iDreamPost
android-app
ios-app

బతుకుదెరువు కోసం దుబాయ్ వెళితే.. ఒక్క రోజులోనే రూ. 45 కోట్లు..

  • Published Nov 17, 2023 | 3:16 PM Updated Updated Nov 17, 2023 | 3:16 PM

అదృష్టం ఉంటే అమెరికాలో ఉన్నా ఆఫ్రికా ఖండంలో తిరుగుతున్నా కోట్ల రూపాయలు వచ్చి చేరుతుంటాయి. లక్ ఉంటే అంతే మరీ. అంత పవర్ ఫుల్ అన్నమాట. అదృష్టం కారణంగా ఒక్క రోజులోనే కోటీశ్వరులు అయిపోయిన దాఖలాలు ఉన్నాయి.

అదృష్టం ఉంటే అమెరికాలో ఉన్నా ఆఫ్రికా ఖండంలో తిరుగుతున్నా కోట్ల రూపాయలు వచ్చి చేరుతుంటాయి. లక్ ఉంటే అంతే మరీ. అంత పవర్ ఫుల్ అన్నమాట. అదృష్టం కారణంగా ఒక్క రోజులోనే కోటీశ్వరులు అయిపోయిన దాఖలాలు ఉన్నాయి.

  • Published Nov 17, 2023 | 3:16 PMUpdated Nov 17, 2023 | 3:16 PM
బతుకుదెరువు కోసం  దుబాయ్ వెళితే.. ఒక్క రోజులోనే రూ. 45 కోట్లు..

‘చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అందీ మనీ మనీ.. అమ్మ చుట్టము కాదూ అయ్య చుట్టము కాదు ఐన అన్ని అంది మనీ మనీ‘ అని సినీ కవి అన్నట్లు.. డబ్బు ఎవరి సొత్తు కాదు. ఒకరి దగ్గర నిలకడగా ఉండదు. కొన్ని సార్లు ఎంత కష్టపడినా, చెమట చిందించినా, రక్తం ధారపోసి పని చేసినా డబ్బులు రావు. కొంత మందికి ఊరికనే సిరి వరిస్తుంది. దీన్నే లక్ అంటారు. ఎంత కష్టపడినా అవగిజంత అదృష్టం ఉండాలని ఊరికనే అంటారా పెద్దలు. అయితే ఆ లచ్చిమి దేవీ కలిసి రావాలంటే.. ఉన్న ఏకైక మార్గం లాటరీ. లాటరీ ద్వారా మాత్రమే చాలా మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. అయితే ఆ ధనలక్ష్మి త్వరగా వరించరు. కనికరించిందంటే ఒక్కసారిగా కాసుల వర్షం కురిపిస్తుంది.

లాటరీలో బంఫర్ ప్రైజ్ తగిలి ఒక్క రోజులోనే కోటీశ్వరులు అయిపోయినవారున్నారు. అందుకే చాలా మంది లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ ఉంటారు. తాజాగా ఓ వ్యక్తి కేవలం 100 రూపాయలు పెట్టి టికెట్ కొంటే.. ఏకంగా రూ. 45 కోట్లు తగిలాయి. ఇంతకు ఆ లక్కీయెస్ట్ పర్సన్ ఎవరంటే..? కేరళకు చెందిన శ్రీజు. ఈ భారత వ్యక్తికి దుబాయ్ లాటరీలో ఇంత డబ్బు వచ్చి పడింది. బుధవారం జరిగిన మహ్జూజ్ సాటర్డే మిలియన్స్ డ్రాలో రూ. 45 కోట్లు గెలుపొందాడు. ఒక్కసారిగా అంత డబ్బు డ్రాలో వచ్చేసరికి ఉబ్బితబ్బిబ్బు అయిపోతున్నాడు శ్రీజు. ఈ దెబ్బకు తనకు ఉన్న కష్టాలన్నీ తీరిపోయినట్లేనని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. కేరళ నుండి దుబాయ్ వెళ్లిన శ్రీజు.. అక్కడ ఫుజైరా ప్రాంతంలో పనిచేస్తున్నాడు.

స్వదేశంలో పని దొరక్క.. డబ్బులు సంపాదించుకోవాలని దుబాయ్‌కు వచ్చాడు. అతడికి సొంత ఇళ్లు కూడా లేదు. 11 ఏళ్ల క్రితం కేరళను వీడిన అతడు.. అక్కడ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే గత కొన్నేళ్లుగా లాటరీ టికెట్లు కొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల రూ. 100 పెట్టి లాటరీ టికెట్ కొన్నాడు. అంతే 45 కోట్లు జాక్ పాట్ కొట్టాడు. లాటరీ తీసిన తర్వాత బంఫర్ ప్రైజ్ కొట్టారంటూ సాటర్డే మిలియన్స్ నుండి శ్రీజుకు ఫోన్ వచ్చింది. అంతే ఈ విషయాన్ని తనే నమ్మలేకపోయాడు. ఒక్కసారిగా అతడి జీవితం మారిపోయింది. ఈ డబ్బుతో ముందుగా తన స్వగ్రామంలో సొంత ఇంటిని కొంటానని చెబుతున్నాడు ఈ లక్కీ ఫెలో.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio