Tirupathi Rao
Man Caught In Drunk And Drive: సాధారణంగా మద్యం సేవించాలి అంటే కచ్చితంగా డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. కానీ, ఇతగాడి శరీరం మాత్రం మద్యాన్ని సొంతంగా తయారు చేస్తోంది. రూపాయి ఖర్చు లేకుండా కిక్కు పొందుతున్నాడు.
Man Caught In Drunk And Drive: సాధారణంగా మద్యం సేవించాలి అంటే కచ్చితంగా డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. కానీ, ఇతగాడి శరీరం మాత్రం మద్యాన్ని సొంతంగా తయారు చేస్తోంది. రూపాయి ఖర్చు లేకుండా కిక్కు పొందుతున్నాడు.
Tirupathi Rao
మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి బాగానే విని ఉంటారు. ముఖ్యంగా మెట్రో పాలిటన్ సిటీల్లో అయితే సాయంత్రం కాగానే రోడ్ల మీద పోలీసులు బ్రీత్ అనలైజర్లు పట్టుకుని ఉంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే మాత్రం ఇప్పుడు కఠిన శిక్షలు కూడా అనుభవించాలి. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అందుకే ప్రభుత్వాలు, పోలీసులు అంత కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఈ వ్యక్తి మాత్రం ఎన్నిసార్లు డ్రంక్ డ్రైవ్ లో దొరికినా పోలీసులు అరెస్టు చేయలేరు. ఒకవేళ అరెస్టు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసినా కూడా అతడికి కోర్టు శిక్ష వేయలేదు. ఏంటి జోక్ అనుకుంటున్నారా? తాజా అతడిని డ్రంక్ డ్రైవ్ లో అరెస్టు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసినా కూడా కోర్టు శిక్ష వేయకుండా వదిలేసింది. అసలు అతని కథ ఏంటి? ఎందుకు శిక్ష వేయట్లేదో చూద్దాం.
ఇప్పుడు చెప్పుకునే వ్యక్తి బ్రెజిల్ లో ఉంటాడు. అతను ఒకరోజు వాహనం నడుపుతూ ఉండగా.. మద్యం సేవించి వాహనం నడుపుతున్నావ్ అంటూ పోలీసులు అరెస్టు చేశారు. అతను ఎంత చెప్పినా వినకుండా అతడిని కోర్టులో ప్రొడ్యూస్ కూడా చేశారు. అయితే అతడిని జడ్జి ముందుకు తీసుకెళ్లిన తర్వాత అసలు విషయం వెల్లడించాడు. అతనికి ఆటో బ్రేవరీ సిండ్రోమ్ అనే వింత వ్యాధి ఉన్నట్లు చెప్పాడు. అతను తాగక పోయినా కూడా శరీరం ఆల్కహాల్ ని సొంతంగా తయారు చేసుకుంటుందని చెప్పాడు. ఆ మాట విన్న తర్వాత అంతా మొదట ఏదో జోక్ చేస్తున్నాడు, శిక్ష తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతున్నాడు అనుకున్నారు. కానీ, అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అది నిజమే అని తేలింది. ముగ్గురు వైద్యులు అతడికి పరీక్షలు నిర్వించిన తర్వాత.. ముగ్గురు అతను ఏబీఎస్ తో బాధ పడుతున్నట్లు నిర్ధారించారు. అతను నిజంగానే ఆటో బ్రేవరి సిండ్రోమ్ తో బాధ పడుతున్నట్లు గుర్తించి వదిలేశారు.
మొదట పోలీసులు కూడా ఈ ఏబీఎస్ గురించి విని ఆశ్చర్యపోయారు. తాగకుండా తూలడం ఏంటని తలలు పట్టుకున్నారు. కానీ, వైద్యులు చెప్పిన తర్వాత అసలు విషయం బోధ పడింది. ఈ వ్యాధి ఉన్నవాళ్లు సాధారణ డ్రింక్స్ లో ఉండే మాదిరిగానే ఆల్కహాల్ ను ఉత్పత్తి చేస్తుంటారు. కానీ, దాని ప్రభావానికి చాలా తక్కువ గురవుతారు. ఇప్పటికే వాళ్లు ఒక పేగు సంబంధిత సమస్యతో బాధపడుతున్న వారికి ఈ ఏబీఎస్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ ఏబీఎస్ సమస్య ఉన్నవాళ్లు సాధారణంగా డ్రింక్ చేసే వారి లాగానే మానసికంగా, శారీరకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ ఏబీఎస్ సమస్యపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.