P Venkatesh
బ్రెడ్ ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే ఇప్పుడు బ్రెడ్ ప్యాకెట్లలో ఎలుక అవశేషాలు కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈఘటనతో లక్ష ప్యాకెట్లను వెనక్కి తీసుకుంది ఆ కంపెనీ.
బ్రెడ్ ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే ఇప్పుడు బ్రెడ్ ప్యాకెట్లలో ఎలుక అవశేషాలు కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈఘటనతో లక్ష ప్యాకెట్లను వెనక్కి తీసుకుంది ఆ కంపెనీ.
P Venkatesh
ఈ మధ్యకాలంలో ఆహార పదార్థాల కల్తీ భయాందోళనకు గురిచేస్తోంది. తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి అన్నీ కల్తీ అవుతూ మానవాళి మనుగడకు పెను ముప్పుగా మారాయి. ఏం తినాలన్నా ఓ క్షణం ఆగి ఆలోచించాల్సిన పరిస్థితి దాపరించింది. ఇటీవల ఫుడ్ ఐటెమ్స్ లో పురుగులు రావడం లేదా పాచిపట్టి ఉండడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు బ్రెడ్ కూడా కల్తీ అయ్యింది. బ్రెడ్ ను చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఇష్టంగా తింటుంటారు. కాగా ఈ బ్రెడ్ లో ఎలుక అవశేషాలు కలవడంతో వినియోగదారులను కలవరానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో ఆ బ్రెడ్ తయారీ కంపెనీ లక్షకు పైగా బ్రెడ్ ప్యాకెట్లను వెనక్కి తీసుకుంటుంది.
జపాన్ లో ఓ కంపెనీ తయారు చేసిన బ్రెడ్ లో ఎలుక అవశేషాలు కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆ బ్రెడ్ ప్యాకెట్లలో ఎలుక అవశేషాలు ఉన్నట్లు తేలడంతో వెంటనే స్పందించిన కంపెనీ లక్ష ప్యాకెట్లను వెనక్కి తీసుకుని డబ్బులను చెల్లిస్తోంది. పాస్కో సిక్షిమా సంస్థ లక్షకుపైగా బ్రెడ్ స్లైస్ ప్యాకెట్లను తయారు చేసింది. ఆ తర్వాత ఆ ఉత్పత్తులు సూపర్ మార్కెట్ లకు పంపిణీ కూడా చేయబడ్డాయి. ఇంకేముంది వినియోగదారులు ఈ బ్రెడ్ ప్యాకెట్లను కొని ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఈ బ్రెడ్ ప్యాకెట్లలో రెండింటిలో ఎలుక అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు.
జపాన్ ప్రజలు ఎక్కువగా పాస్కో బ్రెడ్ ను తింటుంటారు. వారికి ప్రధానమైన ఆహారం కూడా ఇదే. సూపర్ మార్కెట్స్ ఇతర షాపుల్లో విరివిగా అమ్ముతుంటారు. ఇక ఇప్పుడు బ్రెడ్ ప్యాకెట్లలో ఎలుక అవశేషాలు ఉన్నాయని తేలడంతో పాస్కో కంపెనీ కీలక ప్రకటన చేసింది. ఈ బ్రెడ్ ను తిని ఎవరూ కూడా అనారోగ్యానికి గురికాలేదని ప్రకటించింది. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని కంపెనీ కోరింది. అయితే ఆ బ్రెబ్ ప్యాకెట్స్ లోకి ఎలుక అవశేషాలు ఎలా వచ్చాయన్నది తెలియరాలేదు. ఈ బ్రెడ్ తిన ఎవరైనా అనారోగ్యానికి గురై ఉంటే పరిహారం అందిస్తామని కంపెనీ తెలిపింది. ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని కంపెనీ ప్రకటించింది.