P Krishna
ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ బాధితులవుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ బాధితులవుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు.
P Krishna
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూ వస్తున్నాయి. కొంతమంది డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. పెద్ద దిక్కు కోల్పోయి ఎంతోమంది అనాథలుగా మిగులుతున్నారు. నిత్యం ఇలాంటి ఘటనలు పదుల సంఖ్యల్లో జరుగుతున్నాయి. విజయవాడ బస్టాండ్ లో సోమవారం బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల మూడు నిండు ప్రాణాలు బలైనాయి. ఫ్లాట్ ఫామ్ వద్దకు వచ్చిన డ్రైవర్ గేర్లు మార్చే విషయంలో అనుభవ రాహిత్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే ఆస్ట్రేలియాలోని విక్టోరియా గ్రామీణ ప్రాంతంలో చోటు చేసుకుంది. అదుపు తప్పిన ఓ కారు పబ్ లోకి దూసుకువెళ్లడంతో ఐదుగురు నిండు ప్రాణాలు బలయ్యాయి. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. బాధితులంతా భారత సంతతి కుటుంబాలకు చెందిన వారే అంటున్నారు. వివరాల్లోకి వెళితే..
ఆస్ట్రేలియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విక్టోరియా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఓ పబ్ లో అతి వేగంగా కారు దూసుకు పోవడంతో ఐదుగురు భారతీయ సంతతికి చెందిన వారు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ దారుణ ఘటన విక్టోరియాలోని డేలెస్ ఫోర్డ్ లో ఆదివారం జరిగినట్లు మీడియా రిపోర్టులు వెల్లడించాయి. రాయల్ డేల్ ఫోర్డ్ హూటల్ ముందు లాస్ లో నిల్చున్న వారి మీదకు వైట్ బీఎండబ్ల్యూ ఎస్‌యూవీ అది వేగంగా దూసుకు వెళ్లడంతో ఆ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదంలో మరణించిన వారి పేర్లు వివేక్ భాటియా (38), అతని కుమారుడు విహాన్ (11), ప్రతిభ శర్మ (44) ఆమె కూతురు ఆన్వీ (9), జతిన్ చూగ్ (30) లు ఉన్నారని విక్టోరియా చీఫ్ పోలీస్ కమిషనర్ షేన్ పాటన్ తెలిపారు. ఈ ప్రమాదంలో భాటియా భార్య రుచి, కుమారుడు అబీర్ తీవ్రంగా గాయపడటంతో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రమాదంలో మరికొంత మంది స్వల్పంగా గాయపడటంతో వారందరూ చికిత్స పొందుతున్నట్లు వివరించారు.
ఇక ఈ దారుణ ప్రమాదానికి కారకుడైన బీఎండబ్ల్యూ డ్రైవర్ వయసు 66 సంవత్సరాలని, అతడు మౌంట్ మాసిడోన్ కి చెందిన వ్యక్తి ని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారకుడైన ఆ వ్యక్తి నుంచి శాంపిల్స్ తీసుకొని ఆల్కాహాల్ పరీక్షలు నిర్వహించగా మద్యం తీసుకోలేదని తేలింది. రక్త నమూనాలను కూడా విశ్లేషించనున్నట్లు పోలీస్ అధికారి షేన్ పాటన్ వివరించారు. అప్పటి వరకు ఎంతో ఆనందంగా ఉన్న రెండు కుటుంబాలు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయాయి. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న బాధిత బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.