బ్రేకింగ్: దూసుకొస్తున్న కార్చిచ్చు! కెనడా నగరం ఖాళీ!

  • Author Soma Sekhar Published - 08:34 PM, Thu - 17 August 23
  • Author Soma Sekhar Published - 08:34 PM, Thu - 17 August 23
బ్రేకింగ్: దూసుకొస్తున్న కార్చిచ్చు! కెనడా నగరం ఖాళీ!

అమెరికాను వణికించిన కార్చిచ్చులు.. ఇప్పుడు కెనడాను వణికిస్తున్నాయి. ఇప్పటికే అమెరికాలోని హవాయి ద్వీప సమూహంలో ఈ కార్చిచ్చుల కారణంగా సుమారు 100 మందికిపైగా మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పుడు ఈ అగ్ని కిలల దావానలంలా వ్యాపిస్తూ.. కెనడా వైపు పరుగులు పెడుతున్నాయి. దీంతో కెనడా వాసులు వణికిపోతున్నారు. కార్చిచ్చు దూసుకొస్తుండటంతో.. అధికారులు అప్రమత్తమైయ్యారు. నార్త్ వెస్ట్ టెర్రిటరీస్ రాజధాని ఎల్లోనైఫ్ నగరాన్ని ఖాళీ చేయిస్తున్నారు. మంటలు నగరం వైపు వేగంగా దూసుకువస్తుండటంతో.. ప్రజలంతా త్వరగా ఇల్లు ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

అమెరికాను వణికించిన కార్చిచ్చు ఇప్పుడు కెనడా వైపు దూసుకొస్తోంది. భారీ గాలులు వీస్తుండటంతో.. కార్చిచ్చు వేగంగా వ్యాప్తి చెందుతోందని అధికారులు చెబుతున్నారు. దీంతో నార్త్ వెస్ట్ టెర్రిటరీస్ రాజధాని ఎల్లోనైఫ్ పట్టణాన్ని ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. ఇక ఇప్పటికే ఎల్లోనైఫ్ నగరంలో ఎమర్జెన్సీ ప్రకటించారు అధికారులు. కాగా.. కెనడా వ్యాప్తంగా 1070 కార్చిచ్చులు క్రియాశీలకంగా ఉన్నాయని అక్కడి అగ్నిమాపకశాఖ ప్రకటించింది. ఇక ఈ కార్చిచ్చును నియంత్రించడానికి 100 మంది సైనికులను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 3వేల జనాభా ఉన్న హేరివర్ పట్టణంలో కూడా జనాభా తరలింపు జరుగుతోందని తెలిపారు. గతంలో వచ్చిన కార్చిచ్చు కంటే రెండింతల నేల కాలిబూడిదైనట్లు అక్కడి అధికారులు వెళ్లడించారు.

ఇదికూడా చదవండి: క‌మ‌ల్ సినిమాలో ర‌జ‌నీకాంత్‌? మణిరత్నం పెద్ద ప్లాన్ వేశాడు!

Show comments