nagidream
FBI Released Photo Of Thomas Matthew Crooks Who Try To Take Out Donald Trump: శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగిస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ట్రంప్ చెవికి తీవ్ర గాయం కాగా కాల్పులకు తెగబడిన నిందితుడ్ని స్పాట్ లోనే హతమార్చారు. కాగా నిందితుడి ఫోటోను విడుదల చేశారు. అయితే అతను ఒక బ్రైట్ స్టూడెంట్ అని చెబుతున్నారు. మరి ఎందుకిలా చేశాడు?
FBI Released Photo Of Thomas Matthew Crooks Who Try To Take Out Donald Trump: శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగిస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ట్రంప్ చెవికి తీవ్ర గాయం కాగా కాల్పులకు తెగబడిన నిందితుడ్ని స్పాట్ లోనే హతమార్చారు. కాగా నిందితుడి ఫోటోను విడుదల చేశారు. అయితే అతను ఒక బ్రైట్ స్టూడెంట్ అని చెబుతున్నారు. మరి ఎందుకిలా చేశాడు?
nagidream
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. అమెరికాలోని పెన్సిల్వేనియా ప్రావిన్స్ లోని బట్లర్ టౌన్ లో ట్రంప్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగం ఇస్తున్నారు. ఈ క్రమంలో ప్రసంగం ఇస్తున్న వేదిక ఎదురుగా ఓ భవనం పై నుంచి నిందితుడు ట్రంప్ పై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ట్రంప్ చెవికి తీవ్ర గాయమైంది. తాజాగా అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) ట్రంప్ పై కాల్పులకు పాల్పడిన నిందితుడి ఫోటోలను విడుదల చేసింది. 20 ఏళ్ల థామస్ మ్యాథ్యు క్రూక్స్ అనే యువకుడు ట్రంప్ పై కాల్పులు జరిపినట్లు ఎఫ్బీఐ అధికారులు వెల్లడించారు.
ట్రంప్ పై కాల్పులు జరిగిన అనంతరం థామస్ మ్యాథ్యు క్రూక్స్ ఒక భవనంపై నుంచి మరో భవనంపైకి దూకుతూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ట్రంప్ కోసం పని చేసే సీక్రెట్ ఏజెంట్లు సెకన్ల వ్యవధిలోనే థామస్ ని అంతమొందించారు. దీంతో ట్రంప్ కి ప్రాణాపాయం తప్పింది. థామస్ చనిపోయిన తర్వాత మృతదేహం పక్కన ఉన్న అసాల్ట్ రైఫిల్ ఏ-15ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. థామస్ క్రూక్స్ బెతెల్ పార్క్ హైస్కూల్లో చదువుకునే సమయంలో చురుకుగా ఉండేవాడని, ఒంటరిగా ఉండేవాడని.. క్రమశిక్షణతో తన పనేదో తాను చేసుకుంటూ పోయేవాడని తోటి విద్యార్థులు, స్కూల్ టీచర్లు చెబుతున్నారు. అంతేకాదు స్కూల్లో నిర్వహించిన నేషనల్ మ్యాథ్స్, సైన్స్ ఇనిషియేటివ్ పోటీలో 500 డాలర్ల ప్రైజ్ మనీ కూడా గెలుచుకున్నాడు.
అంత తెలివైన విద్యార్ధి, బాగా చదివే విద్యార్ధి ఇలా ట్రంప్ పై కాల్పులు జరపడంపై స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు అంతా షాక్ కి అయ్యారు. క్రూక్స్ ఎప్పుడూ రాజకీయాల మీద ఎలాంటి ఆసక్తి కనబరచలేదని.. ట్రంప్ గురించి గానీ, రాజకీయాల గురించి గానే ఎప్పుడు చర్చించలేదని.. ఇలా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదని థామస్ స్నేహితులు చెబుతున్నారు. అయితే థామస్ క్రూక్స్.. నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు తన పేరుని నమోదు చేసుకున్నాడు. అయితే థామస్ స్కూల్లో చదువుతున్న రోజుల్లో వేధింపులకు గురయ్యాడని అంతర్జాతీయ మీడియా న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది.
ట్రంప్‌పై కాల్పులు జరిపిన వ్యక్తి ఇతనే.. బ్రైట్ స్టూడెంట్ అయ్యుండి ఎందుకిలా చేశాడు?హైస్కూల్లో చదువుతున్నప్పుడు గురి చూసి రైఫిల్ పేల్చడంలో పేలవమైన ప్రదర్శన కలిగి ఉండడం.. అశ్లీల జోకులు వేయడం వంటి కారణాల వల్ల థామస్ ని రైఫిల్ టీమ్ నుంచి తొలగించినట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. థామస్ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేవాడని.. వేట దుస్తులు ధరించి స్కూల్ కి వచ్చేవాడని అతనితో కలిసి చదువుకున్న మాజీ విద్యార్థులు వెల్లడించారని న్యూయార్క్ మీడియా రాసుకొచ్చింది. అయితే థామస్ ఎందుకు ట్రంప్ పై కాల్పులు జరిపాడు అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఎఫ్బీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.