Keerthi
నగరంలో రోజురోజుకి గంజాయి అక్రమణకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇటీవలే గంజాయి చాక్లెట్ల ఘటన మరువక ముందే.. మరోసారి ఈ ముఠా ఏకంగా తినే పదార్థాలలోనే పెట్టి అక్రమణగా తరలిస్తున్నారు. ఇంతకి ఎందులో తరలించారంటే..
నగరంలో రోజురోజుకి గంజాయి అక్రమణకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇటీవలే గంజాయి చాక్లెట్ల ఘటన మరువక ముందే.. మరోసారి ఈ ముఠా ఏకంగా తినే పదార్థాలలోనే పెట్టి అక్రమణగా తరలిస్తున్నారు. ఇంతకి ఎందులో తరలించారంటే..
Keerthi
ఈ మధ్యకాలంలో గంజాయి స్మగ్లర్ల అగడాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. దీనిపై అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్న గంజాయి అక్రమాలను నివారించలేకపోతున్నారు. రోజురోజుకి ఈ గంజాయి దందా అనేది నగరంలో చాప క్రింద నీరులా విస్తరిస్తుంది. ఎక్కువ శాతం యువతే ఈ గంజాయి మత్తుకు బానిసలై బలైపోతున్నారు. దీనిని సేవించిన మత్తులో అనేక నేరాలు చేస్తూ.. నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. నిత్యం ఈ గంజాయి ముఠాకు సంబంధించి రకరకాల వార్తలు వినిపిస్తునే ఉన్నాయి. అలాగే నగరంలో ఓ వైపు ఈ గంజాయి సరఫరాను నివారించేందుకు పోలీసులు తెగ కష్టపడుతుంటే..స్మగ్లర్ల జోరు మాత్రం క్రమక్రమం పెరిగిపోతుంది. తాజాగా ఓ గంజాయి ముఠా తినే పండ్లలో రూపంలో కూడా అక్రమణగా తరలిస్తున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..
దేశంలో రోజురోజుకి గంజాయి సామ్మాజ్యం పలు ప్రాంతాల్లో విస్తరించుకుంటూ పోతుంది. ఇటీవలే పిల్లలు తినే చాక్లెట్ల ను కూడా గంజాయి చాక్లెట్స్ గా మార్చి తరలించిన ఘటన తెలిసిందే. అయితే ఇప్పుడు అది మరువకముందే.. మరోసారి గంజాయి దందా చెలరేగిపోయింది. చివరికి తినే పండ్లను కూడా వదలకుండా.. వాటి రూపంలో కూడా ఈ గంజాయిని అక్రమణగా తరలిస్తున్న ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఆ వీడియోలో మొదటగా ఎంతో ఆరోగ్యాన్నిచ్చే పుచ్చకాయ కనిపించింది. దానిని ఓ పోలీసు అధికారి కట్ చేయగా.. అందులో పుచ్చకాయ గుజ్జుకు బదులు గంజాయి దర్శనమిచ్చింది. అది చూసిన పోలీసులు ఆశ్చర్యనికి గురయ్యారు. ఈ పుచ్చకాయ లోపల నుంచి అదే రంగుతో కూడిన ఒక బ్యాగ్ బయటకు వచ్చింది. అయితే దానిని కట్ చేయగా.. అందులో గంజాయి నింపి ఉంది. ఇక ఈ సరుకునంతా ఓ లారీలో లోడ్ చేశారు. దీంతో వెంటనే పోలీసులు ఆ లారీలో ఉండే పుచ్చకాయలను కోసి చూస్తే అందులో గంజాయి అక్రమణ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. అంతేకాదు వీడియోపై ఘాటుగా స్పందిస్తున్నారు. మరి, పుచ్చకాయ మాటున గంజాయి అక్రమణ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.