iDreamPost
android-app
ios-app

ఈ చిన్న జీవి ఎంత పని చేసింది.. హోటల్‌కు రూ. కోటి నష్టం!

ఈ చిన్న జీవి ఎంత పని చేసింది.. హోటల్‌కు రూ. కోటి నష్టం!

ఆటర్‌.. ఈ జీవి గురించి అందరికీ పెద్దగా తెలియకపోవచ్చు. జంతువులకు సంబంధించిన ఛానళ్లు చూసే వారికి దీనిపై ఓ ఐడియా ఉంటుంది. ఈ జీవులు నీటిలోనూ.. నేలపైనా జీవిస్తాయి. నీటిలోని చేపల్ని ఇతర చిన్న చిన్న జీవుల్ని వేటాడి చంపి తింటూ ఉంటాయి. ఇవి నీటిలో చాలా వేగంగా వేటాడగలవు. అంతేకాదు! ఇవి కొన్ని కొన్ని సార్లు మనుషులపై కూడా దాడులు చేస్తూ ఉంటాయి. తాజాగా, ఓ ఆటర్‌ కారణంగా ఓ హోటల్‌కు ఏకంగా కోటి రూపాయల నష్టం వచ్చింది. తమకు ఇంత పెద్ద నష్టం రావడానికి కారణం ఆటర్‌ అని తెలిపి హోటల్‌ వాళ్లు షాక్‌ అయ్యారు.

ఆ వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని చెష్టర్‌లో గ్రోస్‌వెనర్‌ పుల్‌పోర్డ్‌ అనే హోటల్‌ ఉంది. ఈ హోటల్‌ కోయ్‌ క్రాప్‌ అనే చేపల కర్రీకి పెట్టింది పేరు. ఈ చేపలు చాలా ప్రత్యేకమైనవి, ఖరీదైనవి ఈ చేపల కర్రీ ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కో చేప ధర 2 లక్షల రూపాయలుగా ఉంది. అందుకోసం కోయ్‌ క్రాప్‌ చేపల్ని ఓ ప్రత్యేకమైన చిన్న నీటి కుంటను ఏర్పాటు చేసి పెంచుతోంది. అయితే, గత కొద్దిరోజులనుంచి ఆ నీటి కుంటలోని చేపల సంఖ్య తగ్గుతూ వస్తోంది.

ఇలా ఏకంగా 50 కోయ్‌ క్రాప్‌ చేపలు మాయం అయ్యాయి. దీంతో హోటల్‌ యజమాన్యం షాక్‌కు గురైంది. అసలు ఏం జరుగుతోందో తెలుసుకోవటానికి సీసీ టీవీ కెమరాలను పరిశీలించింది. అప్పుడు అసలు విషయం తెలిసి కంగుతిన్నారు. ఓ ఆటర్‌ ఆ నీటి కుంటలోకి చొరబడి ఆ చేపల్ని తినడం గుర్తించారు. మరో సారి ఆ ఆటర్‌ కుంటలోకి వెళ్లకుండా తగిన ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేశారు. ఆ వీడియోలు కాస్తా వైరల్‌గా మారాయి.  మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.