iDreamPost
android-app
ios-app

Japan: వీడియో: లాంచ్‌ చేసిన కొద్ది సేపటికే పేలిపోయిన జపాన్‌ రాకెట్‌!

  • Published Mar 13, 2024 | 10:28 AM Updated Updated Mar 13, 2024 | 10:28 AM

జపాన్‌లో జరిగిన ఓ రాకెట్‌ ప్రయోగం విఫలమైంది. లాంచ్‌ అయిన కొద్ది సేపటికే భారీ రాకెట్‌ పేలిపోయింది. ఆర్బిట్‌లోకి శాటిలైట్‌లను తీసుకెళ్తున్న రాకెట్‌ ఇలా పేలిపోవడంపై శాస్త్రవేత్తలు నిరాశవ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

జపాన్‌లో జరిగిన ఓ రాకెట్‌ ప్రయోగం విఫలమైంది. లాంచ్‌ అయిన కొద్ది సేపటికే భారీ రాకెట్‌ పేలిపోయింది. ఆర్బిట్‌లోకి శాటిలైట్‌లను తీసుకెళ్తున్న రాకెట్‌ ఇలా పేలిపోవడంపై శాస్త్రవేత్తలు నిరాశవ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

  • Published Mar 13, 2024 | 10:28 AMUpdated Mar 13, 2024 | 10:28 AM
Japan: వీడియో: లాంచ్‌ చేసిన కొద్ది సేపటికే పేలిపోయిన జపాన్‌ రాకెట్‌!

అత్యధునిక సాంకేతిక పరిజ్ఞానానికి, అద్భుతమైన టెక్నాలజీకి పెట్టింది పేరైన జపాన్‌లో ఓ రాకెల్‌ ప్రయోగం విఫలమైంది. ఈ షాకింగ్‌ ఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వెస్ట్రన్‌ జపాన్‌ నుంచి కైరోస్‌ రాకెట్‌ను స్పేస్‌ వన్‌ అనే ప్రైవేట్‌ స్పెస్‌ సెంటర్‌ కంపెనీ లాంచ్ చేసింది. జపాన్‌ కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ఈ రాకెట్‌ను లాంచ్‌ చేసింది. ఈ రాకెట్‌ ప్రయోగం ఆ కంపెనీకి ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రయోగం. కానీ, దురదృష్టవశాత్తు.. లాంచ్‌ అయిన కొన్ని క్షణాల్లోనే రాకెట్‌ పేలిపోయింది. ఆ వీడియాలో భారీ విస్పోటనం చూడొచ్చు. లాంచ్‌ ప్యాడ్‌ నుంచి అలా నింగివైపు లేచిన రాకెట్‌.. చూస్తుండగానే బ్లాస్ట్‌ అయిపోయింది.

రాకెట్‌ ముక్కలుముక్కలుగా పేలిపోయి.. శకలాలు అన్ని లాంచ్‌ ప్యాడ్‌ పరిసరాల్లో పడిపోయాయి. భారీ పేలుడు కారణంగా రాకెట్‌ పూర్తిగా నాశనం అయిపోయింది. సుమరు 59 అడుగుల పొడువు ఉన్న ఈ సాలిడ్‌ ఫ్యూయెల్‌ రాకెట్‌.. లాంచ్‌ అయిన కొద్దిసేపటికే పేలిపోవడం నిరాశను కలిగించింది. అయితే.. ఈ ఘటనతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే.. ఈ ప్రయోగం విఫలం అవ్వడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. జపాన్‌కు చెందిన స్టార్టప్‌ స్పేస్‌ కంపెనీ ‘స్పేస్‌ వన్‌’ ఈ ప్రయోగం చేపట్టింది. జపాన్‌ ప్రభుత్వానికి చెందిన స్పై శాటిలైట్‌ మాక్‌ అప్‌ను మోసుకెళ్లాల్సింది. కానీ, దురదృష్టవశాత్తు లాంచ్‌ కాగానే పేలిపోయి.. విఫల ప్రయోగంగా మిగిలింది. ఈ ఘటనతో ఆ కంపెనీకి భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.