iDreamPost

ప్రపంచంలో ఏ పనీ తక్కువ కాదు.. ఒకప్పుడు టాయిలెట్లు కూడా కడిగా.. దిగ్గజ కంపెనీ సీఈఓ

Nvidia CEO Jensen Huang: చేసే పనికి విలువ ఇస్తేనే జీవితంలో పైకి ఎదుగుతామని అంటున్నారు ప్రముఖ కంపెనీ సీఈవో. తాను కెరీర్ ఆరంభంలో టాయిలెట్లు కూడా కడిగానని వెల్లడించారు.

Nvidia CEO Jensen Huang: చేసే పనికి విలువ ఇస్తేనే జీవితంలో పైకి ఎదుగుతామని అంటున్నారు ప్రముఖ కంపెనీ సీఈవో. తాను కెరీర్ ఆరంభంలో టాయిలెట్లు కూడా కడిగానని వెల్లడించారు.

ప్రపంచంలో ఏ పనీ తక్కువ కాదు.. ఒకప్పుడు టాయిలెట్లు కూడా కడిగా.. దిగ్గజ కంపెనీ సీఈఓ

జీవితంలో సక్సెస్ ఊరికనే రాదు. దానికి ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రముఖ రంగాల్లో కీర్తి గడించిన వారు, రారాజులుగా వెలుగొందుతున్న వారు ఒకప్పుడు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నవారే. కష్టాల సాగారాన్ని దాటి ఆదర్శవంతమైన జీవితాన్ని నిర్మించుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. చేసే పని పట్ల శ్రద్ద, అంకితభావం ఉన్నట్లైతే విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. కావాల్సిందల్లా చేసే పనిని గౌరవించడం, విలువ ఇవ్వడం. ఇలా చేస్తే ఉన్నత స్థాయికి చేరుకోవడం ఖాయం. ఇదే విషయాన్ని తెలుపుతున్నారు ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్. తాను ఒకప్పుడు టాయిలెట్స్ కూడా కడిగానని తెలిపారు.

ప్రపంచంలో ఏ పనీ చిన్నది కాదు తక్కువ కాదని అన్నారు ప్రముఖ ఎలక్ట్రానిక్‌ చిప్‌ల తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్. తాను ఒకప్పుడు టాయిలెట్లు కూడా కడిగానని వెల్లడించారు. పని విలువపై ఆయన మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన మాట్లాడుతూ.. ఏ పనీ నాకు చిన్నది కాదు. కెరీర్‌ తొలినాళ్లలో నేను ఓ బ్రేక్‌ఫాస్ట్‌ సెంటర్‌లో పనిచేశా. అప్పుడు ప్లేట్లు శుభ్రం చేశా. టాయిలెట్లు కడిగా. ఆ అనుభవమే నాకు అన్నిరకాల పనులను గౌరవించడం నేర్పిందని అన్నారు. దానివల్లే ఇప్పుడు కంపెనీలోని ప్రతీ ఉద్యోగిని సమానంగా చూడగలుగుతున్నా. ఈ ప్రపంచంలో ప్రతి పనికి విలువ ఉంటుందని ఏ పనీ తక్కువ కాదని సీఈఓ హువాంగ్ వివరించారు. ఈయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ తో స్పందిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి