iDreamPost
android-app
ios-app

Dawood Ibrahim: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం పరిస్థితి విషమం!

  • Published Dec 18, 2023 | 9:26 AM Updated Updated Dec 18, 2023 | 9:26 AM

1993లో ముంబైలో జరిగిన బాంబు పెలుళ్ళు తల్చుకుంటే ఇప్పటికీ అక్కడ ప్రజలు భయంతో వణికిపోతారు. ఈ పేలుళ్ళతో ఎంతోమంది అమాయకుల ప్రాణాలు బలితీసుకున్న భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం పాక్ లో నివాసం ఉంటున్నాడు.

1993లో ముంబైలో జరిగిన బాంబు పెలుళ్ళు తల్చుకుంటే ఇప్పటికీ అక్కడ ప్రజలు భయంతో వణికిపోతారు. ఈ పేలుళ్ళతో ఎంతోమంది అమాయకుల ప్రాణాలు బలితీసుకున్న భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం పాక్ లో నివాసం ఉంటున్నాడు.

Dawood Ibrahim: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం పరిస్థితి విషమం!

దావూద్ ఇబ్రహీం.. ఈ పేరును దేశ ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కరలేదు. ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం.. 1993 నాటి ముంబై పేలుళ్ల ఘటనకు ముఖ్య సూత్రదారి. ఈ ఘటనలో ఎంతోమంది అమాయకులు చనిపోయారు.. కోట్ల నష్టం వాటిల్లింది. అప్పటి ముంబై పోలీసులు ఈ ఘటనను సీరియస్ గా తీసుకొని దావూద్ ని టార్గెట్ చేసుకోవడంతో భయపడి పాకిస్థాన్ పారిపోయినట్లు.. అక్కడే తలదాచుకున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లీస్ట్ లో అతని పేరు కొనసాగుతూనే ఉంది. తాజాగా దావూద్ ఇబ్రహీం పేరు సోషల్ మీడియాలో మరోసారి తెరపైకి వచ్చింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

గత కొంతకాలంగా పాకిస్థాన్ లో ఉంటూ.. తన నెట్ వర్క్ ని నడిపిస్తున్న భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్యంతో కరాచీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరినట్లు సోమవారం పాక్ వర్గాలు తెలిపినట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అతడు కరాచీ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు వార్తల సారాంశం. వాస్తవానికి గత రెండు రోజుల క్రితమే ఆస్పత్రిలో అడ్మిట్ అయినప్పటికీ భద్రతా దృష్ట్యా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు అక్కడి అధికారులు తెలిపినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ముంబై పోలీసులకు ఈ సమాచారం అందించడంతో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దావూద్ చికిత్స తీసుకుంటున్న ఆస్పత్రి చుట్టు భారీ ఎత్తున కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లుగా.. అతను ఉన్న హాస్పిటల్ ఫ్లోర్ మొత్తాని ఖాళీ చేయించినట్లు సమాచారం. ప్రస్తుతం అధికారుల, కుటుంబ సభ్యులు మాత్రమే అక్కడ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Poison experiment on Dawood Ibrahim

దావూద్ ఇబ్రహీం కి అతి సన్నిహితులే అతనిపై విష ప్రయోగం చేసినట్లూ ఊహాగానాలు వస్తున్నాయి.. కాకపోతే ఈ విషయాన్ని పాక్ అధికారులు ధృవీకరించలేదు. తీవ్రంగా అనారోగ్యానికి గురైన దావూద్ ని గుట్టు చప్పుడు కాకుకుండా కుటుంబ సభ్యులు, అతని అనుచరులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దావూద్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. చిన్న చిన్న నేరాలు చేసే దావూద్ కొంతమంది గ్యాంగ్ తో కలిసి ముంబైలో 1993లో పెలుళ్లకు కుట్ర చేశారు. ఈ కుట్రకు ప్రధాన సూత్రదారి దావూద్ ఇబ్రహీం. ఈ ఘటనలో 250 మంది అమాయక ప్రజలు చనిపోయారు.. వేలాది మంది గాయపడ్డరు, కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. పేలుళ్ల తర్వాత పాకిస్థాన్ కి పారిపోయి.. కరాచీలో తలదాచుకుంటున్నాడు. అప్పటి నుంచి భారత్ లో దావూద్ ని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా పేరు నమోదు చేశారు. ప్రస్తుతం దావూద్ ఆరోగ్యంపై అధికారిక ప్రకటన వెలువడటంతో ఈ విషయం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.