P Krishna
P Krishna
ఇటీవల ప్రపంచ దేశాలను భూకంపలు వణికిస్తున్నాయి. టర్కీ, సిరియా లో వచ్చిన భూకంప ప్రళయాన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నారు. ఈ విషాద ఘటనలో 50 వేల మంది మృతి చెందారు. వేల సంఖ్యలో గాయాలపాలయ్యారు.. కోట్ల నష్టం వాటిల్లింది. నిన్న ఆఫ్రికాలోని మొరాకోలో భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది. మరకేష్ నగరానికి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంప ధాటికి ఇప్పటి వరకు రెండు వేల మంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.
ఉత్తర ఆఫ్రికా దేశం మొరాకాను భూకంపం వణికించింది. ప్రపంచ దేశాల్లో అద్భుతమైన పర్యాటక కేంద్రం అయిన మరకేశ్ లో శుక్రవారం రాత్రి 11.11 గంటల సమయంలో భూకంపం సంభవించింది. 70 కిలో మీటర్ల దూరంలో అట్లాస్ పర్వత ్రాంతంలో 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప ధాటికి భవనాలు, కట్టడాలు నేలమట్టం అయ్యాయి. . కొన్నిచోట్ల గ్రామాలకు గ్రామలే ధ్వంసం అయినట్లు వార్తలు వస్తున్నాయి. భూకంప ప్రళయానికి ఇప్పటి వరకు రెండు వేల మంది మృత్యువాత పడగా.. మరో రెండు వేల మంది గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
దేశంలో ఆరు దశాబ్దాల్లో జరిగిన అతిపెద్ద విపత్తు ఇదే అంటున్నారు అధికారులు. మరకేశ్ ప్రాంతంలో ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరిగింది. దాదాపు ఈ భూకంప ప్రభావం 45 లక్షల మందిపై పడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. శిథిలాల తొలగింపు చేస్తున్న కుప్పలు కుప్పలుగా మృతదేహాలు బయటపడుతున్నాయని అధికారులు అంటున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని అధికారలు అంటున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కానీ కొన్నిచోట్ల రోడ్లపై పెద్ద రాళ్లు ఉండటంతో బాధితుల వద్దకు చేరుకోవడానికి ఆలస్యం అవుతుందని అధికారులు తెలిపారు.
#LeadStoryOnET | #Morocco #earthquake leaves at least 2,000 dead; damages historic landmarks and topples buildings https://t.co/bI4HJFQWIx
— Economic Times (@EconomicTimes) September 10, 2023