iDreamPost
android-app
ios-app

డోనాల్డ్ ట్రంప్‌కు తప్పిన ప్రమాదం.. ఏం జరిగిందంటే?

  • Published Aug 10, 2024 | 11:33 AM Updated Updated Aug 10, 2024 | 11:33 AM

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రచారం చేస్తున్న సమయంలో పలు ప్రమాదాలు వెంటాడుతున్నాయి.

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రచారం చేస్తున్న సమయంలో పలు ప్రమాదాలు వెంటాడుతున్నాయి.

  • Published Aug 10, 2024 | 11:33 AMUpdated Aug 10, 2024 | 11:33 AM
డోనాల్డ్ ట్రంప్‌కు తప్పిన ప్రమాదం.. ఏం జరిగిందంటే?

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఎప్పుడూ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఆయన ప్రస్తుతం అమెరికా అధ్యక్ష పోటీ రేసులో ఉన్నారు. ఈసారి ఎలాగైనా గెలుపు కైవసం చేసుకోవాలని ముమ్మర ప్రచారం కొనసాగిస్తున్నారు. ట్రంప్ ప్రచారం చేస్తున్న సమయంలో పలు ప్రమాదాలు ఎదురవుతున్నాయి. ఈ మధ్యనే పెన్సిల్వేనియాలో బట్లర్ లో ఏర్పాటు చేసిన ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో ఓ యువకుడు కాల్పులు జరిపాడు. అదృష్టం కొద్ది గురి తప్పి ప్రాణాలతో బయటపడ్డాడు ట్రంప్. తాజాగా డోనాల్డ్ ట్రంప్ మరో పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. వివరాల్లోకి వెళితే..

అమెరికాలో ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ అధ్యక్ష పదవి పోటీలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ ప్రచారం వేగవంతం చేశారు. ట్రంప్ కి ప్రత్యర్థిగా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షరాలు కమలా హ్యారీస్ గట్టి పోటీ ఇస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెంటానా స్టేట్‌లోని జోజ్‌మన్‌ టౌన్‌లో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొనడానికి బయలు దేరిన సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానం సాంకేతిక లోపాలు తలెత్తాయి. వెంటనే విమాన సిబ్బంది అలర్ట్ అయి లోపాలను సరిదిద్దారు. ఎలాంటి ప్రమాదం జరకగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలా ఉంటే.. గత నెలలో పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచారంలో పాల్గొన్న ట్రంప్ పై ఓ యువకుడు రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ట్రంప్ కొద్దిలో మిస్ అయ్యాడు.. ఆయన చేవికి గాయమై రక్తమోడింది..  వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది రక్షించి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాల్పులకు కారకుడైన యువకుడిని వెంటనే తుదముట్టించారు. ఈసారి అధ్యక్ష పదవి రేస్ లో ఉన్న ట్రంప్ ని పలు ప్రమాదాలు వెంటాడటంతో ఆయనకు మరింత రక్షణ కల్పించారు.  ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన అమెరికాలో అక్ష్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. బరిలో ఉన్న ట్రంప్,కమలా హ్యారీస్ నువ్వా అంటే నువ్వా అన్న చందగా పోటీ పడుతున్నారు. మరి ఈసారి విజయాం ఎవరిని వరిస్తుందో చూడాలి.