3 లక్షల కోట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్ట్! ఊహకి కూడా అందని రేంజ్ లో!

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో దుబాయ్ ఒకటి. ఐరోపా, ఉత్తర, దక్షిణ అమెరికా దేశాలు వెళ్లే చాలా మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయం నుంచే కనెక్టింగ్ విమానాలను ఎక్కుతారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్ట్‌గా విస్తరించనున్నారు

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో దుబాయ్ ఒకటి. ఐరోపా, ఉత్తర, దక్షిణ అమెరికా దేశాలు వెళ్లే చాలా మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయం నుంచే కనెక్టింగ్ విమానాలను ఎక్కుతారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్ట్‌గా విస్తరించనున్నారు

నిత్యం అనేక రకాల వార్తలు మనం చూస్తుంటాము.  అయితే కొన్ని రకాల వార్తలు మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా వివిధ ప్రాజెక్ట నిర్మాణాలు, ఇతర విషయాలు అందరికి ఆసక్తి కలిగిస్తాయి. అలానే తాజాగా ఓ విమాశ్రయం నిర్మాణం విషయంలో అరుదైన రికార్డు నెలకోల్పపడింది. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం నిర్మాణానికి దుబాయ్ ప్లాన్ సిద్ధం చేసింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన ఇంటర్నేషన్ల్ ఎయిర్ పోర్టగా విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరి.. ఆ విమానాశ్రయ ప్రత్యేకలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

దుబాయ్ అరుదైన రికార్డును నెలకొల్పనుంది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన విమానాశ్రయ నిర్మాణానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే అభివృద్ధి దశలో ఉన్న ‘దుబాయ్‌ వరల్డ్‌ సెంట్రల్‌’ లోని అల్‌ మక్తూమ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో 35 బిలియన్‌ డాలర్ల అంటే మన కరెన్సీలో రూ.2.9 లక్షల కోట్లతో కొత్త టెర్నినల్ నిర్మిచనున్నారు. ఈ నిర్మాణం పూరైతే ప్రస్తుత విమానాశ్రయం 5 రెట్లు మేర పెరగనుంది. వచ్చే పదేళ్లలో కార్యకలాపాలను అక్కడ నుంచే సాగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదే విషయాన్ని దుబాయ్‌ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదివారం ప్రకటించారు. ఇక ఈ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తైతే అరుదైన రికార్డును క్రియోట్ చేస్తుంది. అది ఏమిటంటే.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టుగా నిలవనుంది.

ఇక కొత్తగా నిర్మాణం చేయనున్నా  టెర్మినల్‌ను అల్‌ మక్తూమ్‌ అంతర్జాతీయ విమానశ్రయంగా పిలుస్తారు. ఈ కొత్త ప్రాజెక్టును చేపడుతున్నామని దుబాయ్ అధ్యక్షుడు ఆదివారం ఓ వీడియో ప్రకటను విడుదల చేశారు. ఏటా 26 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా ఈ విమానాశ్రయం అభివృద్ధి చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ కొత్త టెర్నినల్ లో మొత్తం 400 ఎయిర్‌క్రాఫ్ట్‌ గేట్లు, ఐదు సమాంతర రన్‌వేలతో సరికొత్త టెక్నాలజిని వినియోగించనున్నామని వివరించారు. లక్షలాది మంది నివాసం ఉండే అవకాశం ఉండడంతో ఇళ్ల నిర్మాణానికి, ఇళ్లకు భారీ డిమాండ్‌ ఏర్పడనుంది. అదే విధంగా లాజిస్టిక్‌, ఎయిర్‌పోర్టు రంగంలో అతిపెద్ద సంస్థలకు ఇది కేంద్రంగా మారనుంది.  మరి…దుబాయ్  లో ఏర్పాటు కానున్న ఈ కొత్త ఎయిర్ పోర్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.

Show comments