iDreamPost
android-app
ios-app

నరరూప రాక్షసి.. ఆమె ఫ్రిజ్‌లో మనిషి శరీర భాగాలు!

  • Published Jan 24, 2024 | 5:09 PM Updated Updated Jan 24, 2024 | 5:09 PM

జంతువుల కన్నా మనుషులే ఇప్పుడు క్రూరంగా తయారయ్యారు అనడానికి ఇటువంటి సంఘటనలే ఉదాహరణ. నరరూప రాక్షసులుగా మారి మనిషి ప్రాణాలను హరించేస్తున్నారు. దారుణాతి దారుణంగా వ్యవహరిస్తున్నారు.

జంతువుల కన్నా మనుషులే ఇప్పుడు క్రూరంగా తయారయ్యారు అనడానికి ఇటువంటి సంఘటనలే ఉదాహరణ. నరరూప రాక్షసులుగా మారి మనిషి ప్రాణాలను హరించేస్తున్నారు. దారుణాతి దారుణంగా వ్యవహరిస్తున్నారు.

  • Published Jan 24, 2024 | 5:09 PMUpdated Jan 24, 2024 | 5:09 PM
నరరూప రాక్షసి.. ఆమె ఫ్రిజ్‌లో మనిషి శరీర భాగాలు!

మనుషులు మునుషుల్ని పీక్కుతినే రోజులు వస్తాయి అంటే ఏంటో అనుకున్నాం కానీ.. ఇటీవల కొన్ని సంఘటనలు చూస్తుంటే నిజమని అనిపించకమానదు. ఢిల్లీ శ్రద్దా వాకర్ హత్య కేసు ఎంతటి సంచనలం కలిగించిందే అందరికీ తెలుసు. ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా.. శ్రద్దా వాకర్‌ను హత్యచేసి ఆమె శరీర భాగాలను ఫ్రిజ్‌లో దాచాడు. ఆ తర్వాత ఇటువంటి తరహా సంఘటనలు అనేకం బయటకు వచ్చాయి. సాటి మనుషుల్ని అని చూడకుండా అత్యంత కిరాతకంగా హత్య చేసి..ఆనవాళ్లు కనిపించకుండా చేసేందుకు రిఫ్రిజిరేటర్స్‌లో దాచడం లేదంటే.. ఎవరికీ తెలియకుండా పారేయడం వంటివి చేస్తున్నారు. తాజాగా ఓ మహిళ అత్యంత దారుణానికి ఒడిగట్టింది.

45 ఏళ్ల మహిళ .. ఇంట్లో ఓ వ్యక్తి శరీర భాగాలను గుర్తించారు పోలీసులు. ఈ ఘటన అమెరికాలోని బ్రూక్లిన్ ‌లో చోటుచేసుకుంది. నిందితురాలు హీథర్ సైన్స్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాసన బయటకు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఫ్రీజర్‌కు టేప్ వేసింది ఆ మహిళ. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం ఓ నివాసంలో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. హీథర్ నివసిస్తున్న నాల్గవ అపార్ట్ మెంట్‌కు చేరుకున్నారు. అనంతరం ఆమె ఫ్లాట్‌కు వెళ్లి తనిఖీలు చేయగా.. రిఫ్రిజిరేటర్‌లో ఓ వ్యక్తి తల, ఇతర శరీర భాగాలు గుర్తించారు. అయితే ఆ వ్యక్తి ఎవరన్నదీ పోలీసులు నిర్ధారిస్తున్నారు. అతడిని హీథర్ హత్య చేసి.. శరీర భాగాలను ఫ్రిజ్‌లో దాచింది.

వాసన రాకుండా నిరోధించడానికి ఫ్రిజ్‌కు టేప్ వేసినట్లు చెప్పారు పోలీసులు. అయితే హీథర్ స్టైన్స్ ఆంటీ చెబుతున్న దాని ప్రకారం..హీథర్, ఆమె భర్త ఇద్దరికీ మాదక ద్రవ్యాల అలవాటు ఉందని, వాటి నుండి బయట పడేందుకు కొన్నాళ్ల క్రితం కెంటకీ నుండి దూరంగా వెళ్లారని చెప్పారు. తన భర్తతో కలిసి ఆమె బ్రూక్లిన్ లో ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె భర్త నికోలస్ కూడా జైలులో ఉన్నట్లు తెలుస్తోంది. ఓ మోసపూరిత చెక్ విషయంలో ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. దీంతో ఆమె ఒక్కటిగా ఉంటూ పనిమనిషిగా క్లీనింగ్ చేస్తూ డబ్బు సంపాదిస్తోంది. కానీ ఏమైందో తెలియదు కానీ ఓ వ్యక్తిని హత్య చేసి ఫ్రిజ్‌లో దాచింది. దీంతో ఆమె మానసిక పరిస్థితిపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మహిళా అనడం కన్నా నరరూప రాక్షసి అనొచ్చేమో ఈమని… ఏమంటారు..?

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetewin girişgrandpashabet