Keerthi
సాధారణంగా సముద్ర తీరాల్లో సరదాగా సేద తీరాలని వెళ్తున్న కొంతమంది ఈ మధ్య షార్క్ చేపల దాడికి గురవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సముద్రంలో ఈత కొడుతు సేద తీరుతున్న ఓ నాలుగురిపై ఒకేసారి షార్క్ చేప అత్యంత దారుణంగా దాడి చేసింది. ఇంతకి ఎక్కడంటే..
సాధారణంగా సముద్ర తీరాల్లో సరదాగా సేద తీరాలని వెళ్తున్న కొంతమంది ఈ మధ్య షార్క్ చేపల దాడికి గురవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సముద్రంలో ఈత కొడుతు సేద తీరుతున్న ఓ నాలుగురిపై ఒకేసారి షార్క్ చేప అత్యంత దారుణంగా దాడి చేసింది. ఇంతకి ఎక్కడంటే..
Keerthi
సాధారణంగా బీచ్ అంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా ఈ విషయంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతిఒక్కరూ ఈ సముద్రంలోని సేద తీరాలని, చాలా సమయం ఇక్కడ గడపాలని ఆసక్తి చూపిస్తారు. అయితే సహజంగా సముద్రల్లో రకరకాల చేపాలతో పాటు పెద్ద పెద్ద షార్క్ చేపలు కూడా ఉంటాయనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ షార్క్ చేపలు ఎంత డేంజరెస్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. క్షణాల్లో చేపాలనైనా, మనుషాలనైనా ఈ షార్క్ చేపలు అనేవి దాడి చేస్తుంటాయి. అయితే ఇటీవల కాలంలో ప్రపంచ దేశాల్లో ఈ షార్క్ చేప దాడులు అనేవి ఎక్కువగా చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వీటి దాడిలో మృతి చెందినవారు కూడా ఎక్కువైపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సముద్రంలో ఈత కొడుతు సేద తీరుతున్న ఓ నాలుగురిపై ఒకేసారి షార్క్ చేప అత్యంత దారుణంగా దాడి చేసింది. ఇంతకి ఎక్కడంటే..
తాజాగా సౌత్ పాడ్రే ద్వీపంలోని స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గురువారం(జులై 4) న సౌత్ పాడ్రే ద్వీపంలోని సోటో బీచ్ లో సరదాగా సెలబ్రేషన్స్ నిర్వహించుకుంటున్న నలుగురి అనుహ్యంగా షార్క్ చేప దాడి చేసింది. మొదట ఇద్దరు వ్యక్తలపై షార్క్ దాడి చేసింది. ఆ ఇద్దరు ఆర్తనాలు చేయడంతో కాపాడేందుకు ఇద్దరు వ్యక్తులో ప్రయత్నించారు. అయితే వారిపై కూడా షార్కులు దాడి చేశాయి. ఈ దాడి ఘటనలో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దక్షిణ పాడ్రే ద్వీపం నగర కార్యదర్శి నిక్కీ సోటో తెలిపిన వివరాల ప్రకారం..గురవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సముంద్రంలో సెలబ్రేషన్ చేసుకుంటున్న ఇద్దరిపై షార్క్ లు దాడి చేశాయి. ఆ షార్కులు దాదాపు 6 అడుగుల పొడవు ఉన్నట్లు డ్రోన్ ద్వారా తెలిసిందని అన్నారు. ఈ ఘటన చూసిన స్థానికులు చెబుతున్నట్లు గేమ్ వార్డెన్ కెప్టెన్ క్రిస్ డౌడీ తెలిపారు.
ఇక షార్క్ దాడిలో గాయపడిన వారిలో ఒకరిని బ్రౌన్స్‌విల్లేలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. మరోకరిని మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు.షార్క్ దాడిలో గాయపడ్డ ఇద్దరిని కాపాడేందుకు వెళ్లిన మరో ఇద్దరికి స్వల్పంగా గాయలైనట్లు అధికారులు తెలిపారు.జులై4 స్వాతంత్ర వేడుకలు ఎంతో సంబరంగా నిర్వహిస్తుంటారు.. కానీ షార్క్ దాడి ఘటన వల్ల అక్కడ వేడుకలకు అంతరాయం కలిగించాయి. ఈ ఘటన చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
JUST IN: Four shark attacks reported at South Padre Island in Texas during Fourth of July celebrations.
Game Warden Capt. Chris Dowdy says all the attacks happened within two hours of each other.
One woman had a chunk bitten out her her leg as Good Samaritans were seen dragging… pic.twitter.com/Ng4aMKhjmi
— Collin Rugg (@CollinRugg) July 5, 2024