iDreamPost
android-app
ios-app

బంపరాఫర్‌.. పెళ్లి చేసుకుంటే రూ.31 లక్షలు ఇస్తారు.. ఎక్కడంటే

  • Published Aug 30, 2024 | 11:19 AM Updated Updated Aug 30, 2024 | 11:19 AM

South Korea-31 Lakh Marriage: ప్రభుత్వం బంపరాఫర్‌ ప్రకటించింది. పెళ్లి చేసుకుంటే.. 31 లక్షల రూపాయల ఇస్తామని చెబుతోంది. ఇంతకు ఈ ఆఫర్‌ ఎక్కడంటే..

South Korea-31 Lakh Marriage: ప్రభుత్వం బంపరాఫర్‌ ప్రకటించింది. పెళ్లి చేసుకుంటే.. 31 లక్షల రూపాయల ఇస్తామని చెబుతోంది. ఇంతకు ఈ ఆఫర్‌ ఎక్కడంటే..

  • Published Aug 30, 2024 | 11:19 AMUpdated Aug 30, 2024 | 11:19 AM
బంపరాఫర్‌.. పెళ్లి చేసుకుంటే రూ.31 లక్షలు ఇస్తారు.. ఎక్కడంటే

ఈ సమాజాన్ని నడిపించే అతి ముఖ్యమైన బంధం వివాహం. ఈ ప్రపంచం ముందుకు కొనసాగుతుందంటే.. పెళ్లి బంధమే కారణం. ఇక మనదేశంలో వివాహ వ్యవస్థకు ఎంతో పవిత్రత ఉంది. పెళ్లి కూడా ఓ పవిత్ర కార్యంగా భావిస్తారు. అయితే కాలం మారుతున్న కొద్ది మన దేశంలో కూడా పెళ్లి బంధం బలహీనం అవుతుంది. విడాకులు తీసుకునే దంపతుల సంఖ్య పెరుగుతుంది. ఇక పెరుగుతున్న ఆర్థిక ఖర్చులు, ఇతర సమస్యల కారణంగా నేటి కాలం యువత.. పెళ్లి అంటేనే విముఖత చూపుతున్నారు. కాదంటే.. 30 ఏళ్ల తర్వాతనే పెళ్లి చేసుకుంటామంటున్నారు. ఇక కొన్ని దేశాల్లో అయితే యువత పెళ్లి వద్దు సింగిల్‌ లైఫ్‌ ముద్దు అంటున్నారు.

యువత ఇలా పెళ్లి చేసుకోకుండా ఉంటే.. భవిష్యత్తులో అనేక నష్టాలు సంభవించే అవకాశం ఉండటంతో.. ప్రభుత్వాలు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. యువత పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనేందుకు ప్రోత్సాహించడం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాయి. నగదు ప్రోత్సాహకాలతో పాటు.. అనేక ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి మరో దేశం వచ్చి చేరింది. పెళ్లి చేసుకుంటే.. 31 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. ఆ వివరాలు..

మన దేశంలో యువత పెళ్లి కోసం అప్పులు చేస్తుండగా.. కొన్ని దేశాల్లో మాత్రం ప్రభుత్వమే వివాహం చేసుకొండి డబ్బులు ఇస్తామని ప్రకటిస్తుంది. గతంలో జపాన్‌ ఇలాంటి ప్రకటన చేయగా.. ఇప్పుడీ జాబితాలో దక్షిణ కొరియా కూడా చేరింది. పెళ్లి చేసుకుంటే 31 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. అందుకు కారణం.. అక్కడ యువత పెళ్లి, పిల్లలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదంట. దాంతో గత కొన్నాళ్లుగా దక్షిణ కొరయా దేశంలో జననాల రేటు భారీగా పడిపోయిందంట. ఇది ఇలా కొనసాగితే.. భవిష్యత్తులో పెను ప్రమాదం ఏర్పడే అవకాశం ఉండటంతో.. పెళ్లి చేసుకుని, పిల్లలు కనే దిశగా యువతను ప్రోత్సాహించడం కోసం దక్షిణ కొరియా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది.

దక్షిణ కొరియాలోని బూసన్‌ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. పెళ్లి చేసుకునే జంటలకు 38 వేల డాలర్లు మన కరెన్సీలో చెప్పాలంటే.. 31 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. గత కొంత కాలంగా దక్షిణ కొరియాలో జనాభా వేగంగా తగ్గిపోతుంది. అక్కడ ప్రతి మహిళా సగటున 0.72 మంది పిల్లలను కంటుందని నివేదికలు వెల్లడించాయి. అంటే ఒక మహిళ ఒక్క బిడ్డను కూడా కనడం లేదు అని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం దక్షిణ కొరియా జనాభా 5 కోట్లు మాత్రమే. దాంతో జనాభా పెరుగుదలను, ప్రసూతి రేటును పెంచడం కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా యువతను పెళ్లి, పిల్లలు కనే దిశగా ప్రోత్సాహించడం కోసం వివిధ రకాల పథకాలు ప్రకటిస్తోంది.

దక్షిణ కొరియా మాదిరిగానే జపాన్‌ కూడా తక్కువ జనాభా సమస్యలను ఎదుర్కొంటుంది. గతంలో ఏడాదికి 50 లశ్రీలుగా ఉన్న జననాల రేటు.. ప్రస్తుతం 7.60 లక్షలకు పడిపోయింది. దాంతో జపాన్‌ ప్రభుత్వం పెళ్లిళ్లను ప్రోత్సాహించడం కోసం రకరకాల పథకాలు తీసుకొచ్చింది.