P Krishna
Dubai Rains: ఇటీవల వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదు. మునుపెన్నడూ లేని విధంగా యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. గత నెల నుంచి తరుచూ దుబాయ్ ని వర్షాలు భయపెడుతున్నాయి. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు.
Dubai Rains: ఇటీవల వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదు. మునుపెన్నడూ లేని విధంగా యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. గత నెల నుంచి తరుచూ దుబాయ్ ని వర్షాలు భయపెడుతున్నాయి. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు.
P Krishna
ఎడారి దేశంలో మునుపెన్నడూ లేని విధంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. దుబాయ్ లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఆకస్మికంగా కురిసిన వర్షాలకు దుబాయ్ మళ్లీ అతలా కుతలం అయ్యింది.. పలు చోట్ల జనజీవనం స్తంభించిపోయింది. అంతే కాదు రవాణా వ్యవస్థ ఎక్కడిక్కడ నిలిచిపోయింది. రెండు వారాల క్రితమే భారీ వర్షాలతో దుబాయ్ చిగురుటాకులా వణికిపోయింది. గురువారం మరోసారి కురిసిన కుండపోత వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమై వాహనాలు భారీ సంఖల్లో నీట మునిగిపోయాయి. వర్షాల కారణంగా ఉత్పన్నమయ్యే పరిస్థితిని ఎదుర్కోవడానికి సర్వం సిద్దం చేసినట్లు జాతీయ అత్యంసర సంక్షోభ, విపత్తు నిర్వహాణ సంస్థ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..
ఏడారి దేశం అయిన దుబాయ్ ని ఇప్పుడు వర్షాలు గజ గజ వణికిస్తున్నాయి.గత నెల 20న యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ) ని వరదలు ముంచెత్తాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ వరదలు ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. ఈ బాధ నుంచి ఇంకా కోలుకో ముందే గురువారం అబుదాబి, దుబాయ్ లో భారీ వర్షాలు, తుఫాన్ బీభత్సం సృష్టించింది. దీంతో పలు విమానాలు, బస్సు సర్వీసులు రద్దు చేయబడ్డాయి. దుబాయ్ కి వచ్చే ఐదు విమానాలను వెంటనే దారి మళ్లించారు. 9 ఇన్ కమింగ్, 4 ఔట్ గోయింగ్ విమానాలు రద్దు చేశారు. బలమైన గాలులు, ఉరుములు.. మెరుపులతో దుబాయ్ పౌరులు భీతిల్లిపోయారు. సాధారణంగా ఎడారి ప్రాంతం అనగానే ఇసుక తెన్నెలు గుర్తుకు వస్తాయి.. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా చిన్నపాటి చెరువులు, కుంటలు తలపిస్తున్నాయి.
దుబాయ్ లో గత 70 ఏళ్లలో ఎన్నడూ కురవని విధంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని స్థానికులు అంటున్నారు. గురువారం నుంచి కురుస్తున్న వర్షాలు శుక్రవారం, శనివారం కూడా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా ప్రజలు భద్రత నిబంధనలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది. ఆఫీస్ లకు వెళ్లే వారు వర్క్ ఫ్రమ్ హూం చేసుకోవాలని తెలిపింది. అలాగే స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అబుదాబిలో భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. జెబెల్ అలీ, అల్ మక్తుమ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, దుబాయ్ ఇండస్ట్రీరియల్ సిటీ, జుమెరాయి విలేజ్, ట్రైయాంగ్ ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీచాయని అక్కడ మీడియా తెలిపింది. కుండపోత వర్షాలు కురుస్తున్న క్రమంలో ఎవరు బయటకు రావొద్దని సూచించింది. అత్యవసర పరిస్థితి ఉంటేనే ఇంటి నుంచి బయటకు రావాలని తెలిపింది వాతావరణ శాఖ.