iDreamPost
android-app
ios-app

వీడియో: టెస్లా కార్లతో రామ భక్తి తెలిపిన అమెరికా వాసులు!

జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సంతో పాటు బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమం కోసం లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు.

జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సంతో పాటు బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమం కోసం లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు.

వీడియో: టెస్లా కార్లతో రామ భక్తి తెలిపిన అమెరికా వాసులు!

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉంది. రామ మందిర ప్రారంభోత్సవంతో పాటు బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జనవరి 22వ తేదీ సోమవారం అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనుంది. రేపు జరగబోయే కార్యక్రమానికి దేశ నలుమూల నుంచే గాక, ప్రపంచం నలుమూల నుంచి కూడా భక్తులు రానున్నారు. ఇప్పటికే సినీ, రాజకీయ, క్రీడా వర్గాలకు చెందిన వారికి ఆహ్వానాలు అందాయి.

రేపు అయోధ్య రామ మందిర ప్రారంభం కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులు తమదైన శైలిలో భక్తి ప్రవర్తులను తెలియజేసుకుంటున్నారు. అమెరికాలో కొంతమంది భక్తులు ఏకంగా టెస్లా కార్లతో వినూత్న ప్రదర్శన చేశారు. కొన్ని టెస్లా కార్లను రామ్‌ అన్న ఇంగ్లీష్‌ అక్షరం వచ్చేలా లైట్‌ షో నిర్వహించారు. అనంతరం జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ అమెరికాలో కూడా రామ మందిరం ఫీవర్‌ కనిపిస్తోంది’’.. ‘‘ జనవరి 22వ తేదీ ప్రపంచం మొత్తం రామ నామంతో మారు మోగుతుంది. జై శ్రీరామ్‌’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, అయోధ్య రామ మందిరంలో రేపు ప్రతిష్టించబోయే బాల రాముడి విగ్రహాన్ని మైసూర్‌కు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ తీర్చిదిద్దారు. ఈ విగ్రహం తయారు చేస్తున్నంత కాలం కొన్ని కఠిన నియమాలు పాటించారంట.

విగ్రహం తయారు చేస్తున్న సమయంలో రాయి ముక్క వచ్చి అతడి కంట్లో పడిందంట. దీంతో కన్ను తెరవలేని పరిస్థితి ఏర్పడిందంట. వెంటనే అయోధ్య ట్రస్ట్‌ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందించారంట. కన్ను తెరవలేని పరిస్థితి ఉన్నా.. ఒక్క కన్నుతోనే ఆయన రాముడి విగ్రహం చెక్కారంట. అది కూడా ఒంటి కన్నుతో 15 రోజుల పాటు కష్టపడ్డారంట. ఇక, రేపు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ఉన్న సందర్భంగా ముఖేష్‌ అంబానీ తన కంపెనీలకు సెలవు ప్రకటించారు. మరి, అమెరికాకు చెందిన భక్తులు టెస్లా కార్లతో రామ భక్తి తెలియజేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.