iDreamPost
android-app
ios-app

భారత సంతతికి చెందిన వ్యక్తులకు 33 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే?

  • Published Feb 01, 2024 | 6:27 PM Updated Updated Feb 01, 2024 | 6:27 PM

Indian Origin Couple Jailed: ఈ మద్య కాలంలో విదేశాల్లో భారత సంతతికి చెందిన పలువురు వివిధ నేరాలకు పాల్పపడటంతో పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అలాంటి ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది.

Indian Origin Couple Jailed: ఈ మద్య కాలంలో విదేశాల్లో భారత సంతతికి చెందిన పలువురు వివిధ నేరాలకు పాల్పపడటంతో పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అలాంటి ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది.

భారత సంతతికి చెందిన వ్యక్తులకు 33 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే?

ఈ మద్య కొంతమంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే తపనతో ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. ఎదుటి వారిని బురిడీ కొట్టించి నిలువునా దోచేస్తున్నారు. డ్రగ్స్, అక్రమాయుధాల వ్యాపారం, హైటెక్ వ్యభిచారం, ఇలా ఎన్నో రకాల దందాలకు పాల్పపడుతూ డబ్బు సంపాదిస్తున్నారు. ఇలాంటి నేరాలకు పాల్పపడిన వారు ఏదోఒక సమయంలో పోలీసులకు చిక్కిపోతున్నారు. దేశంలోనే కాదు.. విదేశాల్లో కొంతమంది భారత సంతతికి చెందిన వారు పలు నేరాల్లో పోలీసులు చిక్కిపోయి శిక్ష అనుభవిస్తున్నారు. భారత సంతతికి చెందిన భార్యాభర్తలను సుదీర్ఘ విచారణ తర్వాత లండన్ కోర్టు 33 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అసలు వీరు ఏం నేరం చేశారు.. కోర్టు అనేళ్లు ఎందుకు శిక్ష విధించిందన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

లండన్ లో డ్రగ్స్ దందాలో అరెస్ట్ అయిన భారత సంతతికి చెందిన భార్యాభర్తలు ఆరతీ ధీర్, కవల్ జీత్ సింహ్ రాయ్ జుదాలకు లండన్ కోర్టు 33 ఏళ్ల జైలు శిక్ష విధించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ దంపతులపై కేసు నమోదు అయిన తర్వాత సుదీర్ఘ విచారణ తర్వాత దోషులుగా తేల్చి తాజాగా శిక్ష ఖారారు చేసింది కోర్టు. 2021 లో ఆస్ట్రేలియాకు డ్రగ్స్ ఎగుమతి చేస్తున్నారనే ఆరోపణలతో ఈ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టుకు ముందు హన్ వేల్ లో వీరి నివాసంలో సోదాలు చేయగా కళ్లు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి. దాదాపు రూ.31 కోట్ల విలువైన యూరోలు నగదు రూపంలో లభించగా, రూ.8 కోట్ల విలువైన ఇల్లు, కార్లతో పాటు 22 బ్యాంకుల్లో డిపాజిట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

గతంలో ఆరతీ, రాయ్ జాదాలు లండన్ లో సొంతగా డ్రగ్స్ కంపెనీ పెట్టుకొని హిత్రూ విమానాశ్రయంలో సుదీర్ఘంగా గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారం కొనసాగించారు. తమకు ఉన్న అనుభవంతో చెకింగ్ అధికారులను బురిడీ కొట్టిస్తూ ఆస్ట్రేలియాకు డ్రగ్స్ ఎగుమతి చేసేవారు. దాదాపు 2014 నుంచి 2016 వరకు వీరి దందా యథేచ్చగా కొనసాగింది. చాలా వరకు ఈ దంపతులు మెటల్ బాక్సుల్లో డ్రగ్స్ సరఫరా చేసేవారు. ఇలా టన్నుల కొద్ది డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆస్ట్రేలియా కస్టమ్స్ అధికారులు ఈ దంపతుల దందాను గుర్తించి అడ్డుకున్నారు. వీరితో పాటు ఎన్‌సీఏ ను అప్పమత్తం చేశారు. ఈ క్రమంలోనే ఎన్ సీఏ విస్తృత తనిఖీలు చేపట్టగా ఆరతీ ధీర్, కవల్ జీత్ డ్రగ్స్ వ్యాపారం గుట్ట బయటపడింది.

ఇదిలా ఉంటే.. ఈ దంపతులకు సంబంధించి మన దేశంలోనూ ఒక కేసు పెండింగ్ లో ఉంది. గుజరాత్ లో జరిగిన జంట హత్యల వెనుక ఈ జంట హస్తం ఉందని పోలీసులు కేసు పెట్టారు. గుజరాత్ కి చెందిన గోపాల్ అనే పదకొండేళ్ల బాలుడిని దత్తత తీసుకొని అతనికి ఇన్సూరెన్స్ చేయించి.. ఆ సొమ్ము కోసం 2017 లో కిరాయి హంతకులచే గోపాల్ ని అతన్ని కాపాడబోయిన అతడి బావను చంపించారు. ఈ డబుల్ మర్డర్ కేసులో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పట్లో ఈ కేసు విచారణ కోసం తమకు అప్పగించాలని భారత్ విజ్ఞప్తని యూకే తోసిపుచ్చింది. ఏది ఏమైనా ఆరతీ, రాయ్ జాదాలకు 33 ఏళ్లు జైలు శిక్ష పడటంతో చేసిన పాపానికి తగిన శిక్ష పడిందని అంటున్నారు.