చివరి నాటికి ఇండియా కు వచ్చేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. అయితే ఈ నెల 23 న అమెరికాలో జరిగే టెస్లా ఇన్వెస్ట్మెంట్ మీటింగ్స్ కు అటెండ్ కావాల్సి ఉంది. ఇటీవల కాలంలో విడుదల చేసిన ఫలితాలలో సంస్థ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. దీనితో కంపెనీ ఇన్వెస్టర్స్, షేర్ హోల్డర్స్ అందరు కూడా ఆందోళనకు గురి అవుతున్నారు. ఈ నేపధ్యంలో వాళ్లందరితో చర్చలు జరిపేందుకు మస్క్ అమెరికాకు వెళ్లాల్సి వస్తుంది. దీనితో ఈ నెల 21, 22 తేదీల్లో ఇండియాకు రావాల్సిని ట్రిప్ ను వాయిదా వేసుకున్నారు. అయితే ఒకవేళ మస్క్ కనుక ఇండియాకు వస్తే.. ఇండియాలో ఉన్న టెస్లా తయారీ సంస్థలలో..శాటిలైట్ కమ్యూనికేషన్ లాంటి కొన్ని కొత్త ప్లాన్స్ ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు మీడియా భావిస్తోంది. అంతే కాకూండా.. భారత్ లో 25,000 కోట్ల రూపాయల పెట్టుబడిని కూడా పెట్టే అవకాశం ఉంది.

అయితే టెస్లా కార్స్ కు ఇండియాలో ఎక్కువ డిమాండ్ పెంచే దిశగా మస్క్ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఇండియాలోని చాలా సంస్థలు ఎలెక్ట్రిక్ వాహనాల తయారీ విధానంలో.. కొత్త ప్లాన్స్ ను అమలు చేసే విధానంలో ఉన్నాయి. ఇక ఎలాన్ మస్క్ ఇండియాను విసిట్ చేసి.. అనుకున్న విధంగా పెట్టుబడి పెడితే మాత్రం రానున్న రోజుల్లో.. ఇండియాలో కూడా ఎలెక్ట్రిక్ వాహనాల వినియోగదారులు పెరుగుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఎలాన్ మస్క్ రాక కోసం ఇండియాలోని టెక్ దిగ్గజ సంస్థలు ఎదురుచూస్తున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.