Arjun Suravaram
Child marriages In Pakistan: ఇటీవల కాలంలో భారీ వరదల కారణంగా అనేక ప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇలా వరదలకు, వానలకు పంట నష్టం, ఇతర ఆర్థిక నష్టాలు వాటిల్లే సంగతి మనకు తెలిసిందే. అయితే ఒక ప్రాంతంలో వరదల కారణంగా, ఆ భయంతో బాల్య వివాహాలు చేస్తున్నారు.
Child marriages In Pakistan: ఇటీవల కాలంలో భారీ వరదల కారణంగా అనేక ప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇలా వరదలకు, వానలకు పంట నష్టం, ఇతర ఆర్థిక నష్టాలు వాటిల్లే సంగతి మనకు తెలిసిందే. అయితే ఒక ప్రాంతంలో వరదల కారణంగా, ఆ భయంతో బాల్య వివాహాలు చేస్తున్నారు.
Arjun Suravaram
ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఇదే సమయంలో భారీ వరదల కారణంగా అనేక ప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇలా వరదలకు, వానలకు పంట నష్టం, ఇతర ఆర్థిక నష్టాలు వాటిల్లే సంగతి మనకు తెలిసిందే. అయితే ఒక ప్రాంతంలో వరదల కారణంగా, ఆ భయంతో బాల్య వివాహాలు చేస్తున్నారు. మరి.. వరదలకు ప్రాణ భయం ఉంటుంది. కానీ ఇలా చిన్న పిల్లలకు పెళ్లిళ్లు చేయడం ఏంటి?, అసలు ఎక్కడ వరదల భయంతో ఇలా బాల్య వివాహాలు చేస్తున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
వరదల భయంతో బాల్య వివాహాలు చేస్తోంది ఎక్కడో కాదు.. మన పొరుగు దేశమైన పాకిస్థాన్ లో. ఇక్కడ కొంతకాలంగా తగ్గిన బాల్య వివాహాలు, మళ్లీ ఆందోళకరంగా మారాయి. పాకిస్థాన్లో జులై- సెప్టెంబర్ మధ్యలో వచ్చే బుతుపవనాలు దేశానికి చాలా ముఖమైనవి. లక్షలాది మంది రైతులు ఈ బుతుపవనాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. కాగా ఇటీవలి కాలంలో పాక్ వాతావరణ మార్పులపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చేస్తున్నారు. వాతావరణ మార్పుల కారణంగా ప్రకృతి విపత్తులు పెరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. వారు చెప్పినట్లు గానే వరదలు, కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలు ప్రజలను భయపెడుతున్నాయి.
2022లో జరిగిన భారీ వరదల నుంచి పాక్ లోని చాలా ప్రాంతాలు ఇంకా కోలుకోలేదు. ఆస్తి నష్టంతో పాటు భారీగా పంట నష్టంతో వ్యవసాయంపై ఆధారపడే అనేక కుటుంబాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇక జీవనం సాగించడం కష్టంగా మారడంతో తమ బిడ్డలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. దీనికి ‘మాన్సూన్ బ్రైడ్’ అని పేరు పెట్టారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పెద్దవారితో పెళ్లి చేయించేస్తున్నారు. వారు ఇచ్చే డబ్బులతో బతుకు దెరువును సాగిస్తున్నారు. ఇటీవలే దాదు జిల్లాలోని మల్హాహ్ అనే గ్రామంలో 2023 బుతుపవనల సమయం నుంచి ఇప్పటి వరకు 45 మంది చిన్నారులకు పెళ్లిళ్లు చేశారు.
పేదరికం నుంచి బయటపడేందుకు ఇలా తమ ఇంట్లోని చిన్నపిల్లలకు వివాహం చేయడం తప్ప తమకు వేరే ఆప్షన్ కనిపించడం లేదని బాలికల తల్లిదండ్రులు బాధపడుతున్నారు. పాకిస్థాన్లో బాల్య వివాహాలను అడ్డుకునేందుకు పలు ఎన్జీఏలు యాక్టివ్గా కృషిచేస్తున్నాయి. కానీ అవి ఎంత వరకు ఫలితాల్ని ఇస్తాయో, ఎన్జీఓలు ఎంత కాలం వరకు బాల్య వివాహాలను అడ్డుకోగలవు అనేది ప్రశ్నార్థకంగా మారింది. మొత్తంగా వరదల భయంతో పాకిస్తాన్ బాల్య వివాహాలు చేస్తున్నారు. మరి…పాకిస్తాన్ లో ఉన్న ఈ పరిస్థితిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.