P Krishna
Bus Plunges from Bridge: ఈస్టర్ పండుగ సెలబ్రేషన్స్ కోసం ఎంతో సంతోషంగా బస్సులో బయలుదేరారు. అంతలోనే విధి వారిని చిన్నచూపు చూసింది.
Bus Plunges from Bridge: ఈస్టర్ పండుగ సెలబ్రేషన్స్ కోసం ఎంతో సంతోషంగా బస్సులో బయలుదేరారు. అంతలోనే విధి వారిని చిన్నచూపు చూసింది.
P Krishna
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలు పదుల సంఖ్యల్లో జరుగుతున్నాయి. డ్రైవర్ చేసే చిన్న పొరపాటు ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అతి వేగం, నిర్లక్ష్యం, అవగాహన లేమి, మద్యం మత్తులో వాహనాలు నడపడం ఇలా ఎన్నో కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదంలో ఇంటి పెద్దలు చనిపోవడంతో ఎంతోమంది అనాథలుగా మిగిలిపోతున్నారు. భద్రత చర్యలు కట్టుదిట్టం చేస్తున్నా ఈ ప్రమాదాలను అరికట్టలేకపోతున్నారు. బస్సు ప్రమాదం తీవ్ర విషాదం మిగిల్చింది. వివరాల్లోకి వెళితే..
దక్షిణాఫ్రికాలో పండుగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ బస్సు అదుపు తప్పి వంతెనపై నుంచి పడిపోయింది. ఈ దుర్ఘటనలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ 8 ఏళ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది. కాకపోతే బాలికకు తీవ్రంగా గాయాలు అయ్యాయి.. ప్రస్తుతం చికిత్స పొందుతుంది. ఈస్టర్ పండుగ కోసం బస్సులో 46 మంది ప్రయాణిస్తుండగా ఈ ఘోర ఘటన చోటు చేసుకుంది. అంత ఎత్తు నుంచి లోయలో పడిపోవడంతో బస్సులో మంటలు చెలరేగాయి.. దీంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది.
లింపోపోలోని ఈశాన్య ప్రావిన్స్ మమట్లకల సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ బస్సును అదుపు చేయలేకపోయాడు. దీంతో వంతెన పై ఉన్న అడ్డంకులను ఢీ కొట్టడంతో బస్సు బోల్తా పడింది. బస్సులో మంటలు చెలరేగడంతో పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో ఒక్క చిన్నారి మాత్రమే ప్రాణాలతో బయటపడిందని రవాణా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మకాలిపోయాయి. మరికొంతమంది శిథిలాల లోపల చిక్కుకున్నారు. మృతుల కుటుంబలకు ఇరు దేశాల అధ్యక్షులు సానుభూతి తెలిపారు.