Krishna Kowshik
మాతృత్వం ఓ వరం అని భావిస్తుంటారు మహిళలు. పెళ్లి విషయంలో భర్తలకు కండిషన్లు పెట్టడం గురించి విన్నారు కానీ.. పిల్లల్ని కనాలంటే కూడా షరతులు ఉండాయని తెలుసా..? ఇదిగో ఈ మహిళ పెడుతోంది.
మాతృత్వం ఓ వరం అని భావిస్తుంటారు మహిళలు. పెళ్లి విషయంలో భర్తలకు కండిషన్లు పెట్టడం గురించి విన్నారు కానీ.. పిల్లల్ని కనాలంటే కూడా షరతులు ఉండాయని తెలుసా..? ఇదిగో ఈ మహిళ పెడుతోంది.
Krishna Kowshik
అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలంటే లక్షలు సంపాదించే మొగుడు.. అందులోనూ సాఫ్ట్ వేర్ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ గ్రేడ్ 1 ఎంప్లాయ్, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, అత్తమామలతో కలిసి ఉండకూడదు, ఆడపడుచు అస్సలే ఉండకూడదన్న కండిషన్లు పెడుతున్నారు. వాళ్లకున్న డిమాండ్ అలాంటిది. ఈ ‘ఎక్స్ ట్రా’ ఆర్డినరీ కోరికల వల్ల వేలల్లో జీతగాళ్లకు పెళ్లిళ్లు కావడం కష్టంగా మారిపోయింది. లేటైనా సరే..తాము ఆశించిన అబ్బాయినే వరుడిగా స్వీకరిస్తున్నారు. వీరి కండిషన్లు పెళ్లితో ఆగిపోయాయనుకుంటే పొరపాటు.. పెళ్లి తర్వాత ఇంకా ఎక్కువ అవుతున్నాయి. కాపురం చేసే దగ్గర నుండి పిల్లల్ని కనే విషయంలో నిర్ణయం వరకు అంతా వీరి చేతిల్లోనే ఉంది.
పెళ్లి చేసుకోవాలంటే ఎదురు కట్నం అడుగుతున్న అమ్మాయిలు.. పిల్లల్ని కనేందుకు కూడా షరతులు పెడుతున్నారు. మాతృత్వం వరంగా భావించే మహిళలు కూడా కాసుల కోసం కక్కుర్తి చూపుతున్నారు. తాజాగా ఓ మహిళ.. పిల్లల్ని కనాలంటే.. తనకు డబ్బులివ్వాలంటూ భర్త నుండి డిమాండ్ చేసింది. ఇంతకు ఆ సదరు మహిళది ఎక్కడంటే.. దుబాయ్. దుబాయ్ మిలియనీర్ జమాల్ భార్య సౌదీ ఈ మేరకు కండిషన్లు పెడుతోంది. తాను ప్రెగ్నెంట్ కావాలన్నా, పిల్లల్ని కనాలన్నా.. ప్రతి నెల రూ. 2.5 కోట్ల తన ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేయాలని తేల్చి చెప్పింది. తల్లి కాబోతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇన్ స్టాలో తన భర్తతో ఖర్చు చేయిస్తూ.. ఆ వీడియోలను కూడా పోస్టు చేస్తుంది. తనపై భర్త డబ్బులు ఖర్చు పెట్టడం తనకు ఎంతో ఇష్టమని చెబుతోంది.
డెలివరీ సమయంలో కూడా మేకప్,హెయిర్ టీమ్ అవసరమట. బిడ్డ పుట్టిన తొలిలో బేబీని చూసేందుకు వెయ్యి నుండి రెండు వేల వరకు వస్తారని అంచనా వేసుకున్న సౌదీ.. వీఐపీ గదిని రిజర్వ్ చేయాలని భర్తను డిమాండ్ చేసింది. ఒక వేళ పిల్లలు పుడితే.. వారి అవసరాలు తీర్చేందుకు నెలవారీ భత్యం కింద రూ. 2.5 కోట్లు ఇవ్వాలని, అదే ఇద్దరు పిల్లలు అయితే.. ఆ మొత్తం రెట్టింపు ఇవ్వాలని కండిషన్లు పెడుతుంది. ఈ మొత్తం ఆమె థెరపీ సెషన్స్, ఫిజియో థెరపీ, ఆక్యు పంక్చర్ వంటివి చేయించుకుంటుందట. అలాగే తనకు వ్యక్తిగత సిబ్బందిని ఇవ్వాలని , తన నిద్రను ఆటంకాలు కలగకుండా నర్సును నియమించాలని కండిషన్లు పెడుతుందట. పెళ్లికి ముందే తన భర్తతో ఈ డిమాండ్ల గురించి చర్చించిదట. ఇది అన్నిటికన్నా పెద్ద ట్విస్టులా లేదు. వామ్మో మొత్తానికి అలా జరుగుబాటు అవుతుంది అమ్మడికి.