Arjun Suravaram
విమాన ప్రయాణ సమయంలో అప్పుడప్పుడు కొన్ని మార్పులు జరుగుతుంటాయి. ముఖ్యంగా వివిధ కారణాలతో ఫ్లైట్ లు రద్దు కావడం, మార్గం మళ్లింపు వంటివి జరుగుతుంటాయి ఈ సమయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.
విమాన ప్రయాణ సమయంలో అప్పుడప్పుడు కొన్ని మార్పులు జరుగుతుంటాయి. ముఖ్యంగా వివిధ కారణాలతో ఫ్లైట్ లు రద్దు కావడం, మార్గం మళ్లింపు వంటివి జరుగుతుంటాయి ఈ సమయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.
Arjun Suravaram
ఇటీవల కాలంలో విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య బాగా పెరిగింది. చాలా మంది వీటిల్లో జర్నీ చేసేందుకే ఇష్టపడుతున్నారు. ఇక ఈ జర్నీ విషయంలో, టికెట్ల బుకింగ్ వంటి ఇతరత్రా విషయాల్లో ఎన్నో నిబంధనలు ఉంటాయి. ముఖ్యంగా మనీ రిఫండ్ విషయంలో కొన్ని నిబంధనలు ఉంటాయి. అయితే తాజాగా విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సమయాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే రిఫండ్ ఇచ్చేలా ఓ ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. మరి.. ఆ ప్రభుత్వం, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
విమాన ప్రయాణ సమయంలో అప్పుడప్పుడు కొన్ని మార్పులు జరుగుతుంటాయి. ముఖ్యంగా వివిధ కారణాలతో ఫ్లైట్ లు రద్దు కావడం, మార్గం మళ్లింపు వంటివి జరుగుతుంటాయి ఈ సమయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. సమయానికి తమ గమ్యస్థానాలు చేరకపోవడం, మధ్యలోనే ఎయిపోర్టులో ఇబ్బందులు ఎదుర్కొవడం వంటివి జరుగుతుంటాయి. అయితే ఫ్లైట్ లు రద్దైన సమయంలో ప్రయాణికులు తిరిగి చెల్లించే డబ్బుల విషయంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి.
అయితే తాజాగా వీటి విషయం లో అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సమయాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే రిఫండ్ ఇచ్చేలా అమెరికా ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. కార్పొరేట్ల అనవసరపు ఛార్జీల బాదుడు నుంచి వినియోగదారులను రక్షించడం కోసం ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కస్టమర్ల రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ కార్యవర్గం బుధవారం తెలిపింది.
ఇక కొత్త రూల్స్ ను చూసినట్లు అయితే.. ప్యాసింజర్లు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయకపోయినా వారికి అందించాల్సిన రీఫండ్ లను ఆటోమేటిక్ గా చెల్లించాలి. క్రెడిట్ కార్డు ద్వారా టికెట్లు, ఇతరత్ర విమానా సేవలు కొనుగోలు చేసిన వారికి వారం పనిదినాల్లో రిఫండ్ చేయాలి. అదే విధంగా క్రెడిట్ కార్డు కాకుండా ఇతర మార్గాల్లో చెల్లించిన వారికి 20 రోజుల పనిదినాల్లో రిఫండ్ చేయాలి. కొనుగోలు సమయంలో వారు దేని ద్వారా చెల్లించారో అదే రూపంలో వారికి తిరిగి రిఫండ్ చేయాల్సి ఉంటుంది.
వోచర్లు, ట్రావెల్ కార్డులు ఇతరత్రా రూపంలో రిఫండ్ ఇవ్వడానికి వీల్లేదు. ఒక వేళ ప్రయాణికుడు విధిగా విజ్ఞప్తి చేస్తే మాత్రం వారు కోరుకున్న విధంగా ఇవ్వొచ్చు. ఇదే సమయంలో ఫ్లైట్ సంస్థలు, టికెట్ ఏజెంట్లు రిఫండ్ విషయంలో ఎలాంటి కోతలు విధించ రాదు. ప్రయాణికులు ఏమైనా సేవలు వినియోగించుకొని ఉంటే వాటి వరకు మాత్రమే రుసుము కట్ చేసి మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలి.
లగేజీ, రిజర్వేషన్ మార్పు లేదా రద్దుపై ఎంత తీసుకుంటారో ముందే ప్రయాణికుడి స్పష్టంగా తెలియజేయాలి. అంతేకాక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లపై ఆయా ఫీజులను నేరుగా కనిపించేలా ప్రదర్శించాలి. ఎలాంటి ప్రత్యేక హైపర్‌లింక్‌ల రూపంలో ఇవ్వకూడదు. వివిధ సేవల పేరుతో విమానయాన కంపెనీలు ఎక్స్ ట్రా వసూలు చేస్తున్నాయి. పైగా ఆ వివరాలు ప్రయాణికులకు తెలియజేయడం లేదు. వాటి గురించి తెలియక చెల్లింపులు సమయంలో వివిధ రకాల ఛార్జీలను చూసి వారు ఆశ్చర్యపోతుంటారు. ఈ నేపథ్యంలో వాటన్నింటికీ చెక్ పెట్టడం కోసం అమెరికా ఈ కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. మరి.. అమెరికా తీసుకొచ్చిన ఈ నిబంధనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.