P Krishna
Chinese Girl: భారత దేశంలో సంప్రదాయ నృత్యం అయిన భరత నాట్యం ఎంతో ప్రసిద్ది చెందింది. పురాతన దేవాలయాల్లో భరత నాట్య భంగిమల్లో ఎన్నో శిల్పాటు చెక్కబడ్డాయి.
Chinese Girl: భారత దేశంలో సంప్రదాయ నృత్యం అయిన భరత నాట్యం ఎంతో ప్రసిద్ది చెందింది. పురాతన దేవాలయాల్లో భరత నాట్య భంగిమల్లో ఎన్నో శిల్పాటు చెక్కబడ్డాయి.
P Krishna
భారతీయ సంప్రదాయ నృత్యాల్లో భరత నాట్యం ఒకటి. నాట్య శాస్త్రం రచించిన భరతముని పేరుతో పుట్టి, ప్రసిద్ది గాంచింది ఈ శాస్త్రీయ నృత్య విధానం. మన దేశానికి చెందిన ఎంతమంది కళాకారులు దేశ, విదేశాల్లో భరత నాట్య ప్రదర్శనలు ఇస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ఇతర దేశస్తులు ఈ శాస్త్రీయ నాట్యం చేరుకోవడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు. దక్షిణ భారతదేశంలోని పురాతణ దేవాలయాల్లో శిల్పాలు భర్తనాట్య భంగిమల్లో అప్సరసలు నాట్యం చేస్తున్నట్లు తీర్చిదిద్దబడ్డాయి. సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది నటీమణులు భరత నాట్యంలో మంచి ప్రావిణ్యం సంపాదించిన వారే.. తాజాగా భరత నాట్య ప్రదర్శనలో ఓ చైనా బాలిక రికార్డు క్రియేట్ చేసింది. వివరాల్లోకి వెళితే..
విదేశీయులు భారత దేశ సంప్రదాయాలు అంటే ఎంతో ఇష్టపడుతుంటారు. కట్టు, బొట్టు, వంటకాలు మాత్రమే కాదు.. ఇక్కడి సాంప్రదాయ నృత్యాలు అన్నా తెగ ఇష్టపడుతుంటారు.గత కొంత కాలంగా పొరుగు దేశం అయిన చైనాలో మన సంప్రదాయ నృత్యం అయిన భరత నాట్యానికి ఎంతో ఆదరణ లభిస్తుంది. భరత నాట్యం నేర్చుకోవడానికి ఎంతోమంది చైనా విద్యార్థినులు భారత్ కి క్యూ కడుతున్నారు. బీజీంగ్ కి చెందిన లియ్ ముజీ (13) భరత నాట్య ప్రదర్శనలో అరంగెట్రం చేసి ప్రదర్శన ఇచ్చింది. ఆ బాలిక ప్రదర్శకు గొప్ప స్పందన వచ్చింది. చైనాలో భరత నాట్యం నేర్చకొని సోలోగా అరంగేట్రం చేసి తొలి బాలికగా ముజీ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
చైనాలో భారత రాయబారి ప్రదీప్ రావత్ అర్థాంగి శ్రుతి రావత్ చీఫ్ గెస్ట్ గా హాజరై బాలికను అభినందించారు. ఈ నెలాఖరులో చెన్నైలో నాట్య ప్రదర్శన ఇవ్వనుందని బాలిక గురువు జిన్ షాన్ చెప్పారు. ముజీ పదేళ్లుగా నాట్యం నేర్చుకుంటుందని వివరించారు. ఈ సందర్భంగా భారత రాయబారి కార్యాలయం ఇన్ చార్జి వివేకానంద్ మాట్లాడుతూ.. చైనాలో పూర్తి శిక్షణ పొంది అక్కడ అరంగేట్రం ప్రదర్శన ఇచ్చిన తొలి విద్యార్థిని ముజీ అని అన్నారు. కాగా, భరత నాట్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత విద్యార్థులు తమ గురువులు, ఇతరముల ముందు నాట్యప్రదర్శన చేయడం సంప్రదాయం. అలా చేయడం వల్ల ఎక్కడైన నాట్య ప్రదర్శన చేసే అవకాశం ఉంటుంది.. అలాగే ఇతరులకు నాట్యం గురువుల అనుమతి లభిస్తుంది.