Vinay Kola
Beer: యూరిన్ బీర్.. వినటానికి చాలా కంపరంగా ఇబ్బందికరంగా ఉన్నా కాని ఇది నిజం. ఛండాలంగా మూత్రంతో బీర్ తయారు చెయ్యడం ఏంటి అనుకుంటున్నారా? దీని వెనుక ఓ కారణం ఉంది.
Beer: యూరిన్ బీర్.. వినటానికి చాలా కంపరంగా ఇబ్బందికరంగా ఉన్నా కాని ఇది నిజం. ఛండాలంగా మూత్రంతో బీర్ తయారు చెయ్యడం ఏంటి అనుకుంటున్నారా? దీని వెనుక ఓ కారణం ఉంది.
Vinay Kola
మద్యం ప్రియుల్లో బీర్ కి మామూలు క్రేజ్ ఉండదనే చెప్పాలి. విస్కీ, వోడ్కా, రెడ్ వైన్ ఎన్ని ఉన్నా కూడా చలువ కోసం బీర్ తాగాల్సిందే. ఇక ఎండాకాలం వచ్చిందంటే బీర్లకు మామూలు డిమాండ్ ఉండదు. ఒంట్లో వేడి దిగాలంటే చల్లని బీర్ కడుపులో పడాల్సిందే. ఏ చిన్న అకేషన్ వచ్చినా కాని బీర్ బాటిల్స్ ఫుల్ గా లేపేస్తారు. భగ భగ మండే ఎండలకు బీరే ఉపశమనమని మందుబాబులు భావిస్తుంటారు. అయితే బీర్ లవర్లకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాకింగ్ న్యూస్ ఒకటి వచ్చేసింది. ఇక ఆ షాకింగ్ న్యూస్ ఏంటి? దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.
సింగపూర్ దేశం మద్యం తయారీలో రక రకాల ప్రయోగాలు చేస్తుంది. చాలా విచిత్రంగా ఆలోచిస్తుంది. తాజాగా ఓ విచిత్రమైన బీర్ ని తయారు చేసేందుకు సిద్ధం అవుతుంది. అదే యూరిన్ బీర్. వినటానికి చాలా కంపరంగా వికారంగా ఇబ్బందికరంగా ఉన్నా కాని ఇది అక్షరాల నిజం. దీని పేరు ‘న్యూబ్రూ’ బీరు. దీనిని మూత్రంతో ఇంకా మురుగు నుంచి శుద్ధి చేసిన నీటితో తయారు చేస్తున్నారట. మూత్రం, మురుగును శుద్ధిచేసి తీసిన నీటిని ‘నీవాటర్’ అని అంటారు. పైగా ఈ బీర్ ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పాటించి మరి తయారు చేస్తున్నారట. శుద్ధి చేస్తోన్న ఈ నీటిని తాగునీరుగా కూడా వాడుకోవచ్చట. పైగా ఈ నీరు సింగపూర్‌లో ఓ బ్రాండ్ గా కూడా అమ్ముడవుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ నీటితో చేసిన బీర్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.
ఈ బీరును తయారు చేయడానికి 95శాతం నీవాటర్‌ను వాడుతున్నారట. ఇంకా అలాగే ఈ బీరు తయారీలో జర్మన్ బార్లీ మాల్ట్‌లు, సుగంధ సిట్రాతో పాటు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న కొన్ని పదార్థాలను కూడా ఉపయోగిస్తున్నారట. ఈ బ్రాండ్ బీర్ ను సింగపూర్ ఇంటర్నేషనల్ వాటర్ వీక్ (ఎస్ఐడబ్ల్యూడబ్ల్యూ)తో కలిసి నేషనల్ వాటర్ ఏజెన్సీ, స్థానిక క్రాఫ్ట్ బీర్ బ్రూవరీ కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఇంత ఖర్చు పెట్టి ఛండాలంగా మూత్రంతో బీర్ తయారు చెయ్యడం ఏంటి అనుకుంటున్నారా? అయితే దీని వెనుక ఓ కారణం ఉంది. వాటర్ రీసైక్లింగ్, నీటిని సరిగ్గా వాడుకోవడంపై అవగాహన కల్పించేందుకే ఇలా ఈ బీరుని తయారు చేస్తున్నట్లు తయారీదారులు చెబుతున్నారు. మరి సింగపూర్ ఇలా విచిత్రంగా ఆలోచిస్తూ తయారు చేస్తున్న ఈ బీర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.