Venkateswarlu
కానీ, నీటి చుక్క ఎప్పటికైనా నీటి చుక్కే.. రాయి ఎప్పటికైనా రాయే..’’ అని పేర్కొన్నారు. ఆమె పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు జార్జియా ప్రశంసలు కురిపిస్తున్నారు.
కానీ, నీటి చుక్క ఎప్పటికైనా నీటి చుక్కే.. రాయి ఎప్పటికైనా రాయే..’’ అని పేర్కొన్నారు. ఆమె పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు జార్జియా ప్రశంసలు కురిపిస్తున్నారు.
Venkateswarlu
ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలనీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రియుడితో పదేళ్ల బంధానికి స్వప్తి పలికారు. ప్రియుడు గియాంబ్రూనోకు బ్రేకప్ చెప్పారు. కొద్దిరోజుల క్రితం ఓ టీవీ షోలో అతడు మహిళలపై చేసిన అసభ్య కామెంట్లే ఇందుకు కారణం అయ్యాయి. ఓ మహిళగా.. దేశానికి నాయకత్వం వహిస్తున్నా ఓ మహిళా ప్రధానిగా ఆమె మనసును కష్టపెట్టుకునే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇద్దరికీ 2015లో పెళ్లయింది. ప్రస్తుతం వారికి ఏడేళ్ల వయసున్న ఓ కూతురు ఉంది. కూతురి భవిష్యత్తు కంటే మహిళల ఆత్మగౌరవం ముఖ్యమనుకున్న ఆమె ప్రియుడినుంచి దూరం అయ్యారు.
ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో ఈ విధంగా ఉంది.. ‘‘ పదేళ్లకు పైగా బంధానికి ఇక్కడితో తెరపడింది. ఇక ఇప్పటినుంచి మా దారులు వేరు.. దాన్ని గుర్తించాల్సిన సమయం వచ్చింది. ఇన్నేళ్ల పాటు ఇద్దరం చాలా అద్భుతంగా జీవించాము. ఎన్నో ఇబ్బందుల్ని కూడా ఎదుర్కొన్నాము. నన్ను క్షమించు.. ముఖ్యంగా కూతురు గెనర్వా విషయంలో. నన్ను బలహీన పర్చడానికి చాలా మంది నా కుటుంబంపై బురదజల్లుతున్నారు. నీటి చుక్క ఓ బండరాయిని పగుల గొట్టాలని చూడొచ్చు.
కానీ, నీటి చుక్క ఎప్పటికైనా నీటి చుక్కే.. రాయి ఎప్పటికైనా రాయే..’’ అని పేర్కొన్నారు. ఆమె పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు జార్జియా ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘ మహిళల కోసం ప్రేమ బంధాన్ని వదులుకుంది. చాలా గ్రేట్’’.. ‘‘ ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, మహిళలపై కామెంట్లు చేసిన ప్రియుడికి ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలనీ బ్రేకప్ చెప్పటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.