iDreamPost
android-app
ios-app

Maldives: దిగి వచ్చిన మాల్దీవ్స్‌.. మా దేశానికి రండంటూ భారతీయులకు రిక్వెస్ట్‌

  • Published May 07, 2024 | 10:16 AM Updated Updated May 07, 2024 | 10:16 AM

ప్రధాని మోదీ, భారత్‌పై తమ అక్కసు వెళ్లగక్కిన మాల్దీవ్స్‌.. తాజాగా తన తప్పు తెలుసుకుంది. కాళ్ల బేరానికి దిగి వచ్చింది. ప్లీజ్‌ మా దేశానికి రండి అంటూ భారతీయులకు రిక్వెస్‌ చేస్తుంది. ఆ వివరాలు..

ప్రధాని మోదీ, భారత్‌పై తమ అక్కసు వెళ్లగక్కిన మాల్దీవ్స్‌.. తాజాగా తన తప్పు తెలుసుకుంది. కాళ్ల బేరానికి దిగి వచ్చింది. ప్లీజ్‌ మా దేశానికి రండి అంటూ భారతీయులకు రిక్వెస్‌ చేస్తుంది. ఆ వివరాలు..

  • Published May 07, 2024 | 10:16 AMUpdated May 07, 2024 | 10:16 AM
Maldives: దిగి వచ్చిన మాల్దీవ్స్‌.. మా దేశానికి రండంటూ భారతీయులకు రిక్వెస్ట్‌

ఒకప్పుడు మనలో ఎవరైనా విదేశాలకు వెకేషన్‌కు వెళ్లాలంటే.. ముందుగా గుర్తుకు వచ్చే పేరు మాల్దీవ్స్‌. సెలబ్రిటీలు మొదలు.. సామాన్యుల వరకు హలీడే స్పాట్‌ అంటే.. మాల్దీవ్స్‌ పేరే చెబుతారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌, మాల్దీవుల మధ్య దీనిపై పెద్ద వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్‌ పర్యటన ఇరు దేశాల మధ్య వివాదాన్ని రాజేసింది. మోదీ లక్షద్వీప్‌ను ప్రమోట్‌ చేస్తూ.. ట్వీట్‌ చేయడంతో.. భారత్‌పై అక్కసును వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియాలో మన దేశాన్ని విమర్శిస్తూ.. పోస్టులు చేశారు. ఇది కాస్త ఇరు దేశాల మధ్య విబేధాలను రాజేసింది. దాంతో భారతీయులు బాయ్‌కాట్ మాల్దీవ్స్‌ అంటూ పిలుపునిచ్చారు. ఇదే సమయంలో మాల్దీవుల అధ్యక్షుడి.. భారత్ వ్యతిరేక ధోరణి కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. సెలబ్రిటీలు సహా సామాన్యులు సహా మాల్దీవులకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. బుక్‌ చేసుకున్న టికెట్లను కూడా క్యాన్సిల్‌ చేసుకున్నారు.

ఇక మాల్దీవులకు ప్రధాన ఆదాయ వనరుల్లో పర్యాటకం ప్రథమ స్థానంలో ఉంటుంది. అయితే భారత్‌తో విబేధాల కారణంగా.. మాల్దీవులకు పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో ఆదాయం కూడా పడిపోయింది. దాంతో తప్పు తెలుసుకున్న మాల్దీవులు కాళ్లబేరానికి వచ్చింది. ప్లీజ్‌ మా దేశానికి రండి అంటూ ఇండియన్స్‌ను వేడుకుంటుంది. దేశ ఆర్ధిక వ్యవస్థకు ప్రధాన వనరైన పర్యాటకంలో భారతీయులు తమకు సహకరించాలని కోరుతూ మాల్దీవుల పర్యాటక మంత్రి ఇబ్రహీమ్ ఫైజల్ అభ్యర్ధించారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన చేశారు.

ఇబ్రహీమ్‌ ఫైజుల్‌.. భారత్, మాల్దీవుల మధ్య ఉన్న చరిత్రాత్మక సంబంధాల గురించి ప్రస్తావిస్తూ.. ఓ ప్రకటన చేశారు. ‘మనకు ఓ చరిత్ర ఉంది.. కొత్తగా ఎన్నికైన మా ప్రభుత్వం, భారత్‌తో కలిసి పనిచేయాలని కోరుకుంటోంది. మేము ఎల్లప్పుడూ శాంతి, స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రోత్సహిస్తాం. భారతీయుల రాకపోకలకు మా ప్రజలు, ప్రభుత్వం ఘన స్వాగతం పలుకుతున్నాయి. దయచేసి మాల్దీవుల టూరిజంలో భాగస్వామ్యం కావాలని పర్యాటక మంత్రిగా భారతీయులను కోరుతున్నాను. మాదేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా టూరిజంపై ఆధారపడి ఉంది’ అని చెప్పుకొచ్చారు. ఈ ప్రకటన చూసిన ఇండియన్స్‌ సంతోషిస్తున్నారు. మాతో పెట్టుకుంటే.. గట్లుంటది అంటూ సోషల్‌ మీడియా వేదికగా కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజనులు.

మోదీ లక్షద్వీప్‌ పర్యటన తర్వాత.. మాల్దీవ్స్‌ మంత్రులు.. భారత్‌పైనా, ప్రధాని మోదీపైనా అక్కసును వెళ్లగక్కుతూ సోషల్ మీడియాలో చేసిన పోస్టులు పెను వివాదాన్ని రాజేశాయి. బాయ్‌కాట్ మాల్దీవ్స్‌ అని పిలుపునివ్వడంతో ఆ దేశంలో వెకేషన్ ప్లాన్ చేసుకున్నవారు మనసు మార్చుకున్నారు. హోటల్ బుకింగ్స్, భారత్ నుంచి ఫ్లైట్ టికెట్ల క్యాన్సిలేషన్లు పెద్ద మొత్తంలో రద్దయ్యాయి.

దాంతో మాల్దీవ్స్‌ నష్టనివారణ చర్యలు చేపట్టి భారత్‌పై నోరు పారేసుకున్న ముగ్గురు మంత్రులపై వేటు వేసింది. అయినా ఫలితం లేకుండా పోయింది. ఇక ఒక మాల్దీవ్స్‌కు సంబంధించిన ఓ వెబ్‌సైట్‌.. ఈ ఏడాది ఆరంభంలో మాల్దీవులకు వచ్చే పర్యాటకుల్లో భారతీయులు ప్రథమ స్థానంలో ఉండగా.. వివాదం తర్వాత.. అది ఆరో స్థానానికి పడిపోయిందని న్యూస్ పోర్టల్ నివేదించింది.