iDreamPost
android-app
ios-app

సముద్ర తీరాన వింత పదార్థం.. సైంటిస్టులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తూ..

కెనడా సముద్ర తీరంలో వింత పదార్థం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఆ మిస్టరీ పదార్థం సైంటిస్టులను సైతం షాక్ అయ్యేలా చేస్తుంది. ఇంతకీ ఆ పదార్థంపై మెరైన్ సైంటిస్టులు ఏం చెప్పారంటే?

కెనడా సముద్ర తీరంలో వింత పదార్థం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఆ మిస్టరీ పదార్థం సైంటిస్టులను సైతం షాక్ అయ్యేలా చేస్తుంది. ఇంతకీ ఆ పదార్థంపై మెరైన్ సైంటిస్టులు ఏం చెప్పారంటే?

సముద్ర తీరాన వింత పదార్థం.. సైంటిస్టులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తూ..

సముద్రం ఎన్నో జీవరాశులకు ఆశ్రయాన్ని కల్పిస్తుంది. వందలకొద్ది జల చరాలు సముద్రంలో తమ మనుగడ సాగిస్తుంటాయి. సముద్రపు జీవుల నుంచి ఉపయోగకరమైన పదార్థాలను సేకరిస్తుంటారు. మందులు, కాస్మోటిక్స్ తయారీలో వినియోగిస్తుంటారు. సముద్రంపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది జీవిస్తున్నారు. సముద్రంలో రకరకాల జీవజాతులు నివసిస్తుంటాయి. వాటిలో కొన్ని జీవులు తీరానికి కొట్టుకొచ్చి పర్యాటకులను కనువిందు చేస్తుంటాయి. ఒక్కోసారి ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. వింత జీవులను చూసి సంబ్రమాశ్చర్యాలకు గురవుతుంటారు. కాగా అప్పుడప్పుడు సముద్ర తీరాల్లో వింత పదార్థాలు, వింత ఆకారాల్లో దర్శనమిస్తుంటాయి.

అలాంటివి చూసినప్పుడు కాస్త భయానికి కూడా గురవుతుంటారు. ఆ మిస్టరీ పదార్థం ఏంటీ అని ఆలోచిస్తుంటారు. దాని గురించి తెలుసుకునేందుకు ఉత్సుకత చూపిస్తుంటారు. చివరిక అదేంటో తెలియక ఉసూరుమంటారు. ఆఖరికి సైంటిస్టులు ఆ మిస్టరీ పదార్థాలపై పరిశోధన చేసి వాటి గుట్టు తేలుస్తారు. కొన్ని సార్లు వాటిని గుర్తించడం పరిశోధకులకు సైతం కష్టతరమైపోతుంది. కొన్ని పదార్ధాలు, వస్తువులు తీరానికి కొట్టుకొచ్చిన అవి గుర్తుపట్టలేని విధంగా ఉంటాయి. మిస్టరీగా మిగిలిపోతాయి. అలాంటిదే ఓ వింత పదార్థం కెనడాలోని సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది. కెనడాలోని పలు బీచ్ లలో ఇటీవల ఓ వింత పదార్థం కొట్టుకురావడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. చూడ్డానికి పిండి ముద్దలాగ జిగటగా ఉండే ఈ పదార్ధం ఏంటనేది ఎవరూ గుర్తించలేకపోయారు.

తాజాగా ఇలాంటి వింత పదార్థాన్ని న్యూ ఫౌండ్ లాండ్ సముద్ర తీరాల్లో గుర్తించారు. విభిన్నమైన ఆకృతిలో ఉండడంతో అదేంటో తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఆ మిస్టరీ పదార్థం వంట నూనె వాసన వస్తుందని అక్కడి స్థానికుడు చెప్పాడు. బీచ్ లలో ఇలాంటి అసాధారణ పదార్థాలు సెప్టెంబర్ నుంచి కనిపిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ పదార్థాలు ఏంటనేది తెలుసుకునేందుకు అక్కడి అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

వీటి వల్ల మానవాళికి ప్రయోజనం ఉంటుందా లేదా ముప్పు ముంచుకొస్తుందా అన్న కోణంలో పరిశోధనలు సాగిస్తున్నారు. ఇది చమురు ఉత్పత్తులకు చెందిన పదార్థమనే వాదనను కెనడా పర్యావరణ, వాతావరణ మార్పుల సంస్థ కొట్టిపారేసింది. ఇందులో ఎలాంటి జీవ సంబంధ కణజాలం లేదని కెనడాకు చెందిన సముద్ర శాస్త్ర నిపుణుడు తేల్చి చెప్పాడు. మరి సముద్ర తీరంలో వింత పదార్థం కనిపించిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.