iDreamPost
android-app
ios-app

లైవ్ లో మాట్లాడుతుండగా పిడుగు పడింది.. షాకింగ్ వీడియో

  • Published Oct 06, 2023 | 6:01 PM Updated Updated Oct 06, 2023 | 6:01 PM
లైవ్ లో మాట్లాడుతుండగా పిడుగు పడింది.. షాకింగ్ వీడియో

ఇటీవల సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో వింతలు, విచిత్రాలకు సంబంధించిన వీడియోలు మన కళ్ల ముందు దర్శనమిస్తున్నాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. కొన్ని వీడియోలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కొంతమంది యూట్యూబర్స్ అత్యంత కష్టమైన సాహసాలు చేస్తూ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా  ప్రముఖ జీవశాస్త్రవేత్త ఫారెస్ట్ గలాంటేకు భయంకర అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే..

అమెరికాకు చెందిన ప్రముఖ జీవశాస్త్రవేత్త ఫారెస్ట్ గాలంటేకు అడవుల్లో సాహసాలు చేయడం అంటే ఎంతో ఇష్టం. వన్యప్రాణులు పరిరక్షణ కోసం ఆయన పోరాటం చేస్తున్నారు. వన్యప్రాణి జీవిశాస్త్ర రంగంలో పనిచేస్తూ దట్టమైన అడవుల్లో సంచరిస్తూ…  పలు రకాల వృక్షాలు, జంతువుల గురించి విరిస్తూ యూట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేస్తుంటారు. ఆయన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి.

ఫారెస్ట్ గాలంటే సౌత్ ఫ్లోరిడాలో తన యూట్యూబ్ చానెల్ కోసం వీడియో షూట్ చేస్తున్నారు. ఓ దట్టమైన అడవిలోని వాగులో మోకాలి లోతు నీళ్లలో నిలబడి అక్కడ పరిసర ప్రాంతాల గురించి వివరిస్తున్నారు. గాలంటే మాట్లాడుతూ.. ఇక్కడ పరిసరాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి.. నిరు నిలకడగా ఉంది, మా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.. ఇప్పుడు వర్షం పడుతుంది. ఫ్లోరిడాలో తరుచూ  మెరుపులతో పడుతూ ఉంటాయి..’ అంటూ వివరిస్తున్నారు. అంతలోనే ఆయన పక్కన ఓ పిడుగు పడింది. దాంతో గాలంటే ఒక్కసారిగా కిందపడిపోయాడు.. కెమెరా షేక్ అయ్యింది.. అందరూ అక్కడ నుంచి పరుగు పెట్టారు.

ఈ ఘటన జరిగిన కొద్ది గంటల తర్వాత ఫారెస్ట్ గాలంటే మెళ్లిగా తేరుకొని తిరిగి వీడియో తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది హారీబుల్ సంఘటన.. నీ జీవితంలో ఫస్ట్ టైమ్ ఇలా జరిగింది. ఆ సమయంలో కాంతిని నేను చూడలేకపోయాను, ఏం జరిగిందో కొద్దిసేపటి వరకు అర్థం కాలేదు.. మైండ్ బ్లాక్ అయ్యింది. అదృష్టం కొద్ది నా టీమ్ కి ఏమీ కాలేదు అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.