Swetha
సోషల్ మీడియా యుగం మొదలైన తర్వాత .. ఈ మధ్య కాలంలో దాదాపు అందరూ.. యూట్యూబ్ లో వ్లాగ్స్ చేస్తూ ఉంటున్నారు. ముఖ్యంగా వాటిలో ట్రావెలింగ్ వ్లాగ్స్ కు ఆదరణ బాగా లభిస్తోంది. వాటిలో రీసెంట్ గా ఒక ట్రావెల్ వ్లాగర్ మయన్మార్ లో ఉంటున్న తెలుగు వారి గురించి పరిచయం చేసిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా యుగం మొదలైన తర్వాత .. ఈ మధ్య కాలంలో దాదాపు అందరూ.. యూట్యూబ్ లో వ్లాగ్స్ చేస్తూ ఉంటున్నారు. ముఖ్యంగా వాటిలో ట్రావెలింగ్ వ్లాగ్స్ కు ఆదరణ బాగా లభిస్తోంది. వాటిలో రీసెంట్ గా ఒక ట్రావెల్ వ్లాగర్ మయన్మార్ లో ఉంటున్న తెలుగు వారి గురించి పరిచయం చేసిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Swetha
ప్రస్తుతం చిన్న పిల్లల దగ్గరనుంచి పెద్దవారి వరకు.. ప్రతి ఒక్కరు ఉదయం లేచింది మొదలు నిద్రపోయే వరకు.. వారి సగం సమయాన్ని సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ ఇప్పుడు నిత్యావసరాలలో ఒకటిగా మారిపోయిందని చెప్పి తీరాలి. ఎవరికీ ఏ సందేహం కలిగిన వెంటనే యూట్యూబ్ లో సెర్చింగ్ స్టార్ట్ చేసేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ లో చానెల్స్ ను క్రియేట్ చేసుకుని.. వ్లాగ్స్ , వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. దాని ద్వారా డబ్బును సంపాదించుకుంటున్నారు. ఆ వీడియోస్ లో ఏ మాత్రం కంటెంట్ ఉన్నా .. ఆ వీడియో వెంటనే వైరల్ అయిపోతూ ఉంటుంది. ఇక ఛానెల్ ద్వారా డబ్బు సంపాదించుకోడమే కాకుండా.. కొంతమంది అందరికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ను కూడా ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలో ముఖ్యంగా.. ట్రావెల్ వ్లాగ్స్ కు ఆదరణ బాగా లభిస్తోంది. అయితే తాజాగా యూట్యూబ్ లో ఉమా తెలుగు ట్రావెలర్ అనే ఓ ఛానల్ ద్వారా.. ఓ వ్యక్తి మయన్మార్ లో ఉంటున్న తెలుగు వారి గురించి పరిచయం చేసిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యూట్యూబ్ లో వచ్చే వ్లాగ్స్ అన్ని ఒక ఎత్తైతే.. ట్రావెల్ వ్లాగ్స్ ఒక ఎత్తు. ఈ మధ్య కాలంలో ట్రావెల్ వ్లాగ్స్ కు ప్రత్యేకమైన ఆదరణ లబిస్తోంది. ముఖ్యంగా ఇతర దేశాల్లో నివసించే ఇండియన్స్ అక్కడి ప్రదేశాలను వ్లాగ్స్ ద్వారా పరిచయం చేస్తుంటే.. మరి కొంతమంది ఇండియన్స్ వారి జాబ్స్ వదిలేసి మరీ.. ఇతర దేశాలు ట్రావెల్ చేస్తూ.. యూట్యూబ్ లో వ్లాగ్స్ రూపంలో అందరికి అన్నిటిని పరిచయం చేస్తున్నారు. దీనితో ఆ వీడియోస్ కు మంచి ఆదరణ లభిస్తోంది. ఇటీవల ప్రపంచ యాత్రికుడు అంటూ నా అన్వేషణ పేరుతో యూట్యూబ్ లో ట్రావెలింగ్ వ్లాగ్స్ చేస్తూ.. ఓ వ్యక్తి ఎంత ఫేమస్ అయ్యాడో చూశాము. ఇక ఇప్పుడు ఉమా తెలుగు ట్రావెలర్ పేరుతో ఉమా అనే వ్యక్తి తన జాబ్ ను వదిలేసి మరీ ట్రావెల్ చేస్తూ.. ఆ వీడియోస్ ను యూట్యూబ్ లో పెడుతున్నాడు. వీటికి మంచి ఆదరణ లభిస్తోంది. అయితే, రీసెంట్ గా ఉమా.. తన ట్రావెల్ లో భాగంగా అతను మయన్మార్ వెళ్ళాడు. అక్కడ నివసిస్తున్న తెలుగు వారిని మన తెలుగు వారందరికీ పరిచయం చేశాడు. దీనితో ఆ వీడియోస్ కు మంచి ఆదరణ లభిస్తోంది.
ఎందుకు మయన్మార్ కు సంబంధించిన వీడియోస్ అంత పాపులర్ అవుతున్నాయి అన్న విషయానికొస్తే.. మయన్మార్ ను 1989లో బర్మా అని కూడా పిలిచేవారు. అయితే, యుఎస్ఏ .. యూకే లాంటి కంట్రీస్ లో అయితే, తెలుగు వారిని చూడొచ్చు కానీ.. బర్మాలో మన తెలుగు వారు ఉండడం అనేది చాలా అరుదు. కానీ, ఉమా అనే ట్రావెలర్ అక్కడ 200ఏళ్ల నుంచి నివసిస్తున్న మన తెలుగు వారిని కలిసి.. వారి ద్వారా ఎన్నో విషయాలను అందరికి తెలియజేశాడు. అక్కడ భాష , పద్ధతులు వేరైనా కూడా.. వారు మాత్రం ఎంతో స్పష్టంగా తెలుగు మాట్లాడుతూ.. ఇంకా మన తెలుగు పద్ధతులు, సాంప్రదాయలనే అనుసరిస్తున్నారు. బ్రతుకు తెరువు కోసం కిళ్ళీలు కట్టుకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. తెలుగు వారు అయ్యి ఉండి.. వారంతా బర్మాలో నివసించడానికి గల కారణాలను.. ఇంకా ఎన్నో విషయాలను అక్కడి వారితో మాట్లాడి .. ఉమా అనే ఈ ట్రావెలర్ అందరితో పంచుకున్నాడు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.