iDreamPost
android-app
ios-app

మీ కక్కుర్తి పాడుగాను.. ఏకంగా విమానంలోనే రొమాన్స్.. 4 గంటల పాటు

  • Published Apr 12, 2024 | 2:15 PM Updated Updated Apr 12, 2024 | 2:15 PM

బైక్, కారులో రొమాన్స్ రొటీన్ అనుకున్నారేమో.. ఈ జంట ఏకంగా గాల్లో శృంగారం చేస్తూ రెచ్చిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. ఆ వివరాలు..

బైక్, కారులో రొమాన్స్ రొటీన్ అనుకున్నారేమో.. ఈ జంట ఏకంగా గాల్లో శృంగారం చేస్తూ రెచ్చిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. ఆ వివరాలు..

  • Published Apr 12, 2024 | 2:15 PMUpdated Apr 12, 2024 | 2:15 PM
మీ కక్కుర్తి పాడుగాను.. ఏకంగా విమానంలోనే రొమాన్స్.. 4 గంటల పాటు

ఒకప్పుడు అమ్మాయి, అబ్బాయి పక్కపక్కన నడవాలంటేనే భయపడేవారు. ఆఖరికి క్లాస్మెట్స్ అయినా సరే.. పలకరించుకోవాలంటే ఏదో తెలియని భయం. మరి ఇప్పుడో పలకరింపులను దాటి చాలా ముందుకెళ్లిపోయారు. రోడ్ల మీదనే హగ్ చేసుకోవడం, కిస్ చేసుకోవడం వంటి పనులను ఎలాంటి జంకుగొంకు లేకుండా కానిచ్చేస్తున్నారు. ఇక పబ్లిక్ పార్కుల్లో కరువు బ్యాచ్ చేసే పనులు మరింత దరిద్రం. చిన్నపిల్లలు ఉన్నారనే విషయం మర్చిపోయి మరి రెచ్చిపోతుంటారు. ఇక ఈ మధ్య కాలంలో బైక్, కారు, మెట్రోలో అందరి ఎదుటే రొమాన్స్ చేసే జంటలను చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వాళ్లను మించిన వారి గురించి తెలుసుకోబోతున్నాం.

ఇక సదరు జంట బైక్, కారులో రోడ్డు మీద రొమాన్స్ కామన్ అనుకుందో.. ఏమో తెలియదు కానీ ఏకంగా ఆకాశంలో అదేనండి విమానంలో శృంగారం చేస్తూ రెచ్చిపోయారు. చుట్టూ ప్రయాణికులు ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి మరి.. హద్దుల దాటి ప్రవర్తించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది.

అమెరికాకు చెందిన ఓ విమానంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఇక ఈ ఫ్లైట్ ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తుంది అనే వివరాలు ఏవి తెలియలేదు. విమానం ఎక్కిన ఓ జంట.. తన పక్కన రెండు సీట్లు ఖాళీగా ఉండటంతో.. ఆ సీట్లపై పడుకుని రొమాన్స్ చేసుకున్నారు. నాలుగు గంటలు అలాగే గుసగుసలాడుకున్నారు. ఒకరినొకరు హగ్ చేసుకుని.. చిలిపి పనులు చేసుకుంటూ.. తోటి ప్రయాణికులకు సుమారు 4 గంటల పాటు సినిమా చూపించారు. మరీ వీళ్లు ఇంతలా రెచ్చిపోతుంటే.. మిగతా ప్రయాణికులు, విమాన సిబ్బంది ఏం అనలేదా అంటే.. వాళ్లు కూడా వీళ్లను పెద్దగా పట్టించుకోలేదట.

విమాన సిబ్బంది సైతం సీట్లు ఖాళీగా ఉన్నాయి.. ఎవరినీ డిస్ట్రబ్ చేయటం లేదు.. తోటి ప్రయాణికులు కూడా వీరి మీద ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.. అలాంటప్పుడు వాళ్లని డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకున్నారట. అటూ ఇటూ తిరుగుతూ.. ఈ జంటను చూసి ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్లిపోయారంట. ఇక ఇదే విమానంలోని ఓ ప్రయాణికుడు ఫ్లైట్ లో రొమాన్స్ చేస్తోన్న ఈ జంట ఫొటోలు తీసి ఎక్స్ లో షేర్ చేయడంతో ఇవి తెగ వైరల్ అవుతున్నాయి. నాలుగు గంటల పాటు ప్రయాణికులకు ఫ్రీ సినిమా చూపించారుగా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio