iDreamPost
android-app
ios-app

సీక్రెట్ కెమెరాతో మహిళల 13వేల న*గ్న వీడియోలు.. అమెరికాలో భారతీయుడి అరెస్ట్!

  • Published Aug 22, 2024 | 5:29 PM Updated Updated Aug 22, 2024 | 5:29 PM

Indian Doctor Arrested in US: ప్రపంచంలో వైద్యులకు ఎంతో గౌరవ స్థానం ఉంటుంది. ప్రాణాలు రక్షించే వైద్యులను దేవుడితో పోలుస్తారు. కానీ ఈ మధ్య కొంతమంది వైద్య వృత్తికి కలంకం తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు.

Indian Doctor Arrested in US: ప్రపంచంలో వైద్యులకు ఎంతో గౌరవ స్థానం ఉంటుంది. ప్రాణాలు రక్షించే వైద్యులను దేవుడితో పోలుస్తారు. కానీ ఈ మధ్య కొంతమంది వైద్య వృత్తికి కలంకం తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు.

సీక్రెట్ కెమెరాతో మహిళల 13వేల న*గ్న వీడియోలు.. అమెరికాలో భారతీయుడి అరెస్ట్!

ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఆడవాళ్లపై అఘాయిత్యాలు రోజు రోజుకీ ఎక్కువైపోతున్నాయి. ఒంటరిగా ఉండే మహిళలపై కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు కామాంధులు ఎవరినీ వదలడం లేదు. తల్లిదండ్రులకు మనకు జన్మనిస్తే.. ఎలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారినైనా రక్షించి వారికి పునఃజీవితాన్ని ప్రసాదించే శక్తి వైద్యులకే ఉంటుంది. అందుకే వైద్యో నారాయణో హరి అంటారు. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనది. కానీ ఇటీవల కొంతమంది ఆ వృత్తికి కలంకం తెస్తున్నారు. ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే మహిళలు, ఆడపిల్లల న*గ్న చిత్రాలను సీక్రెట్ కెమెరాతో చిత్రీకరిస్తున్న డాక్టర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

పేరుకు అతను పెద్ద డాక్టర్.. కానీ చేసేది మాత్రం నీచమైన పనులు. అమెరికాలో చిన్నారులు, మహిళల నగ్న చిత్రాలను రికార్డ్ చేస్తున్న భారత సంతతికి చెందిన ఓ డాక్టర్‌ను అతని భార్యే స్వయంగా పోలీసులకు పట్టించింది. ఆ డాక్టర్ పేరు ఉమేర్ ఏజాజ్. గత కొంత కాలంగా ఆస్పత్రి పరిసరాలు, గదులు, బాత్రూంల్లో రహస్య కెమెరాలు అమర్చి ఫోటోలు, వీడియోలు రికార్డు చేస్తూన్న ఒమెయిర్‌ అజాజ్‌(40)ని పోలీసులు అరెస్ట్ చేశారు. మిషిగన్ రాష్ట్రంలోని ఓక్లాండ్ కౌంటిలో ఉన్న రోచెస్టర్ హీల్స్ లోని అతని నివాసంలోని కంప్యూటర్‌లో ఉన్న వీడియోలు చూసి పోలీసులకు మతిపోయింది. హార్డ్ డిస్క్, ఫోన్లు, 15 ఎక్స్‌టర్నల్ డివైజ్‌లను ఉన్న వీడియోలను స్వాధీనం చేసుకున్నాడు. ఇతని వద్ద ఏకంగా 13 వేలకుగా వీడియోలు ఉండటం గమనార్హం. మహిళలకు మత్తు ఇచ్చి వారు స్పృహలో లేనప్పుడు లైంగిదాడులు చేయడం, అభ్యంతరకర చర్యలకు పాల్పడిన దృశ్యాలు సైతం రికార్డు చేసినట్లు ఒక్లాండ కౌంటి పోలీసులు తెలిపారు.

ఒకరోజు ఉమర్ భార్య తన భర్త ల్యాప్ టాప్ లో వీడియోలు చూసి షాక్ తిన్నది. వెంటనే అతడు చేస్తున్న నీచమైన పనుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ అధికారి మైక్ బుచర్డ్ మాట్లాడుతూ.. ‘హాస్పిటల్ కి వచ్చిన ప్రతి ఒక్కరిని ఇతడు తన సీక్రెట్ కెమెరాతో వీడియో తీయడం.. ఎంజాయ్ చేయడం పనిగా పెట్టుకున్నాడు. ఎంతోమంది ఆడవాళ్లు ఇతని భారిన పడ్డట్టు తెలుస్తుంది. 2011లో వర్క్ వీసాపై ఇండియా నుంచి అమెరికా వెళ్లిన ఒయిమెయిర్ ఎజాజ్ అలబామాలో కొన్నేళ్ళ నివాసం ఉన్నాడు. 2018లో మిషగాన్ కు మకాం మార్చాడు. అక్కడ పలు ఆస్పత్రుల్లో ఫిజీషియన్ గా పనిచేశాడు.. తాను చేస్తున్న ఆస్పత్రుల్లో సీక్రెట్ కెమెరాలు అమర్ని ఈ దారుణాలకు పాల్పపడ్డాని పోలీసులు తెలిపారు.