iDreamPost
android-app
ios-app

ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాలపై నిషేధం విధించిన నేపాల్.. కారణం ఇదే

  • Published May 17, 2024 | 11:43 AMUpdated May 17, 2024 | 11:43 AM

గత కొన్ని రోజుల క్రితం ప్రముఖ బ్రాండెడ్ మసాలా ఉత్పత్తులైనా ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలా దినుసుల దిగుమతిపై సింగపూర్‌, హాంకాంగ్ నిషేధం విధించిన విషయం తెలసిందే. అయితే తాజాగా ఇప్పుడు మరో దేశంలో కూడా ఈ మసాలా దినుసుల పై నిషేధం విధించారు.

గత కొన్ని రోజుల క్రితం ప్రముఖ బ్రాండెడ్ మసాలా ఉత్పత్తులైనా ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలా దినుసుల దిగుమతిపై సింగపూర్‌, హాంకాంగ్ నిషేధం విధించిన విషయం తెలసిందే. అయితే తాజాగా ఇప్పుడు మరో దేశంలో కూడా ఈ మసాలా దినుసుల పై నిషేధం విధించారు.

  • Published May 17, 2024 | 11:43 AMUpdated May 17, 2024 | 11:43 AM
ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాలపై నిషేధం విధించిన నేపాల్.. కారణం ఇదే

భారతదేశంలోని ప్రముఖ బ్రాండెడ్ మసాలా ఉత్పత్తులపై విదేశాల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి.  ఇటీవలే పాపులర్ మసాలా బ్రాండ్ లో ఒకటి అయిన ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలా దినుసుల దిగుమతిపై సింగపూర్‌ లో వరుసగా   నిషేధం విధించిన విషయం తెలిసిందే.  కాగా, భారత్ లో తయారైన ఎవరెస్ట్ ఫిష్ కర్రీ, ఎండీహెచ్ మసాలలో పురుగుమందు అవశేసాలు అధిక స్థాయిలో ఉన్నాయని సింగ్ పూర్ ఆరోపించింది.  అలాగే ఈ మసాలా మిశ్రమంలో మానవ వినియోగానికి పనికిరాని పురుగుమందు ఇథిలీన్ ఆక్సైడ్ అధిక స్థాయిలో ఉందని గుర్తించిన హాంకాంగ్‌లోని సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ.. ప్రతిస్పందనగా చర్య తీసుకున్నట్టు ఈమేరకు ఓ ప్రకటన జారీ చేసింది.

అయితే భారత్‌లో తయారైన ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలో ఇథిలీన్ ఆక్సైడ్ స్థాయిలు నిర్దేశిత పరిమితికి మించి ఉన్నాయని హాంకాంగ్‌లోని వెంటనే రీకాల్ చేయాలని సింగ్‌పూర్ ఫుడ్ ఏజెన్సీ (SFA) గత నెల ఏప్రిల్‌ 18న ఓ ప్రకటనలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈ ఇండియాన్‌ బ్రాండ్లయిన ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలా దినుసుల దిగుమతిపై నిషేధం విధించినట్లు నేపాల్ ఫుడ్ టెక్నాలజీ విభాగం ప్రతినిధి మోహన్ కృష్ణ మహారాజన్ తెలిపారు. అంతేకాకుండా.. మార్కెట్‌లో ఈ మసాలా దినుసుల అమ్మకాలను కూడా నిషేధించినట్లు ఆయన వెల్లడించారు. ఇక ఈ మసాలాలలో హానికరమైన రసాయనాలు ఉన్నాయని వార్తలు రావడంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ రెండు బ్రాండ్ల మసాలా దినుసుల్లో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. విచారణ నివేదిక వచ్చే వరకు నిషేధం కొనసాగుతుంది. ఇప్పటికే ఈ భారతీయ మసాలా వినియోగాన్ని సింగపూర్, హాంకాంగ్ నిషేధించయని ఆయన తెలిపారు.

ఇకపోతే MDH, ఎవరెస్ట్ పేర్లు దశాబ్దాలుగా చాలా ఫేమస్.  అలాంటి మసాలలో మానవుల ప్రాణాలకు హాని కలుగుజేసే ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లుగా ఎస్‌ఎఫ్ఏ తేల్చింది. అయితే ప్రస్తుతం తక్కువ మొత్తంలో ఇథిలీన్ ఆక్సైడ్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, కానీ దీర్ఘకాలికంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఏజెన్సీ చెబుతోంది. ఇక ఇథిలీన్ ఆక్సైడ్ రంగులేని వాయువు. గది ఉష్ణోగ్రత వద్ద ఉంచినప్పుడు ఇది తీపి వాసనను ఇస్తుంది. నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (NCI) ప్రకారం.. ఈ వాయువు ఇథిలీన్ గ్లైకాల్ (యాంటీ-ఫ్రీజ్) వంటి రసాయనాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా.. వస్త్రాలు, డిటర్జెంట్లు, నురుగులు, మందులు, అంటుకునే పదార్థాలు మరియు ద్రావకాలు తయారీలో కూడా దీనిని వినియోగిస్తారు. అందువల్ల ఇది చాలా ప్రమాదకరని క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని కొన్ని పరిశోదనల్లో తేలింది. మరి, ఈ బ్రాండెడ్‌ మసాలను నేపాల్‌ లో కూడా నిషేధించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి