P Krishna
మనిషికి అదృష్టం ఒక్కోసారి ఒకో రూపంలో కలిసి వస్తుంది. కొంతమందికి లంకె బిందెల రూపంలో, లాటరీ రూపంలో కలిసి వస్తుంది. అలా ఒక్కరోజులోనే బీదరికంటో ఉన్నవాళ్లు కాస్త కోటీశ్వరులుగా మారిపోతుంటారు
మనిషికి అదృష్టం ఒక్కోసారి ఒకో రూపంలో కలిసి వస్తుంది. కొంతమందికి లంకె బిందెల రూపంలో, లాటరీ రూపంలో కలిసి వస్తుంది. అలా ఒక్కరోజులోనే బీదరికంటో ఉన్నవాళ్లు కాస్త కోటీశ్వరులుగా మారిపోతుంటారు
P Krishna
అదృష్టం ఏ రూపంలో కలిసి వస్తుందో ఎవరూ ఊహించలేరు. పేదరికంలో ఉన్నవాళ్లు రాత్రికి రాత్రే లక్షాదికారులు, కోటీశ్వరులుగా మారిపోతారు. ముఖ్యంగా లాటరీ టికెట్ కొన్నవారికి అదృష్ట లక్ష్మి వరిస్తే ఒక్కరోజులోనే కోటీశ్వరులగా మారిపోతారు. కాకపోతే అది లక్షల్లో ఎవరికో ఒకరికి మాత్రమే కలిసి వస్తుంది. మరికొంతమందికి లంకె బిందల రూపంలో అదృష్టం కలిసి వస్తుంది. అప్పుడప్పుడు మత్స్యకారులకు చేపల రూపంలో అదృష్ట లక్ష్మి వరిస్తుంది. కేవలం చేపలు అమ్మి ఒక్కరోజులో లక్షలు, కోట్లు సంపాదించిన వారు ఉన్నారు. తాజాగా సముద్రంలోకి వేట కోసం వెళ్లిన మత్స్యకారుడికి అరుదైన చేప లభించింది. దాన్ని వేలం వేయగా ఏకంగా కోట్ల రూపాయల్లో ధర పలికింది. ఈ ఘటన పాకిస్థానలోని కరాచీలో జరిగింది. అసలు అది ఏం చేప.. దానికి ఎందుకు అంత విలువు ఉంటుంది అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
పాకస్థాన్ లోని కరాచీకి చెందిన హజీ బలోచ్ అనే మత్స్యకారుడు తోటి మత్స్యకారులతో అరేబియా సముద్రంలోని సోమవారం చేపల వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో అతనికి అత్యంత అరుదైన చేల వలలో చిక్కింది. దీన్ని గోల్డెన్ ఫిష్ అంటారు.. అయితే స్థానికంగా ఈ చేపను ‘సోవా’ అని కూడా పిలుస్తుంటారు. ఈ చేప మిల మిల మెరుస్తూ బంగారు వర్ణంలో ఉంటుంది. ఈ చేపలో ఎన్నో అద్బుతమైన ఔషదాలు దాగి ఉన్నాయని అంటున్నారు. ఈ చేప సుమారు 20 నుంచి 40 కిలోల బరువు ఉంటుంది.. 1.5 మీటర్ల పొడవు ఉంటుంది. ఇవి సంతానోత్పత్తి కాలంలో మాత్రమే సముద్ర తీరానికి వస్తుంటాయి. ఈ చేపను పలు దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు వాడుతుంటారని స్థానికులు నమ్ముతుంటారు. శుక్రవారం కరాచీ నౌకాశ్రయంలో ఈ చేపలను వేలం వేయగా పాక్ కరెన్సీలో దాదాపు 70 మిలియన్ రూపాయలకు అమ్ముడు పోయింది. ఇది భారత కరెన్సీ ప్రకారం రూ. 7 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు.
ఈ సందర్బంగా మత్స్యకారుడు హజీ బలోచ్ మాట్లాడుతూ.. ‘ఎంతో కాలంగా చేపల వేట చేస్తున్నాం.. ఈసారి కరాచీకి దూరంగా ఉన్న సముద్రంలోకి వేటకు వెళ్లాం. ఇప్పటి వరకు ఎన్నో రకాల చేపలు దొరికాయి.. కాకపోతే ఇలాంటి వెరైటీ చేప దొరకడం ఇదే మొదటిసారి. ఈ చేపను చూడగానే మొదట చాలా ఆశ్చర్యపోయాం.. నాతో వెళ్లిన మత్స్యకారులు అందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చేపను అమ్మగా వచ్చిన డబ్బు నా టీమ్ లో ఉన్న ఏడుగురం సమానంగా పంచుకుంటాం. ఇక షిప్ యార్డ్ లో ఈ చేప వేలం వేసిన తర్వాత 70మిలియన్ అనడంతో నా కళ్లు బైర్లు కమ్మాయి. నాకు గొప్ప అదృష్టం కలిసి వచ్చింది.. దేవుడికి కృతజ్ఞతలు. ఈ డబ్బుతో ఏం చేయాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదు’అని అన్నారు.