iDreamPost
android-app
ios-app

ఎడారి దేశాల్లో వర్షాలు.. ఏడాదిన్నరలో పడాల్సిన వానంతా.. ఒక్క గంటలోనే..

భారత్ ఎండలతో అల్లాడుతుంటే.. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రాంతాలన్నీ వానల ధాటికి అతలాకుతలం అయ్యాయి. మునుపెన్నడు లేని విధంగా వానలు కురియడంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని జీవిస్తున్నారు అక్కడి ప్రజలు.

భారత్ ఎండలతో అల్లాడుతుంటే.. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రాంతాలన్నీ వానల ధాటికి అతలాకుతలం అయ్యాయి. మునుపెన్నడు లేని విధంగా వానలు కురియడంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని జీవిస్తున్నారు అక్కడి ప్రజలు.

ఎడారి దేశాల్లో వర్షాలు.. ఏడాదిన్నరలో పడాల్సిన వానంతా.. ఒక్క గంటలోనే..

ఇండియాను ఎండలు భయపెడుతుంటే.. దుబాయ్‌ను వానలు ముంచెత్తుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈ ఎడారి దేశాన్ని అకాల వర్షాలు అతలాకుతులం చేశాయి. రికార్డు స్థాయిలో వానలు కురిశాయి. ఏడాదిన్నరలో నమోదు కావాల్సిన వర్షపాతం.. కొన్నిగంటల్లోనే కురిసిందని అధికారులు తెలిపారు. ఎడతెరిపి లేకుండా సుమారు గంటకు పైగా కురియడంతో దుబాయ్ ఒక్కసారిగా చిగురుటాకులా వణికి పోయింది. సోమవారం రాత్రి ఈ నగరాన్ని వానలు భయపెట్టాయి. కేవలం దుబాయ్ మాత్రమే కాదు..గల్ఫ్ దేశాలన్నీ ఈ వానలకు ప్రభావితం అయ్యాయి. ఒమన్ వరదల ధాటికి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ పలు భవనాలు ధ్వంసం కాగా రోడ్లు జలమయం అయ్యాయి.

దుబాయ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 750 రోజులకు సరిపడా వర్షం గంటలోనే కురియడంతో ఈ ఎడారి ప్రాంతం ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇక్కడ 142 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు చెబతున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వైకి నీళ్లు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. షాపింగ్ మాల్స్‌లోకి నీళ్లు వచ్చాయి. ఈదురుగాలులతో కూడిన వానలు కురియడంతో చెట్లు కూలిపోయాయి.. కుర్చీలు, టేబుళ్లు సైతం ఎగిరిపోయాయి. రోడ్లపై నిలిపి ఉంచిన కార్లు కొట్టుకు పోయాయి. రైల్వే వ్యవస్థ కూడా దెబ్బతింది. దీంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రాంతాలన్నీ నీట మునిగాయి.

బహ్రెయిన్, ఖతర్, సౌదీ అరేబియాలోనూ వర్షాలు కుమ్మరించాయి. దీంతో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. పూజైరా ఎమిరేట్‌లో దుబాయ్ కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇక్కడ 145 మిల్లీ మీటర్లు భారీ వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది. సాధారణంగా అబర్ కంట్రీల్లో వర్షాలు చాలా అరుదుగా కురుస్తుంటాయి. కానీ ఎన్నడు లేని విధంగా వానలు ముంచెత్తుతున్నాయి. అయితే ఇటీవల వాతావరణ మార్పులు చోటుచేసుకున్నాయి. అందుకే రెండు మూడేళ్ల నుండి అక్కడ వానలు ప్రభావితం చూపుతున్నాయి. వాతావరణ మార్పులు కారణంగానే ఈ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. 75 సంవత్సరాల్లో అతిపెద్ద వర్షపాతంగా చెబుతున్నారు అధికారులు. షార్టా, దీరా సెంటర్‌లో కూడా భారీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.