iDreamPost
android-app
ios-app

బ్రిటన్ ఎన్నికల్లో సత్తా చాటిన భారత సంతతి అభ్యర్థులు.. ఏకంగా 26 మంది గెలుపు

  • Published Jul 06, 2024 | 5:00 AM Updated Updated Jul 06, 2024 | 5:00 AM

UK Elections: తాజాగా బ్రిటన్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారత మూలాలున్న 26 మంది వ్యక్తులు విజయకేతనం ఎగురవేశారు. రిషి సునాక్ సహా పలువురు భారత సంతతికి చెందిన అభ్యర్థులు గెలుపొందారు.

UK Elections: తాజాగా బ్రిటన్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారత మూలాలున్న 26 మంది వ్యక్తులు విజయకేతనం ఎగురవేశారు. రిషి సునాక్ సహా పలువురు భారత సంతతికి చెందిన అభ్యర్థులు గెలుపొందారు.

బ్రిటన్ ఎన్నికల్లో సత్తా చాటిన భారత సంతతి అభ్యర్థులు.. ఏకంగా 26 మంది గెలుపు

బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందిన భారత మూలాలున్న అభ్యర్థుల్లో రిషి సునాక్ ముందున్నారు. రిచ్ మండ్ అండ్ నార్తర్న్ అలర్టన్ స్థానం నుంచి రిషి సునాక్ మరోసారి గెలిచారు. ఎంపీగా గెలిచారు. మాజీ హోమ్ మంత్రులు సుయెల్లా బ్రేవర్మన్, ప్రీతి పటేల్ లు మరోసారి గెలుపొందారు. కాగా భారత సంతతికి చెందిన క్లెయిర్ కౌటిన్హో, లైసెస్టర్ ఈస్ట్ నుంచి శివాని రాజా, సౌత్ వెస్ట్ హెర్ట్ ఫోర్డ్ షైర్ నుంచి కన్జర్వేటివ్ పార్టీ నేత గగన్ మొహీంద్ర ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. లేబర్ పార్టీకి చెందిన రాజేశ్ అగర్వాల్ పై శివానీ రాజా గెలుపొందారు. కన్జర్వేటివ్ పార్టీ నేతలు శైలేష్ వారా, అమిత్ జోగియాలు ఓటమి పాలయ్యారు. మరోవైపు భారత సంతతికి చెందిన సీమా మల్హోత్రా వాల్ సాల్ నియోజకవర్గం నుంచి గెలుపొందగా.. బ్లోక్స్ విచ్ నుంచి వాలెరీ వాజ్, ఆమె సోదరి కీత్ వాజ్, విగాన్ నియోజకవర్గం నుంచి లీసా నాండీలు అత్యధిక మెజారిటీతో గెలుపొందారు.

ఎక్కువ మంది భారత సంతతి అభ్యర్థులు లేబర్ పార్టీ నుంచి యూకే పార్లమెంటులో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా హౌస్ ఆఫ్ కామన్స్ లో భారత సంతతి అభ్యర్థులు సత్తా చాటారు. 26 మంది భారత మూలాలున్న అభ్యర్థులు బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికవ్వడం విశేషం. అయితే తెలుగు సంతతికి చెందిన ఉదయ్ నాగరాజు, చంద్ర కన్నెగంటిలు మాత్రం తాజాగా జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో ఓటమి చెందారు. ఇక ఈ ఎన్నికల్లో బ్రిటిష్ సిక్కు ఎంపీలు తన్ మంజిత్ సింగ్ ధేహి, ప్రీత్ కౌర్ గిల్ లు మరోసారి విజయకేతనం ఎగురవేశారు. ఇక లేబర్ పార్టీ నుంచి పోటీ చేసిన రదిమా విటోమ్, నావెందు మిశ్రాలు భారీ మెజారిటీతో గెలుపొందారు.

లేబర్ పార్టీకి చెందిన సత్వీర్ కౌర్, బాగీ శంకర్, జాస్ అథ్వాల్, హర్ ప్రీత్ ఉప్పల్, కనిష్క నారాయణ్, వారిందర్ జస్, గురిందర్ జస్, కిరిత్ ఎంట్విజిల్, సోనియా కుమార్, జీవన్ సంధేర్, సోజాన్ జోసెఫ్, సురీనా బ్రాకెన్ బ్రిడ్జ్ లు తొలిసారిగా బ్రిటన్ పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. వీరందరితో పాటు లిబరల్ డెమోక్రాట్ తరపున మునిరా విల్సన్ మరోసారి గెలుపొందారు. ఇంగ్లాండ్, నార్తర్న్ ఐర్లాండ్, వేల్స్, స్కాట్లాండ్ వ్యాప్తంగా 650 ఎంపీ స్థానాలు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 326 స్థానాలు రావాలి. ఈ క్రమంలో లేబర్ పార్టీ 410 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. కన్జర్వేటివ్ పార్టీ కేవలం 118 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ పార్టీకి చెందిన రిషి సునాక్ విజయం సాధించారు. కాగా 49 రోజుల పాటు ప్రధానిగా ఉన్న లిజ్ ట్రస్ ఓటమి చెందారు. మొత్తం మీద భారత మూలాలున్న 26 మంది వ్యక్తులు బ్రిటన్ ఎన్నికల్లో సత్తా చాటడం గర్వించతగ్గ విషయం.