SNP
1200 ఏళ్ల నాటి పురాతన సమాధిని తవ్వితే.. పెద్ద ఎత్తున బంగారం బయటపడింది. బంగారు నిధితో పాటు ఓ 32 శవాలు కూడా బయటపడ్డాయి. ఈ విషయం చుట్టూ ఉన్న కథ తెలుసుకుంటే షాక్ అవ్వడం ఖాయం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
1200 ఏళ్ల నాటి పురాతన సమాధిని తవ్వితే.. పెద్ద ఎత్తున బంగారం బయటపడింది. బంగారు నిధితో పాటు ఓ 32 శవాలు కూడా బయటపడ్డాయి. ఈ విషయం చుట్టూ ఉన్న కథ తెలుసుకుంటే షాక్ అవ్వడం ఖాయం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
SNP
కలలో దేవుడు కనిపించి ఫలానా చోట బంగారం ఉంది, లంకే బిందెలు ఉన్నాయని చెబితే.. కొంతమంది అది నమ్మి, తమకొచ్చిన కల నిజమవుతుందని రహస్యంగా గుప్త నిధులకు వేట సాగిస్తుంటారు. చాలా వరకు అవన్నీ మూఢ నమ్మకాలు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం మాత్రం నిజం. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ జరిపిన తవ్వకాల్లో ఓ బంగారు నిధి బయటపడింది. అందులో బంగారంతో చేసిన బట్టలు, నగలు, చెవి పొగులు, బెల్ట్‌లు.. అబ్బో ఇంకా చాలా రకాల బంగారపు ఆభరణాలు, వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ చూపి.. ప్రపంచమే నివ్వెరపోతుంది. ఈ బంగారు నిధితో పాటు ఒళ్లు గగుర్పొడిచే విషయం ఇంకోటుంది. అదేంటంటే.. బంగారు నిధితో పాటు 32 శవాలు కూడా ఆ తవ్వకాల్లో బయటపడ్డాయి. శవాల అవశేషాలు పక్కనే గుట్టలు గుట్టలుగా బంగారం. ఈ సీన్ చూసి.. తవ్వకాలు జరిపిన పురావస్తు శాస్త్రవేత్తలే షాక్ తిన్నారు. ఇంతకీ ఈ తవ్వకాలు ఎక్కడ జరిపారు? ఆ శవాలు ఎవరివి? అంత మందిని ఒకే సమాధిలో ఎందుకు పూడ్చారు? అది ఏ కాలం నాటి సమాధి? ఎంత బంగారం దొరికింది? లాంటి సంచలన విషయాలన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మధ్య అమెరికా దేశమైనా పనామాలో బంగారు నిధులు ఉన్న సమాధిని పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ ప్రదేశంలో తవ్వకాలు జరిపారు. ఆ తవ్వకాల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. 1200 ఏళ్ల నాటి సమాధిలో బంగారు నిధి బయటపడింది. దాంతో పాటు పక్కనే 32 మంది మృతుల అవశేషాలు కనిపించాయి. అందులో ఒక శవం చాలా స్పెషల్‌గా ఉంది. ఆ శవం ప్రాచీన కాలపు ఓ ప్రభువుది అయి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 1200 ఏళ్ల క్రితం నాటి కోక్లే సంస్కృతికి చెందిన ఓ ఉన్నత స్థాయి వర్గానికి చెందిన ప్రభువు సమాధిగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ప్రభువు మరణం తర్వాత.. ఆయనను భారీ బంగారు ఆభరణాలతో అలకరించి.. ఈ సమాధిలో ఖననం చేసినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
అయితే.. మరి ఆ మిగిలిన 31 శవాలు ఎవరి అనే కోణంలో పరిశోధన జరిపితే.. ఆ కాలంలో ప్రభువు శవానికి తోడుగా కొంతమందిని బలి ఇచ్చి ప్రభువు శవంతో పాటు ఖననం చేసే వారంటా. ఆ క్రమంలోనే ఆ నాటి ప్రభువుతో పాటు ఓ 31 మందిని బలి ఇచ్చి సమాధి చేసినట్లు తెలుస్తోంది. అలా ఆ సమాధిలో మొత్తం 32 మంది అవశేషాలు లభ్యమయ్యాయి. పనామాకు 100 మైళ్ల దూరంలో ఉన్న ఎల్‌కానో ఆర్కియాలాజికల్ పార్క్‌లో 1200 ఏళ్ల నాటి సమాధిలో ఇదంతా బయటపడింది. అయితే.. శవాల సంగతి పక్కనపెడితే.. అందులో భారీ మొత్తంలో బంగారం బయటపడటం విశేషం. ప్రభువుతో పాటు భారీ మొత్తంలో బంగారు నిధిని సమాధి చేసినట్లు తెలుస్తోంది. ఇంకా ఆ సమాధిని పూర్తి స్థాయిలో తవ్వితే.. ఇంకా పెద్ద మొత్తంలో బంగారు దొరికే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఈ బంగారు సమాధి, 32 శవాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Gold treasure, 32 dead bodies found in 1,200-year-old tomb in Panamahttps://t.co/cJdlgRBC5k
-via inshorts— satyailapakurti (@ilapakurthi) March 10, 2024