iDreamPost
android-app
ios-app

అదృష్టం అంటే అతడిదే.. 13 వేల కోట్ల లాటరీ గెలిచాడు!

  • Published Aug 10, 2023 | 12:10 PM Updated Updated Aug 10, 2023 | 12:10 PM
  • Published Aug 10, 2023 | 12:10 PMUpdated Aug 10, 2023 | 12:10 PM
అదృష్టం అంటే అతడిదే.. 13 వేల కోట్ల లాటరీ గెలిచాడు!

లాటరీలో ఓ వ్యక్తికి ఓ కోటి రూపాయలు తగిలింది అనుకోండి.. అదృష్టం అంటే అతడిదే.. అని అంటాం. అదే ఏకంగా 13 వేల కోట్ల రూపాయలు తగిలితే ఏమనాలి. అంత పెద్ద మొత్తంలో లాటరీ తగిలిన వ్యక్తిని అదృష్టానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ అని అనొచ్చే‍మో.. తాజాగా, అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి ఏకంగా 13 వేల కోట్ల లాటరీ తగిలింది. దీంతో అతడి దశ మారిపోయింది. అది కూడా అత్యంత అరుదుగా అదృష్టం వరించే లాటరీ అతడికి తగలటం విశేషం. ఆ పూర్తి వివరాల్లోకి వెళితే..

అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఓ అజ్ఞాత వ్యక్తి కొద్దిరోజుల క్రితం మెగా మిలియన్‌ లాటరీని కొన్నాడు. అతడి అదృష్టం బాగుండి. అత్యంత అరుదైన సంఘటన చోటుచేసుకుంది. డ్రాలో 13, 19, 20, 32, 33, 14 నెంబర్‌ లాటరీకి ప్రైజ్‌ మనీ వచ్చింది. దీంతో అతడు ఏకంగా 13 వేల కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. అమెరికా లాటరీ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ప్రైజ్‌ మనీ గెలుచుకోవటం ఇదే ప్రథమం. 2018లో కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి 12,600 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. తర్వాత ఎ‍వ్వరూ కూడా అంత పెద్ద మొత్తం డబ్బులు గెలుచుకోలేదు.

దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఓ అజ్ఞాత వ్యక్తిని 13 వేల కోట్ల రూపాయల లాటరీ వరించింది. ప్రస్తుతం ఈ లాటరీ వార్త సోషల్‌ మీడియాలో, మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంత పెద్ద మొత్తం లాటరీ గెలుచుకున్న అతడి అదృష్టానికి నెటిజన్లు, పాఠకులు నోరెళ్లబెడుతున్నారు. అదృష్టానికి బ్రాండ్‌ అంబాసిడర్‌లా ఉన్నాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి, అమెరికాకు చెందిన ఓ అజ్ఞాత వ్యక్తికి ఏకంగా 13 వేల కోట్ల రూపాయల లాటరీ తగలటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomcasinomilyonşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobet güncel girişgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom