iDreamPost
android-app
ios-app

రూ.8,300 కోట్లు మోసం కేసులో ఇండో అమెరికన్ వ్యాపారవేత్త అరెస్ట్!

  • Published Jul 02, 2024 | 3:21 PM Updated Updated Jul 02, 2024 | 3:21 PM

Indian American Issue: ఈ మధ్య కాలంలో డబ్బు సంపాదించడం కోసం కొంతమంది ఎదుటివారిని దారుణంగా మోసం చేస్తున్నారు. తమ కంపెనీల్లో పెట్టుబడి పెడితో లక్షలు, కోట్లు సంపాదించవొచ్చని లేనిపోని ఆశలు చూపించి మోసానికి పాల్పపడుతున్నారు.

Indian American Issue: ఈ మధ్య కాలంలో డబ్బు సంపాదించడం కోసం కొంతమంది ఎదుటివారిని దారుణంగా మోసం చేస్తున్నారు. తమ కంపెనీల్లో పెట్టుబడి పెడితో లక్షలు, కోట్లు సంపాదించవొచ్చని లేనిపోని ఆశలు చూపించి మోసానికి పాల్పపడుతున్నారు.

రూ.8,300 కోట్లు మోసం కేసులో ఇండో అమెరికన్ వ్యాపారవేత్త అరెస్ట్!

ఇటీవల కొంతమంది ఘరానా మోసగాళ్ళు  తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి లగ్జరీ జీవితాన్ని అనుభించాలనే కోరికతో ఎన్నో మోసాలు, దారుణాలకు పాల్పపడుతున్నారు. అమాయకులకు మాయమాటలు చెప్పి బురిడీ కొట్టించి అందినంత దోచుకుంటున్నారు. రక రకాల స్కీములు, డ్రగ్స్ వ్యాపారం, హైటెక్ వ్యభిచారం ఇలా ఎన్నో రకాల దందాలకు పాల్పపడుతూ కోట్లు దండుకుంటున్నారు. నేరం చేసింది ఎలాంటి వారైనా సరే పోలీసుల నుంచి తప్పించుకోలేరన్న విషయం తెలిసిందే. అమెరికా చరిత్రలోనే అతి పెద్ద కార్పోరేట్ మోసానికి పాల్పపడ్డ భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త గుట్టు రట్టయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అమెరికాలో తక్కువ సమయంలో మంచి పాపులారిటీ సంపాదించాడు ఇండో అమెరికన్ వ్యాపారవేత్త రిషి షా(37). వినూత్నమైన ఆలోచనలతో వ్యాపార రంగంలో దూసుకుపోయాడు. ఔట్ కమ్ హెల్త్ అనే కంపెనీ స్థాపించి తక్కువ సమయంలో సీఈఓ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. విపరీతమైన ప్రకటనలు చేస్తూ ఇన్వెస్టర్లను బాగా ఆకట్టుకున్నాడు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడం మొదలు పెట్టాడు. ఔట్ కమ్ హెల్త్ వ్యవస్థాపకుడు రిషి షా.. రూ.8,300 కోట్ల (ఒక బిలియన్ డాలర్లు) మేర వివిధ కంపెనీలను మోసగించిన కేసులో కోర్టు ఆయన్ని దోషిగా తేల్చింది. అమెరికా చరిత్రలో అతి పెద్ద కార్పోరేట్ నేరాల్లో ఇది ఒకటిగా నిలిచిపోయింది.

బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం.. 2006లో రిషి షా కాంటెక్ట్స్ మీడియా హెల్త్ పేరిట ఒక కంపెనీ స్థాపించాడు. దాన్ని తర్వాత ఔట్ కమ్ హెల్త్ పేరుగా మార్చాడు. వైద్యం కోసం డాక్టర్ల వద్దకు వచ్చే రోగులను ఆకర్షించుకునేందుకు ఆరోగ్యానికి సంబంధించిన టీవీ ప్రకటనలు ఇవ్వడం మొదలు పెట్టారు. ఇందు కోసం డాక్టర్స్ క్లీనిక్ లో టీవీలు ఏర్పాటు చేసేవాడు. రిషి షా ఆలోచనలు నచ్చి శ్రద్దా అగర్వాల్ అనే మహిళ ఈ సంస్థలో సహ భాగస్వామిగా చేరింది. 2010 నాటికి ఔట్ కమ్ హెల్త్ హెల్త్ కి సంబంధించిన పెట్టుబడుల రంగంలో అగ్రగామిగా నిలిచింది. దీంతో పెద్ద పెద్ద కార్పోరేట్ సంస్థలు ఔట్ కమ్ హెల్త్ లో భారీగా పెట్టుబడులు పెట్టాయి. దీంతో షికాగోలో రిషి షా, శ్రద్దా అగర్వాల్ పేరు మారుమోగింది. అంతా బాగా సాగుతుందనుకున్న సమయంలో వ్యాపారం బాగా దెబ్బతిన్నది. దీంతో రిషి షా, అగర్వాల్, కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బ్రాడ్ పర్టీ పెట్టుబడుదారులను మోసం చేయడం మొదలు పెట్టారు. సంస్థ సామర్థ్యం కన్నా ఎక్కువ పనిచేస్తున్నట్లు దొంగ లెక్కలు చూపించారు. ఇన్వెస్టర్ల నుంచి కోట్లు రావడంతో ఇద్దరు లగ్జరీ జీవితాన్ని అనుభవించడం మొదలు పెట్టారు.

ప్రైవేట్ జెట్ విమానాలు, పడవుల్లో విదేశీ టూర్లు, 10 లక్షల డాలర్లతో ఇల్లు కొనడం లాంటివి చేశాడు. ఇలా తప్పుడు లెక్కల ఆధారంగా 2016 లో అతని నికర ఆదాయం విలువ 4 బిలియన్ డాలర్లకు చేరింది. కానీ 2017 లో షా మోసాలను మీడియా బట్టబయలు చేసింది. దీంతో బడా కార్పోరేట్ కంపెనీలు రిషి షా, అగర్వాల్ పై కోర్టులో కేసులు వేశారు. సుదీర్ఘ విచారణ తర్వాత గత ఏడాది న్యాయస్థానం వీరిద్దరినీ దోషులుగా తేల్చింది. చేసిన నేరాన్ని రిషి షా ఒప్పుకున్నాడు. దీంతో న్యాయస్థానం రిషి షా కు ఏడేళ్లు, అగర్వాల్ కి మూడేళ్లు, ఫైనాన్షియల్ ఆఫీసర్ కి రెండేళ్లు జైలు శిక్ష విధించింది. భారత కరెన్సీ తో పోల్చితే దాదాపు రూ.8,300 కోట్ల వరకు ఘరానా మోసాలకు పాల్పపడిన రిషిషా జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు.