iDreamPost
android-app
ios-app

డ్రిల్లింగ్ మిషన్ తో తలకు రంధ్రం పెట్టుకున్న వ్యక్తి! కారణం తెలిస్తే షాక్ అవుతారు..

  • Author Soma Sekhar Published - 08:41 AM, Sat - 22 July 23
  • Author Soma Sekhar Published - 08:41 AM, Sat - 22 July 23
డ్రిల్లింగ్ మిషన్ తో తలకు రంధ్రం పెట్టుకున్న వ్యక్తి! కారణం తెలిస్తే షాక్ అవుతారు..

నేటి ఆధునిక కాలంలో సోషల్ మీడియాలో వచ్చే ప్రతీది నమ్మి.. తాము కూడా అలాగే చేయాలని చూస్తున్నారు కొంతమంది. ఈ క్రమంలోనే కొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా మనం చరిత్రలో చూశాం. కాగా.. యూట్యూబ్ లో వీడియోలు చూసి సొంత వైద్యం చేసుకుని ఆస్పత్రిపాలైన వ్యక్తులను కూడా మనం చాలా మందినే చూశాం. తాజాగా ఓ వ్యక్తి చేసిన పనికి ప్రపంచం మెుత్తం ఆశ్చర్యపోతోంది. యూట్యూబ్ లో వీడియో చూస్తూ.. తలకు డ్రిల్లింగ్ మిషన్ తో రంధ్రం పెట్టుకున్నాడు అతడు. ఇంతకీ అతడు ఎందుకు అలా చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.

మిఖాయిల్ రాదుగా రష్యాకు చెందిన 40 సంవత్సరాల వ్యక్తి. ప్రస్తుతం కజకిస్థాన్ లో నివసిస్తున్నాడు.’ఊకున్న వ్యక్తికి ఉపాయాలు ఎక్కువ’ అన్నట్లుగా.. కాళీగా ఉన్న అతడికి ప్రపంచంలో ఎవ్వరికీ రాని ఆలోచన వచ్చింది. మిఖాయిల్ కు నిద్రలో వచ్చే కలలను నియంత్రించాలని అతడు భావించాడు. అందుకు సంబంధించిన సమాచారాన్ని యూట్యూబ్ లో సేకరించాడు. ఎక్కువగా న్యూరో సర్జరీలకు సంబంధించిన వీడియోలను చూశాడు. ఆ తర్వాత ఓ షాప్ లో డ్రిల్లింగ్ మిషన్ ను కొనుగోలు చేశాడు. తన తలలో ఎలక్ట్రో కోడ్ చిప్ ను అమర్చుకునేందుకు.. డ్రిల్లింగ్ మిషన్ సాయంతో యూట్యూబ్ లో వీడియో చూస్తూ.. తలకు రంధ్రం పెట్టుకున్నాడు. డైరెక్ట్ గా కపాలానికి బొక్క పెట్టుకుని ఆ చిప్ ను మెదడు వద్ద అమర్చుకున్నాడు.

కానీ.. ఈ పని చేస్తుండగా తల నుంచి తీవ్రంగా రక్తం కారిపోయింది. దాంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే సకాలంలో అతడి ఆస్పత్రిలో చేర్పించడంతో.. ప్రాణాలతో బయటపడ్డాడు మిఖాయిల్. దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి ఈ ఆశ్చర్యకరమైన సంఘటనకు పూనుకున్నాడు. అతడి తల నుంచి దాదాపు లీటర్ రక్తం పోయినట్లు సమాచారం. కాగా.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మిఖాయిల్ ఓ ట్వీట్ చేశాడు. అందులో..

” నా మెదడులో ఎలక్ట్రో చిప్ ను పెట్టి నాకు వచ్చే కలలను అదుపుచేయాలని అనుకున్నాను. ఇలాంటి ప్రయోగం చరిత్రలో ఇదే మెుదటి సారి కావొచ్చు. ఇక ఈ ప్రయోగం సఫలం అయితే కలల నియంత్రణకు సాంకేతిక అవకాశాలు ఉండేవి” అంటూ ఆ ట్వీట్ లో రాసుకొచ్చాడు. అయితే అతడు ఈ ప్రయోగానికంటే ముందుగానే న్యూరో సర్జర్లను సంప్రదించాడు. కానీ వారు ఇది చట్టరిత్య నేరం అనడంతో.. సొంత ప్రయోగానికి పూనుకున్నాడు. మరి మిఖాయిల్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: బైక్ కు అంత్యక్రియలు! అసలు సంగతి ఏంటంటే?