iDreamPost
android-app
ios-app

కెనడాలో వాక్-ఇన్ ఓవెన్‌లో శవమై తేలిన భారతీయ ఉద్యోగిని! అసలేం జరిగింది?

  • Published Oct 26, 2024 | 4:51 PM Updated Updated Oct 26, 2024 | 4:51 PM

Canada Crime News: విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లిన వారు అర్థాంతరంగా కన్నుమూస్తున్న ఘటనలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొన్ని అనుకోని ప్రయాదాలు అయితే.. కొన్ని మాత్రం అనుమానాస్పద మరణాలు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది.

Canada Crime News: విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లిన వారు అర్థాంతరంగా కన్నుమూస్తున్న ఘటనలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొన్ని అనుకోని ప్రయాదాలు అయితే.. కొన్ని మాత్రం అనుమానాస్పద మరణాలు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది.

కెనడాలో వాక్-ఇన్ ఓవెన్‌లో శవమై తేలిన భారతీయ ఉద్యోగిని! అసలేం జరిగింది?

కెనడాలోని హాలిఫాక్స్ నగరంలోని ఓ బెకరీ స్టోర్స్ లో వాక్-ఇన్ ఓవెన్‌లో భారత్ కు చెందిన ఓ మహిళ శవమై కనిపించడం సంచలనంగా మారింది. మృతురాలు బేకరీలో పని చేస్తున్న గుర్ సిమ్రాన్ కౌర్ (19)గా గుర్తించారు. ఆమె సిక్కు కమ్యూనిటీకి చెందిన మహిళగా ధృవీకరించారు హాలిఫాక్స్ ప్రాంతీయ పోలీసులు. మొదట గుర్తు తెలియని మృతదేహంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సిమ్రాన్ కౌర్ మృతదేహాన్ని గుర్తించిన ఆమె తల్లి కన్నీరుమున్నిరయ్యింది. దారుణ విషయం ఏంటంటే బతికి ఉండగానే ఓవెన్ లో వేసి కాల్చారన్న అనుమానాలు వస్తున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంతకీ అసలు ఏం జరిగిందీ? అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

విదేశంలో మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని ఎన్నో ఆశలు, కలలతో కెనడాకు వచ్చిన అందమైన యువతి అత్యంత విషాదంగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. భారత్ కు చెందిన సిమ్రాన్ కౌర్.. ఆమె తల్లి మూడేళ్ల క్రితం కెనడాకు ఉద్యోగరిత్యా వెళ్లారు. కౌర్ తండ్రి, సోదరుడు భారత్ లోనే ఉద్యోగం చేస్తున్నారు. తల్లీకూతురు కెడాలో ఓ ఫేమస్ బేకరీ స్టోర్స్ లో పనిచేస్తున్నారు. తల్లీ కూతురికి స్థానిక సిక్కు కమ్యూనిటీలో మంచి పేరు ఉంది. సిమ్రాన్ ఎప్పుడూ చలాకీగా ఉంటుందని.. అందరితో స్నేహపూర్వకంగా ఉంటుందని స్థానికులు తెలిపారు. ప్రతి పండగకు అందరం కలిసి సెలబ్రెట్ చేసుకునేవాళ్లం అని ఆమె స్నేహితులు కన్నీరు పెట్టుకున్నారు. అక్టోబర్ 19, శనివారం వారు చేస్తున్న సోర్ తెరిచి ఉండటంతో అక్కడి వెళ్లింది కౌర్ తల్లి. ఆ సమయంలో బేకరీ డిపార్ట్‌మెంట్ లో వెళ్లి చూడగా కాలిపోయిన తన బిడ్డను చూసి షాక్ కి గురైంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.

పోలీసులు హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి పరిశీలించారు. ఓవెన్ లో చనిపోయింది గుర్ సిమ్రాన్ కౌర్ అని ఆమె తల్లిద్వారా కన్ఫామ్ చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే ఆమె ప్రమాద వశాత్తు పడిపోయిందా? లేక ఎవరైనా కావాలని ఆమెను హత్య చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ బేకరీ స్టోర్స్ ని మూసివేశారు. ఇప్పటి వరకు ఎలాంటి క్లూ లభించలేదని, ఎట్టి పరిస్థితుల్లో నిందితున్ని పట్టుకొని శిక్షిస్తామని హాలిఫాక్స్ ప్రాంతీయ పోలీసు అధికారి మార్టిన్ క్రోమ్‌వెల్ తెలిపారు. ఇదిలా ఉంటే.. సిమ్రాన్ కౌర్ అంత్యక్రియల ఖర్చులకు సహాయం, ఇతర కుటుంబ సభ్యులను కెనడాకు తరలించరేందుకు గోఫండ్ బి కేవలం 10 గంటల్లో ఒక లక్షా, 30 వేల డాటర్ల ఫండ్ ని సేకరించింది. ఇంత తక్కువ సమయంలో ఎంతో గొప్ప స్పందన వచ్చిందని అన్నారు గోఫండ్‌బీ సభ్యులు. విదేశాల్లో జాబ్ చేస్తూ కుటుంబాన్ని మంచి పొజీషన్ లోకి తీసుకురావాలన్న ఓ యువతి జీవితం ఇలా అర్థాంతరంగా ముగిసి పోవడం చాలా బాధాకరంగా ఉందని గోఫండ్‌బీ నిర్వాహకులు తెలిపారు.