iDreamPost
android-app
ios-app

వీడియో: తల్లి ప్రేమకు నిదర్శనం ఈ పిల్లి !

  • Published Sep 22, 2023 | 8:13 PM Updated Updated Sep 22, 2023 | 8:13 PM
  • Published Sep 22, 2023 | 8:13 PMUpdated Sep 22, 2023 | 8:13 PM
వీడియో: తల్లి ప్రేమకు నిదర్శనం ఈ పిల్లి !

ఈ సృష్టిలో తల్లి ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది. తల్లి తన బిడ్డనుంచి ఏదో ఆశించి సేవలు చేయదు. ఇష్టం, ప్రేమ, మమకారం ఇలా ఎన్నో విషయాలు తల్లిని తన పిల్లలవైపు మొగ్గు చూపేలా చేస్తాయి. తల్లి తన బిడ్డ కోసం ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా భరిస్తుంది. తాను ఆకలితో పస్తులు ఉన్నా పర్లేదు కానీ, బిడ్డల కడుపు నింపాలని భావిస్తుంది. మనుషులే కాదు.. జంతువుల్లోనూ ఇదే విధంగా ప్రేమాను రాగాలు ఉంటాయి. ఇందుకు తాజా సంఘటన ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది.

ఓ పిల్లి తన పిల్లల కడుపు నింపడానికి ఏకంగా సూపర్‌ మార్కెట్‌లో దొంగతనం చేసింది. పిల్లల కోసం తెగించి మరీ మాంసాన్ని తీసుకెళ్లింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. టర్కీకి చెందిన ఓ పిల్లి కొద్దిరోజుల క్రితం ఓ సూపర్‌ మార్కెట్‌కు వెళ్లింది. అక్కడ ఓ చికెన్‌ ప్యాకెట్‌ను అది దొంగిలించింది. ఎలాంటి జంకు, గొంకు లేకుండా మెల్లగా ఆ ప్యాకెట్‌ను బయటకు తీసుకెళ్లసాగింది. సిబ్బంది అది చికెన్‌ ప్యాకెట్‌ తీసుకెళ్లటం గుర్తించారు. దాన్ని ఏమీ అనకుండా ఫాలో అయ్యారు.

అది ఆ చికెన్‌ ప్యాకెట్‌ను లాక్కుంటూ దూరంగా ఉన్న ఓ చోటుకు చేరింది. అక్కడ పిల్లి పిల్లలు ఉండటంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ పిల్లి తన పిల్లల ఆకలి తీర్చటం కోసం దొంగతనం చేసిందని తెలిసింది.. వారి కళ్లు చెమ్మగిల్లాయి. దాన్ని ఏమీ అనకుండా అక్కడినుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. తల్లి ప్రేమంటే అలానే ఉంటుందని అంటున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomfixbetcasibomfixbetcasibomfixbetcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet