Keerthi
Bangladesh: మొన్నటివరకు బంగ్లాదేశ్ లో జరిగిన నిరసనలు, మరణహోమాలు మరువక ముందే ఆ రాష్ట్రంలో ఊహించని దారుణం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఆగస్టు 31న (శనివారం) బంగ్లాదేశ్‌లోని సృష్టించిన వరద భీభత్సం ప్రజలను అతలాకుతలం చేసింది. ఆ వివరాలేంటో చూద్దాం.
Bangladesh: మొన్నటివరకు బంగ్లాదేశ్ లో జరిగిన నిరసనలు, మరణహోమాలు మరువక ముందే ఆ రాష్ట్రంలో ఊహించని దారుణం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఆగస్టు 31న (శనివారం) బంగ్లాదేశ్‌లోని సృష్టించిన వరద భీభత్సం ప్రజలను అతలాకుతలం చేసింది. ఆ వివరాలేంటో చూద్దాం.
Keerthi
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ భారీ వర్షాలు ఎంతటి బీభత్సం సృష్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరోవైపు గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కూడా వర్షాలు దంచికోడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. పలు ప్రాంతాల్లో నదులు, చెరవులు, కాలువలు పొంగిపోయి లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారి ఇళ్లలోకి వరద నీరు చేరిపోవడంతో.. జన జీవనం మొత్తం అస్తవ్యస్తం అవుతుంది. ఇలా దేశం మొత్తం భారీ వర్షాల కారణంగా పరిస్థితి దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ లోని భారీ వర్షాలు వరదాలు కారణంగా ఊహించని దారుణం చోటు చేసుకుంది. విలయం సృష్టించిన వరదల కారణంగా బంగ్లాదేశ్ లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..
మొన్నటివరకు బంగ్లాదేశ్ లో జరిగిన నిరసనలు, మరణహోమాలు మరువక ముందే ఆ రాష్ట్రంలో ఊహించని దారుణం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఆగస్టు 31న (శనివారం) బంగ్లాదేశ్‌లోని సృష్టించిన వరద భీభత్సం ప్రజలను అతలాకుతలం చేసింది. సుమారు ఆ దేశంలోని 11 జిల్లాల్లో 5.4 మిలియన్లకు పైగా ప్రజలు ఈ వరద ప్రభావితంకు గురయ్యారు. అయితే ఈ వరదల్లో ఆరుగురు మహిళలు, 12 మంది పిల్లలతో సహా సుమారు 59 మంది మరణించారని తాజాగా ప్రభుత్వం ప్రకటించింది.
అలాగే ఈ వరద భీభత్సంలో సుమారు 11 జిల్లాల్లోని 504 యూనియన్లు, మున్సిపాలిటీల్లోని 54 లక్షల 57 వేల మంది పైగా ప్రజలకు విపత్తును తెచ్చిపెట్టాయి. అంతేకాకుండా.. దాదాపు ఏడు లక్షల కుటుంబాలు ఇంకా వరదల్లో చిక్కుకున్నారు. వారితో పాటు మరో నాలుగు లక్షల మంది 3,928 షెల్టర్ సెంటర్లలో నివసిస్తున్నారని విపత్తు నిర్వహణ, సహాయ మంత్రిత్వ శాఖ అధికారులు, బంగ్లాదేశ్ సంగ్‌బాద్ ఆర్గనైజేషన్ తెలిపింది. దీంతో పాటు 36,139 పశువులకు కూడా ఆశ్రయం కల్పించారు. అయితే ప్రస్తుతం పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉందని బంగ్లాదేశ్ అధికారులు చెబుతున్నారు. కాగా, ఇప్పుడు రక్షణ సిబరాల నుంచి ప్రజలు తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్నారని అధికారులు పేర్కొన్నారు. మరీ, బంగ్లాదేశ్ లో వరద విపత్తు వలన జరిగన ఈ ఘోరంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.