Arjun Suravaram
Cancer Vaccines: క్యాన్సర్ ఓ భయంకరమైన రోగం అనేది చాలా మంది లో ఉండే అభిప్రాయం. ఈ మహమ్మారి కారణంగా ఎంతో మంది ప్రాణాలుకూడా కోల్పోతున్నారు. దీనికి చికిత్స ఉంది కానీ..పూర్తి స్థాయిలో నయం చేసే వ్యాక్సిన్ మాత్రం అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలోనే క్యాన్సర్ విషయంలో ఓ గుడ్ న్యూస్ రానుంది.
Cancer Vaccines: క్యాన్సర్ ఓ భయంకరమైన రోగం అనేది చాలా మంది లో ఉండే అభిప్రాయం. ఈ మహమ్మారి కారణంగా ఎంతో మంది ప్రాణాలుకూడా కోల్పోతున్నారు. దీనికి చికిత్స ఉంది కానీ..పూర్తి స్థాయిలో నయం చేసే వ్యాక్సిన్ మాత్రం అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలోనే క్యాన్సర్ విషయంలో ఓ గుడ్ న్యూస్ రానుంది.
Arjun Suravaram
క్యాన్సర్.. ఈ పేరు చెప్పగానే అందరిలో ఏదో తెలియని భయం ఉంటుంది. అంతేకాక ఇదో భయంకరమైన వ్యాధి అనేది జనాల్లో భావన ఉంటుంది. చాలా మంది.. తమకు క్యాన్సర్ అని తెలియగానే మానసికంగా కుంగిపోతుంటారు. ఇక తాము చనిపోతామనే భయంతో తీవ్ర వేదనకు గురవుతుంటారు. అలానే ఈ మహమ్మారి కారణంగా ఎంతో మంది చనిపోయారు. ఇక ఈ క్యాన్సర్ అనేది అనేక రకాలుగా ఉంటుంది. గర్భాశయ కాన్యర్, నోటి క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ అని అనేక రకాల క్యాన్సర్ల పేర్లు మనం తరచూ వింటుంటాము. ఇక క్యాన్సర్ వస్తే ఒక పట్టాన నయం కాదు. చివరి స్టేజ్ వరకు గుర్తించకపోతే.. రోగులు చనిపోతారు. ఇలాంటి తరుణంలో దీనికి సంబంధించి ఓ గుడ్ న్యూస్ వచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
క్యాన్సర్ కి ప్రత్యేకమైన చిక్సిత అంటూ ఏమీ లేదు. కొన్ని కారణాల వల్ల శరీరంలో కణాలు విభజన చెందడంతో క్యాన్సర్ వ్యాధి వస్తోంది. ఈ కణాల విభజన జరిగే శరీర భాగాన్ని బట్టి ఆ క్యాన్సర్ ను పిలుస్తుంటారు. చాలా మంది క్యాన్సర్ చికిత్స చేయించుకుని తిరిగి ప్రాణాలతో బయట పడ్డారు. అయితే కేవలం ధనవంతుల విషయంలోనే ఇలా జరుగుతుంది. పేదవారికి ఈ మహమ్మారి సోకితే ఇక వారు ఆర్థికంగా చితికిపోవడం తప్ప వేరే దారి లేదు. ప్రస్తుతం భారత దేశంలో ప్రతి ఏటా 13 నుంచి 14 లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెప్పిన వివరాల ప్రకారం.. 2026 నాటికి వీరి సంఖ్య 20 లక్షలకు చేరింది.
ఇక క్యాన్సర్ కి మందు కనిపెట్టేందుకు భారత్ తో సహా అనేక దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి. అలానే ఇప్పటికే వరకు కొంతమేర ఉపశమనం ఇచ్చే మందులను వైద్యులు కనిపెట్టారు. తాజాగా క్యాన్సర్ కి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు రష్యా ప్రకటించింది. క్యాన్సర్ రాకుండా చేసే వ్యాక్సిన్, వచ్చినా తగ్గించడానికి ఇమ్యునో మాడ్యులేటర్స్ మందులపై పరీక్షలు జరుపుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఫ్యూచర్ టెక్నాలజీ మీద బుధవారం మాస్కో ఫోరమ్ జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పుతిన్ కీలక విషయాలను ప్రస్తావించారు.
అలానే క్యాన్సర్ అంశంపై కూడా ఆయన పలు విషయాలను వెల్లడించారు. క్యాన్సర్ కి రష్యా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ కనిపెట్టేందుకు పని చేస్తుందని.. రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ పై చివరి దశలో ప్రయోగాలు జరుగుతున్నాయని, త్వరలో క్యాన్సర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని పుతిన్ తెలిపారు. మరి.. క్యాన్సర్ విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.