iDreamPost
android-app
ios-app

ఆల్‌లైన్‌ ప్రేమ, పెళ్లి.. ఇండియాకు వచ్చేసిన పాకిస్థాన్‌ మహిళ! సినిమాను మించిన లవ్‌స్టోరీ

  • Published Jul 30, 2024 | 11:07 AM Updated Updated Jul 30, 2024 | 11:07 AM

Pakistan Woman: ప్రేమకు కులాలు, మతాలు పట్టింపులు లేవు.. ప్రేమించిన వారి కోసం ఖండాంతరాలు దాటి వస్తున్న సంఘటనలు తరుచూ జరుగుతున్నాయి. ఇటీవల పలు దేశాలకు చెందిన యువతులు భారత దేశంలో ఉన్న యువకులను సోషల్ మాధ్యమాల్లో పరిచయం అయి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు.

Pakistan Woman: ప్రేమకు కులాలు, మతాలు పట్టింపులు లేవు.. ప్రేమించిన వారి కోసం ఖండాంతరాలు దాటి వస్తున్న సంఘటనలు తరుచూ జరుగుతున్నాయి. ఇటీవల పలు దేశాలకు చెందిన యువతులు భారత దేశంలో ఉన్న యువకులను సోషల్ మాధ్యమాల్లో పరిచయం అయి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు.

  • Published Jul 30, 2024 | 11:07 AMUpdated Jul 30, 2024 | 11:07 AM
ఆల్‌లైన్‌ ప్రేమ, పెళ్లి.. ఇండియాకు వచ్చేసిన పాకిస్థాన్‌ మహిళ! సినిమాను మించిన లవ్‌స్టోరీ

ఈ మధ్య కాలంలో ప్రేమకు ఎల్లలతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు ప్రేమికులు. పాకిస్థాన్ యువతులు, భారతీయ యువకులను ప్రేమించి ఖండంతరాలు దాటి వచ్చి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. ఆ మధ్య ఓ పాక్ యువతి కోల్‌కొతాకు చెందిన సమీర్ ఖాన్ అనే యువకుడిని ప్రేమించి భారత్ కి చేరుకొని పెళ్లి చేసుకుంది. దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ మధ్య ఎప్పుడూ రాజకీయ మనస్పర్ధలు ఉన్పప్పటికీ.. ఇటీవల ఇరు దేశాల యువతీ యువకుల మధ్య ప్రేమ వ్యవహారాలు ఏర్పడి వివాహబంధంలోకి అడుగు పెడుతున్నారు. ఇందుకోసం ఎన్నిఅవాంతరాలు వచ్చినా సిద్దమే అంటున్నారు. తాజాగా ఓ పాక్ మహిళ ఇండియాలో ఉన్న తన భర్తను కలిసేందుకు సరిహద్దులు దాటి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

భారతదేశం, పాకిస్తాన్ తరచుగా రాజకీయంగా విభేదించవచ్చు, కానీ సోషల్ మీడియా, ఇంటర్నెట్ ఊహించని రీతిలో ప్రేమ వ్యవహారాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా పాకిస్థాన్ కు చెందిన మెహ్విష్ అనే 25 ఏళ్ల యువతి ఫేస్‌బుక్‌లో పరిచయమైన ప్రేమికుడు రెహ్మాన్‌తో కలిసి ఉండటానికి రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాకు సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించింది. ట్విస్ట్ ఏంటంటే 2006లో మెహ్విష్ బాదామీ బాగ్‌కు చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నాడు.2018 లో మెహ్విన్ తన భర్తతో విడిపోయింది. అప్పటికే వీరికి 12,7 ఏళ్ల వయసు ఉన్న కొడుకులు ఉన్నారు. భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కువైట్ లో పనిచేస్తున్న రహ్మాన్ అనే యువకుడితో ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. తరుచూ ఇద్దరూ చాటింగ్ చేసుకుంటూ ఒకరి గురించి ఒకరు తమ ఇష్టా ఇష్టాల గురించి మాట్లాడుకునే వారు. ఆ పరిచయం ఇద్దరినీ ప్రేమికులుగా మార్చింది.

ఈ క్రమంలోనే ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మొదట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పెళ్లి చేసుకున్నారు. మెహ్విన్ 2023 లో మక్కా యాత్రకు రాగా.. రెహ్మాన్ కూడా మక్కా వచ్చి ఆమెను శాస్త్ర ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మెహ్విన్ పాకిస్థాన్ వెళ్లి పోయింది.ఈ మధ్యనే ఆమె ఇస్లామాబాద్ నుంచి లాహూర్ వెళ్లి అక్కడ నుంచి వాఘా సరిహద్దుల ద్వారా భారత్ కి చేరుకుంది. 45 రోజుల టూరిస్ట్ వీసా తో భారత్ వచ్చిన ఆమెకు అత్తవారింటి నుంచి ఘనస్వాగతం లభించింది. ప్రేమకు ఎల్లలు ఏవీ ఉండవని, తమ ప్రేమ ఎంతో పవిత్రమైనదని, తన భర్తను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని మెహ్విన్ ఈ సందర్బంగా తెలిపింది.