iDreamPost
android-app
ios-app

విషాదం.. ఎంపీ బంధువుల ఇంటిపై బాంబు దాడి.. పదిమంది మృతి!

  • Published Dec 01, 2023 | 11:02 AM Updated Updated Dec 01, 2023 | 11:02 AM

ఇటీవల ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘినిస్థాన్ లాంటి దేశాల్లో వరుసగా బాంబు దాడులతో దద్దరిల్లిపోతున్నాయి. వందల సంఖ్యల్లో ప్రాణ నష్టాలు, కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లుతుంది.

ఇటీవల ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘినిస్థాన్ లాంటి దేశాల్లో వరుసగా బాంబు దాడులతో దద్దరిల్లిపోతున్నాయి. వందల సంఖ్యల్లో ప్రాణ నష్టాలు, కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లుతుంది.

  • Published Dec 01, 2023 | 11:02 AMUpdated Dec 01, 2023 | 11:02 AM
విషాదం.. ఎంపీ బంధువుల ఇంటిపై బాంబు దాడి.. పదిమంది మృతి!

ఇటీవల ఇరాక్, అఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ లాంటి దేశాలో ఆత్మాహుతి దాడులు ఎక్కువ అయ్యాయి. ఆ మద్య ఇరాక్ లో జరిగిన కారు బాంబ్ దాడిలో 40 మంది మరణించగా, 70 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. తరుచూ ఇరాన్ లో టెర్రరిస్టుల దాడులు సర్వసాధారణం అయ్యాయి. ఉగ్రమూకల టార్గెట్ ఏదైనా.. సామాన్య ప్రజలు చనిపోతున్నారు. ఎంతోమంది పెద్దదిక్కు కోల్పోయి అనాధలుగా మిగులుతున్నారు. వందల సంఖ్యల్లో వికలాంగులుగా మారుతున్నారు. ఇరాక్‌ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఎక్కడో అక్కడ ఆత్మాహుతి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇరాక్‌లో ప్రావిన్స్ లో మరోసారి కారుబాంబు దాడులు కలకలం సృష్టించాయి. వివరాల్లోకి వెళితే..

ఇరాక్‌లోని దియాలా ప్రావిన్స్ లో గురువారం వరుస బాంబు దాడులు జరగడంతో ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. స్థానిక ఎంపీ బంధువుల ఇళ్లను టార్గెట్ చేసుకొని జరిపిన ఈ దాడుల్లో పది మంది మృతి చెందగా.. 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గురువారం సాయంత్రం ఎంపీ బంధువులు ప్రయాణిస్తున్న వాహనం అమ్రానియా ప్రాంతానికి చేరుకుంది. అప్పటికే పథకం ప్రకారం కొంతమంది దుండగులు అక్కడ కాపు కాసి నాటుబాంబులతో దాడులు చేశారు.

డ్రైవర్ అప్రమత్తమై తప్పించుకునే ప్రయత్నం చేయగానే దుండగులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అక్కడ ప్రాంతం అంతా రక్త సిక్తం అయ్యింది. ఈ దాడిలో పదిమంది మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డు పక్కన బాంబులు పేలడంతో అందరూ భయంతో పరుగులు తీసినట్లు స్థానికులు చెబుతున్నారు. రోడ్డు పై ప్రయణిస్తున్న వాహనాలు ధ్వంసం అయ్యాయి. గుర్తు తెలియని కొందరు దుండగులు ఎంపీ బంధువుల వాహనాలపై బాంబు దాడులు చేసి.. వెంటనే స్నీపర్ కాల్పులు చేసినట్లు తెలిపారు. దాడికి గల కారణాలు తెలియరాలేదని.. దాడి అనంతరం ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.