nagidream
Hackers Brought Back 25 Cr: హ్యాకర్స్ అంటేనే డబ్బు ఎక్కడుంటుందో అని వెతుక్కుంటూ వెళ్తారు. అలాంటిది 25 కోట్లు తమని వెతుక్కుంటూ వస్తే వదలకుండా ఎవరు మాత్రం ఉంటారు చెప్పండి. కానీ ఈ హ్యాకర్స్ మాత్రం అందుకు భిన్నం. డబ్బు కంటే కూడా మనిషి ఎమోషనే తమకు ముఖ్యం అని నిరూపించారు.
Hackers Brought Back 25 Cr: హ్యాకర్స్ అంటేనే డబ్బు ఎక్కడుంటుందో అని వెతుక్కుంటూ వెళ్తారు. అలాంటిది 25 కోట్లు తమని వెతుక్కుంటూ వస్తే వదలకుండా ఎవరు మాత్రం ఉంటారు చెప్పండి. కానీ ఈ హ్యాకర్స్ మాత్రం అందుకు భిన్నం. డబ్బు కంటే కూడా మనిషి ఎమోషనే తమకు ముఖ్యం అని నిరూపించారు.
nagidream
మామూలుగా హ్యాకర్స్ అంటే ఎలా ఉంటారో మనకి తెలిసిందే. తమది కాని సొమ్ముని కాజేసి జల్సాలు చేస్తుంటారు. అయితే హ్యాకర్స్ లో పలు సంస్థలకు చెందిన ముఖ్య సమాచారం హ్యాకింగ్ గురికాకుండా చూడడం కోసం మంచి హ్యాకర్స్ కూడా ఉంటారు. వీళ్ళని మినహాయిస్తే మిగతా హ్యాకర్స్ చాలా వరకూ డబ్బులు కాజేసే బ్యాచే ఎక్కువ. అయితే ఒక వ్యక్తి 25 కోట్లు వాలెట్ లో ఇరుక్కుపోయాయి.. పాస్వర్డ్ తెలియదు అని హ్యాకర్స్ దగ్గరకు వెళ్తే.. వాళ్ళు మంచి మనసుతో పోయాయనుకున్న డబ్బుని వెనక్కి తెచ్చి ఇచ్చారు. హ్యాకర్ జో గ్రాండ్ అలియాస్ కింగ్ పిన్ మరియు అతని రీసెర్చర్.. ఈ ఇద్దరూ ఒక వ్యక్తికి సంబంధించిన 25 కోట్ల రూపాయల డబ్బుని వెనక్కి తెచ్చి ఇచ్చారు.
ఆ వ్యక్తికి క్రిప్టో కరెన్సీ వాలెట్ లో 3 మిలియన్ డాలర్ల విలువ చేసే బిట్ కాయిన్ ఉంది. అంటే మన కరెన్సీ ప్రకారం దాదాపు 25 కోట్ల రూపాయలు. 11 ఏళ్ల క్రితం ఆ వ్యక్తి తన క్రిప్టో కరెన్సీ వాలెట్ పాస్వర్డ్ మర్చిపోయాడు. అప్పటి నుంచి అతను తన ఖాతాను ఓపెన్ చేయలేకపోతున్నాడు. పాస్వర్డ్ మర్చిపోక ముందు వరకూ బిట్ కాయిన్ విలువ 3 వేల డాలర్స్ నుంచి 4 వేల డాలర్స్ మధ్య ఉంది. అంటే మన కరెన్సీ ప్రకారం దాదాపు 2 లక్షల 50 వేల నుంచి.. 3 లక్షల 30 వేల రూపాయలు. అయితే ఆ బిట్ కాయిన్ విలువ ఇప్పుడు 20,000 శాతం పెరిగింది. దాని విలువ దాదాపు 25 కోట్లు. దీంతో ఆ వ్యక్తి.. జో గ్రాండ్ అనే హ్యాకర్ ని కలవాలని ఫిక్స్ అయ్యాడు. జో గ్రాండ్ యూఎస్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ డెవలప్ చేసిన టూల్ సహాయంతో పాస్వర్డ్ జనరేటర్స్ కోడ్ ని భాగాలుగా విడదీశాడు.
రోబోఫార్మ్ అనే ర్యాండమ్ పాస్వర్డ్ జనరేటర్ ద్వారా ఆ వ్యక్తి క్రిప్టోకరెన్సీ పాస్వర్డ్ అనేది జనరేట్ అయ్యింది. జో గ్రాండ్ అనే హ్యాకర్ ఒక ట్రిక్ ప్లే చేసి ఆ వ్యక్తి పోయాయనుకున్న 25 కోట్ల రూపాయల డబ్బుని వెనక్కి తెచ్చి ఇచ్చాడు. ఎప్పుడైతే పాస్వర్డ్ జనరేట్ అయ్యిందో ఆ ఏడాది అనగా 2013కి ఆ రోబోఫార్మ్స్ సిస్టంని తీసుకెళ్లాడు. తనకు తెలిసిన హ్యాకింగ్ టెక్నిక్స్ తో.. తోటి రీసెర్చర్ సహాయంతో పాస్వర్డ్ ని క్రాక్ చేసి క్రిప్టోకరెన్సీ వాలెట్ ని తెరిచాడు. 11 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి క్రిప్టోకరెన్సీ ఖాతాలోకి లాగిన్ అవ్వగలిగాడు. దీంతో ఆ వ్యక్తి పట్టరాని సంతోషంతో వారికి కృతజ్ఞతలు తెలియజేశాడు.
ఇదే హ్యాకర్స్ కనుక సినిమాల్లో ఉండే విలన్స్ క్యారెక్టర్స్ తో ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తిని చంపేసి.. అతని డబ్బుని కాజేసేవారు. లేదా పాస్వర్డ్ హ్యాక్ చేసి బిట్ కాయిన్ ని అమ్మేసుకుని ఆ 25 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఎప్పటికీ పాస్వర్డ్ ఓపెన్ కాకుండా చేసి జల్సాలు చేసేవారు. కానీ అలా చేయకుండా తమ దగ్గరకొచ్చిన కస్టమర్ కి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో అతని 11 ఏళ్ల క్రితం కోల్పోయిన పాస్వర్డ్ ని మాత్రమే కాకుండా.. పోయాయనుకున్న అతని డబ్బుని కూడా వెనక్కి తెచ్చి ఇచ్చారు. అది కూడా ఎలాంటి షేర్ అడక్కుండా తేవడం గొప్ప విషయం. అతను కొంత డబ్బు ఇచ్చి వాళ్లకి పాస్వర్డ్ ని క్రాక్ చేయమని టాస్క్ ఇచ్చాడు అంతే. కానీ వీళ్ళు అదనంగా ఏమీ ఆశించకుండా.. ల్యాగ్ చేయకుండా వీలైనంత త్వరగా అతని సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. దీంతో హ్యాకర్స్ లో మంచోళ్లు కూడా ఉంటారని రుజువైంది.